Kantar-Google report: న్యూస్‌ రీడింగ్‌లో ప్రాంతీయ భాషలదే హవా.. కాంతార్‌-గూగుల్‌ రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు..

|

May 04, 2023 | 9:24 PM

ఆన్‌లైన్‌లో ప్రాంతీయ భాషల్లో వార్తలు చదవడానికి పాఠకులు ఆసక్తి చూపిస్తారని తాజా సర్వేలో తేలింది. గూగుల్, కాంతార్‌ సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. స్మార్ట్‌ఫోన్‌ వినియోగం పెరగడం, ఇంటర్నెట్‌ అందరికీ అందుబాటులోకి రావడంతో ఆన్‌లైన్‌లో వార్తలు చదివే భారతీయుల సంఖ్య...

Kantar-Google report: న్యూస్‌ రీడింగ్‌లో ప్రాంతీయ భాషలదే హవా.. కాంతార్‌-గూగుల్‌ రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు..
Google
Follow us on

ఆన్‌లైన్‌లో ప్రాంతీయ భాషల్లో వార్తలు చదవడానికి పాఠకులు ఆసక్తి చూపిస్తారని తాజా సర్వేలో తేలింది. గూగుల్, కాంతార్‌ సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. స్మార్ట్‌ఫోన్‌ వినియోగం పెరగడం, ఇంటర్నెట్‌ అందరికీ అందుబాటులోకి రావడంతో ఆన్‌లైన్‌లో వార్తలు చదివే భారతీయుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌లు వార్తలు చదవడానికి ప్రధాన వనరుగా మారాయి. పాఠకుల ఇష్టాలకు అనుగుణంగా గూగుల్‌ కూడా భారతీయ భాషలకు ప్రాధాన్యత ఇస్తోంది.

భారతీయులు ఎలాంటి వార్తలు తెలుసుకోవాలనుకుంటున్నారు.? వార్తలు తెలుసుకోవడానికి ఏ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్నారన్న అంశాలను కాంతర్‌-గూగుల్‌ నివేదికలో ప్రస్తావించారు. హిందీతోపాటు ఇతర భారతీయ భాషల యూజర్లను సైతం గూగుల్‌ ఈ సర్వేలో భాగం చేసుకుంది. నివేదిక ప్రకారం.. యూజర్లు వార్తలను ఎంచుకునే సమయంలో మూడు విషయాలపై శ్రద్ధ వహిస్తున్నారు. వీటిలో మొదటిది వార్తల అంశం, భాష, అభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక రెండోది వార్తలు ప్రచురితమయ్యే వెబ్‌సైట్ కానీ యాప్‌ కానీ ఏంటనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇక చివరి అంశం వార్తలు ఏ ఫార్మాట్‌లో పబ్లిష్‌ అయ్యాయన్న విషయాన్ని కూడా యూజర్లు పరిగణలోకి తీసుకుంటున్నారు. ఉదాహరణకు ఆడియో, వీడియో లేదా టెక్ట్స్‌.

ఏయే అంశాలకు సంబంధించిన వార్తలు చదువుతున్నారంటే..

* భారతీయ రీడర్లు ఎక్కువగా నమ్మకంగా ఉండే వార్తలు. సరళమైన భాష, సరైన సోర్స్‌ ఉన్న వార్తలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

* క్రైమ్‌, వినోదం, ట్రెండింగ్‌ అంశాలకు సంబంధించిన వార్తలను ఎక్కువగా చదువుతున్నారు. నాన్‌ న్యూస్‌ విభాగంలో వీటి తర్వాత ఆరోగ్యం, టెక్నాలజీ, ఫ్యాషన్‌ విభాగాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

* సర్వేలో తేలిన వివరాల ప్రకారం.. ఆన్‌లైన్‌లో వార్తలు చదువుతున్న 10 మంది రీడర్స్‌లో ఏడుగురు తమ నగరానికి సంబంధించి వార్తలను చదువుతున్నారు. ఈ కారణంగా ప్రాంతీయ భాషల్లో వార్తలు చదివే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది.

* సగటున కేవలం 5.05 శాతం మంది మాత్రమే వార్తలను చదవడానికి న్యూస్‌ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగిస్తున్నారు. వీరిలో 93 శాతం మంది యూట్యూబ్‌ ద్వారా, 88 శాతం మంది సోషల్‌ మీడియా యాప్‌ ద్వారా, 82 శాతం మంది మెసేంజర్‌ యాప్‌ల ద్వారా వార్తలు చదువుతున్నారు.

* ఆన్‌లైన్‌ వార్తల కోసం మీడియా వెబ్‌సైట్‌లను, మొబైల్‌ యాప్‌లను ఉపయోగించే వారు 45 శాతం ఉన్నారు. మరోవైపు ఏ వార్తలో ఎంత నిజం ఉందో అంచనా వేస్తున్నారు.

* ఆసక్తికరమైన, ఆకర్షణీయమైన హెడ్డింగ్స్‌తో ఉన్న వార్తా కథనాలపై యూజర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. కొన్ని రకాల ప్రకటనలు, సరిగా లేని డిజైన్‌ కారణంగా వెబ్‌సైట్‌లకు యూజర్లు దూరమవుతున్నట్లు సర్వేలో తేలింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..