భారత మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా గురించి ఈ మధ్యకాలంలో వార్తలు తెగ వినిపిస్తున్నాయి.. టెన్నిస్ స్టార్ గా ఎన్నో కొత్త రికార్డులు నెలకొల్పిన సానియా భారతీయుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. స్పోర్ట్స్ లైఫ్ లో సానియా విజయం సాధించింది సానియా. కానీ తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. సానియా మొదటి భర్త, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
విడాకుల తర్వాత షోయబ్‌కి సానియా కొత్త జీవితాన్ని విష్ చేసిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు విడాకుల తర్వాత తొలిసారిగా సానియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను పోస్ట్ చేసింది. తన ఫోటోను పోస్ట్ చేస్తూ, సానియా క్యాప్షన్‌లో ‘రిఫ్లెక్షన్..’ అని రాసింది.
సోషల్ మీడియాలో సానియా ఒక్క మాటలో చాలా చెప్పే ప్రయత్నం చేసింది. సానియా పోస్ట్‌పై పలువురు నెటిజన్లు లైక్‌లు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. షోయబ్‌ను పలువురు ట్రోల్ చేశారు. ‘షోయబ్ మాలిక్ ను తిడుతూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొంతమంది నెటిజన్స్ ‘సానియా మేము మీతో ఉన్నాము..’ అని కామెంట్స్ చేస్తున్నారు. సానియా తన భర్త షోయబ్ మాలిక్ వివాహేతర సంబంధాలతో విసిగిపోయి అతనికి విడాకులు ఇచ్చిందని టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు సానియా తన కొడుకుతో కలిసి జీవిస్తోంది. సానియా, ఆమె కుమారుడు దుబాయ్‌లో ఉంటున్నారు. విడాకుల తర్వాత సానియా ఇండియాకు తిరిగి వస్తుందా.? అన్న డౌట్స్ అభిమానుల్లో మొదలయ్యాయి. ఇక సానియా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పుడూ తన కొడుకుతో ఉన్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.. సోషల్ మీడియాలో కూడా సానియాకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.