రోహిత్ శర్మ అరుదైన రికార్డ్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ బాదిన రోహిత్ వన్డేల్లో 8000 పరుగులు మైలురాయిని చేరుకున్నాడు. అయితే ఈ ఫీట్‌ను రోహిత్ 200 ఇన్నింగ్స్‌లలోనే అందుకోవడం విశేషం. అయితే రోహత్ కన్నా తక్కువ ఇన్నింగ్స్‌లలోనే, 175 ఇన్నింగ్స్‌లలో విరాట్ కోహ్లీ ఆ ఘనత సాధించాడు. భారత్ తరుపున ఇప్పటి వరకూ మొత్తం 9 మంది వన్డేల్లో 8వేల పరుగులను సాధించారు. వేగం పరంగా కోహ్లీ, రోహిత్ […]

రోహిత్ శర్మ అరుదైన రికార్డ్
Follow us

| Edited By:

Updated on: Mar 13, 2019 | 8:44 PM

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ బాదిన రోహిత్ వన్డేల్లో 8000 పరుగులు మైలురాయిని చేరుకున్నాడు. అయితే ఈ ఫీట్‌ను రోహిత్ 200 ఇన్నింగ్స్‌లలోనే అందుకోవడం విశేషం. అయితే రోహత్ కన్నా తక్కువ ఇన్నింగ్స్‌లలోనే, 175 ఇన్నింగ్స్‌లలో విరాట్ కోహ్లీ ఆ ఘనత సాధించాడు.

భారత్ తరుపున ఇప్పటి వరకూ మొత్తం 9 మంది వన్డేల్లో 8వేల పరుగులను సాధించారు. వేగం పరంగా కోహ్లీ, రోహిత్ శర్మ, గంగూలి, సచిన్, ధోనీ, ద్రవిడ్, సెహ్వాగ్, యూవీ, అజారుద్దీన్ ఉన్నారు. అంతర్జాతాయంగా కూడా కోహ్లీ ఈ విషయంలో టాప్‌లో ఉన్నాడు. కోహ్లీ తర్వాత సఫారీ ఆటగాడు ఏబీ డెవిలియర్స్ 182 ఇన్నింగ్స్‌లలో 8వేల పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు.