ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం అనేది తప్పనిసరిగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఫోన్ కూడా నిత్యావసర వస్తువులా మారిపోయింది. ముఖ్యంగా కరోనా లాక్‌డౌన్ తర్వాత స్మార్ట్‌ఫోన్ వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో కూడా భారీగా పెరిగింది. స్మార్ట్‌ఫోన్ అంటేనే టచ్ స్క్రీన్‌తో పని చేస్తుంది. కాబట్టి ఫోన్ చాలా సున్నితంగా ఉంటుంది. ఫోన్‌ను కూడా మనం అలానే వాడాల్సి ఉంటుంది. అయితే అనుకోని పరిస్థితుల్లో లేదా పిల్లల దగ్గర ఫోన్ ఉన్నప్పుడో? ఫోన్ కింద పడిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఫోన్‌కు ఏమి అవ్వకపోతే పర్లేదు కానీ.. చాలా సందర్భాల్లో ఫోన్ డిస్‌ప్లే పగిలిపోతూ ఉంటుంది. ఫోన్ డిస్‌ప్లే పగిలిపోవడం అంటే టచ్, డిస్‌ప్లే కాంబోను మార్చాల్సి ఉంటుంది. ఇది చాలా ఖరీదుతో కూడుకున్నదిగా ఉంటుంది. అంటే ఓ సాధారణ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే మార్చాలి అంటే దాదాపు రూ.1500 నుంచి రూ. 4000 వరకూ ఉంటుంది. మొత్తం ఫోన్ రిపేర్‌లో ఇదే భారీ ఖర్చుతో కూడుకున్న పని. అయితే ప్రస్తుతం ఫోన్ డిస్‌ప్లే మార్చాల్సి వస్తే ఎవరికి వారే మార్చుకునేలా ఓ కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఈ తాజా టెక్నాలజీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
రాబోయే ఐదేళ్లల్లో స్వీయ-రిపేర్ చేసేలా డిస్‌ప్లేలతో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వస్తాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే అన్ని ఫోన్ కంపెనీలు ఇప్పటికే సెల్ఫ్ రిపేర్ చేసుకునే డిస్‌ప్లేల గురించి పరిశోధనలు చేశాయి. ఇలాంటి ఫోన్ల ఉపరితలంపై “నానో-కోటింగ్”ని కలిగి ఉంటుంది. ఇది స్క్రాచ్ అయినప్పుడు, గాలి, తేమతో ప్రతిస్పందించడం ద్వారా కొత్త మెటీరియల్‌ని సృష్టించగలదు. అయితే ఈ సాంకేతికతను అమలు చేయడంలో అతిపెద్ద సమస్య ప్రేక్షకుల్లో సరైన అంచనాలను సెట్ చేయడంపై ఆధారపడి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లలో సెల్ఫ్ హీలింగ్ టెక్నాలజీ కొత్త కాన్సెప్ట్ కాదు. 2013లో ఎల్‌జీ ఈ సాంకేతికతపై పని చేసింది. ఫోన్ దెబ్బతిన్నప్పుడు స్వీయ-రిపేర్ చేసే బ్యాక్ ప్యానెల్‌ను కలిగి ఉన్న ఓ స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది . అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ఎలా పని చేస్తుందనే విషయాన్ని ఎల్‌జీ ఎక్కువ సమాచారాన్ని పంచుకోలేదు.
నిపుణులు తెలిపే వివరాల ప్రకారం స్వీయ-రిపేరింగ్ లక్షణాలను ప్రారంభించేలా డిస్ప్లే టెక్నాలజీలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంది. అయితే ఈ సాంకేతికత పూర్తిగా స్మాష్ అయిన డిస్‌ప్లేను సరిచేయలేకపోవచ్చని గమనించాలి. ముఖ్యంగా ఇది చిన్నచిన్న గీతలు సరిదిద్దుతుంది. మోటోరోలా, ఆపిల్ వంటి బ్రాండ్‌లు సెల్ఫ్-హీలింగ్ డిస్‌ప్లే టెక్నాలజీకి సంబంధించిన అనేక పేటెంట్‌లను ఫైల్ చేశాయి. ఇది షేప్ మెమరీ పాలిమర్‌ను ఉపయోగిస్తుంది. ముఖ్యంగా ఇది గది ఉష్ణోగ్రత కంటే కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు, స్క్రీన్‌పై గీతలు, పగుళ్లను స్వయంచాలకంగా పరిష్కరిస్తుంది. యాపిల్ తన రాబోయే ఫోల్డబుల్ ఐఫోన్ కోసం కూడా ఇదే విధమైన సాంకేతికతను కలిగి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయితే అధిక ఉత్పత్తి వ్యయం కారణంగా కనీసం మొదటి కొన్ని సంవత్సరాల్లో ఈ సాంకేతికత హై-ఎండ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లకు పరిమితం కావచ్చు. సాంకేతికత పరిపక్వం చెందుతున్నప్పుడు ఇది నెమ్మదిగా బడ్జెట్, మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్‌లకు అందుబాటులోకి వస్తుంది. ఈ సాంకేతికత ప్రధాన స్రవంతిలో ఉండాలంటే దీన్ని ఫీచర్ చేసే ఫోన్‌లు వాణిజ్యపరంగా విజయం సాధించాల్సి ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..