Whatsapp: మీరు వాట్సాప్‌ను వాడుతున్నారా.? అయితే వెంటనే ఈ పనిచేయండి లేదంటే.. డేంజర్‌లో పడ్డట్లే..

|

Sep 30, 2022 | 1:34 PM

మారుతోన్న టెక్నాలజీ అనుగుణంగా నేరాలు కూడా మారుతున్నాయి. సైబర్‌ నేరగాళ్లు టెక్నాలజీని ఆయుధంగా మలుచుకొని డబ్బును కాజేస్తున్నారు. ఫోన్‌లలోకి మాల్‌వేర్లను పంపిస్తూ యూజర్ల డేటాను కాజేస్తున్నారు. మొన్నటికి మొన్న బ్యాంకింగ్ మొబైల్‌ అప్లికేషన్స్‌ ద్వారా....

Whatsapp: మీరు వాట్సాప్‌ను వాడుతున్నారా.? అయితే వెంటనే ఈ పనిచేయండి లేదంటే.. డేంజర్‌లో పడ్డట్లే..
Whatsapp Bug
Follow us on

మారుతోన్న టెక్నాలజీ అనుగుణంగా నేరాలు కూడా మారుతున్నాయి. సైబర్‌ నేరగాళ్లు టెక్నాలజీని ఆయుధంగా మలుచుకొని డబ్బును కాజేస్తున్నారు. ఫోన్‌లలోకి మాల్‌వేర్లను పంపిస్తూ యూజర్ల డేటాను కాజేస్తున్నారు. మొన్నటికి మొన్న బ్యాంకింగ్ మొబైల్‌ అప్లికేషన్స్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్లలోకి మాల్‌వేర్‌ను పంపిస్తూ.. ఫోన్‌ను హ్యాక్‌ చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయమై దేశీయ దిగ్గజ బ్యాంకింగ్ సంస్థ ఎస్‌బీఐ తమ కస్టమర్లకు అలర్ట్‌ చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఇలాంటి మరో బగ్‌ వెలుగులోకి వచ్చింది. ఈసారి వాట్సాప్‌ను టార్గెట్‌ చేశారు.

ఈ విషయమై తాజాగా ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సీఈఆర్‌టీ-ఇన్‌) యూజర్లను అలర్ట్‌ చేసింది. వాట్సాప్‌లో సెక్యూరిటీలో కొన్ని లోపులు ఉన్నట్లు గుర్తించింది. వాట్సాప్‌ వీ2.22.16.12 వెర్షన్‌ వాడుతున్న వారు ఈ సెక్యూరిటీ బగ్‌కు గురయ్యే అవకాశం ఉందని సీఈఆర్‌టీ-ఇన్‌ తెలిపింది. ఈ వెర్షన్‌ వాట్సాప్‌ వాడుతున్న యూజర్లు వెంటనే యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఉపయోగిస్తున్న వారు అప్‌డేట్‌ చేసుకోవాలని వాట్సాప్‌ తమ యూజర్లను అలర్ట్‌ చేసింది.

ఈ బగ్‌ సహాయంతో హ్యాకర్లు ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ స్మార్ట్‌ ఫోన్లను టార్గెట్‌ చేస్తూ సమాచారాన్ని దోచే ప్రమాదం ఉందని సీఈఆర్‌టీ తెలిపింది. ముఖ్యంగా ఈ బగ్‌ స్మార్ట్‌ఫోన్‌లోని వీడియో ఫైల్స్‌ను హ్యాకర్లు యాక్సెస్‌ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా కొన్ని కమాండ్స్‌ ఆధారంగా యూజర్ల డివైజ్‌లను రిమోట్‌గా యాక్సెస్‌ చేసే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ ప్రమాదం బారని పడకూడదంటే యూజర్లు.. వెంటనే వాట్సాప్‌ వెర్షన్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. కొత్త వెర్షన్‌ యాప్‌లో వాట్సాప్‌ ఈ సమస్యలకు చెక్‌ పెట్టింది. సో యూజర్లు వెంటనే తమ వాట్సాప్‌ వెర్షన్‌ను చెక్‌ చేసుకొని పాత వెర్షన్‌ ఉంటే అప్‌డేట్‌ చేసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..