Tokyo Olympics 2020: పీవీ సింధు, అతాను దాస్, అమిత్ పంగల్‌‌పై భారీ అంచనాలు.. ఈ రోజు భారత అథ్లెట్ల షెడ్యూల్

|

Jul 31, 2021 | 6:03 AM

రియో ఒలింపిక్స్‌లో భారతదేశానికి పతకం సాధించిన పీవీ సింధు.. మరోసారి పతకం సాధించేందుకు సిద్ధమైంది. అయితే, ఈ రోజు ఆమె ముందు కఠినమైన సవాలు ఉంది.

Tokyo Olympics 2020: పీవీ సింధు, అతాను దాస్, అమిత్ పంగల్‌‌పై భారీ అంచనాలు.. ఈ రోజు భారత అథ్లెట్ల షెడ్యూల్
Sindhu Amit Atnu
Follow us on

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్ -2020 లో శుక్రవారం ఫలితాలు భారతదేశానికి అనుకూలంగా వచ్చాయి. బాక్సింగ్ నుంచి మహిళా క్రీడాకారిణి లవ్లినా బోర్గోహైన్ 69 కిలోల విభాగంలో సెమీ ఫైనల్‌కు చేరుకుని పతకం నిలబెట్టుకుంది. కాగా, ఈ రోజు(జులై31) శనివారం భారత అథ్లెట్లకు కూడా చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు రియో ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధు మహిళల సింగిల్స్ విభాగంలో సెమీ ఫైనల్స్ ఆడనుంది. అలాగే బాక్సర్ అమిత్ పంగల్‌పై కూడా చాలా ఆశలు ఉన్నాయి. భారతదేశం పతకం ఆశించిన అతిపెద్ద పతక ఆశావహులలో అమిత్ ఒకరు. ఆర్చరీలో అతాను దాస్ క్వార్టర్‌ఫైనల్స్‌లో పాల్గొంటాడు. పతకాన్ని కూడా గెలుచుకుంటాడని అంచనాలు ఉన్నాయి.

షూటింగ్‌లో కూడా అంజుమ్ మోడ్గిల్, తేజస్విని సావంత్ ఈ రేంజ్‌లో అడుగుపెడతారు. అత్యంత ముఖ్యమైన మహిళల హాకీ జట్టు మ్యాచ్ ఈ రోజు జరగనుంది. ఈ రోజు ఐర్లాండ్‌ను ఓడించిన జట్టు తన క్వార్టర్ ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంటుంది. శనివారం మరో విజయంపై హాకీ మహిళలు దృష్టి పెట్టారు.

టోక్యో ఒలింపిక్స్‌లో భారత షెడ్యూల్.. (భారత కాలమాన ప్రకారం)
ఆర్చరీ:
ఉదయం 7.18: అతాను దాస్ వర్సెస్ తకహారు ఫురుకావా (జపాన్), క్వార్టర్ ఫైనల్స్

అథ్లెట్స్:
ఉదయం 6 గంటల నుంచి: మహిళల డిస్కస్ త్రో, సీమా పూనియా, క్వాలిఫికేషన్ గ్రూప్ ఏ

ఉదయం 7.25 నుంచి: మహిళల డిస్కస్ త్రో, కమల్‌ప్రీత్ కౌర్, అర్హత గ్రూప్ బీ

సాయంత్రం 3:40 నుంచి: పురుషుల లాంగ్ జంప్, శ్రీశంకర్ క్వాలిఫికేషన్ గ్రూప్ బీ

బ్యాడ్మింటన్:
సాయంత్రం 3:20 నుంచి: మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్ పీవీ సింధు వర్సెస్ తాయ్ జు యింగ్ (చైనీస్ తైపీ)

బాక్సింగ్:
ఉదయం 7:30 నుంచి: అమిత్ పంగల్ వర్సెస్ ఉబెర్గెన్ రివాస్ (కొలంబియా) 52 కిలోల పురుషుల
ప్రీ క్వార్టర్ ఫైనల్స్
సాయంత్రం 3:36 నుంచి: పూజా రాణి వర్సెస్ లి కియాన్ (చైనా) 75 కేజీల మహిళల ప్రీ క్వార్టర్ ఫైనల్

గోల్ఫ్:
ఉదయం 4:15 నుంచి: అనిర్బన్ లాహిరి మరియు ఉదయన్ మానే, పురుషుల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే

హాకీ:
ఉదయం 8:45 నుంచి: ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా, మహిళల పూల్ ఏ మ్యాచ్

సెయిలింగ్:
ఉదయం 8:35 నుంచి: పురుషుల స్కిఫ్‌లో కేసీ గణపతి – వరుణ్ థక్కర్, రేస్ 10, 11, 12

షూటింగ్:
ఉదయం 8:30 నుంచి: అంజుమ్ మౌద్గిల్- తేజష్విని సావంత్, మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ అర్హత.

Also Read: Sri Lanka Cricket Board : కరోనా నిబంధనలు ఉల్లంఘన.. ముగ్గురు క్రికెట్లర్లపై ఏడాది నిషేధం..

Dhoni New Look: కొత్త లుక్‌లో ధోని.. న్యూ హెయిర్ స్టైల్‌లో అదుర్స్ అనిపిస్తున్న ‘తలా’