Cristiano Ronaldo: మరోసారి మంచి మనసు చాటుకున్న రొనాల్డో.. గోల్‌ కొట్టలేదని ఏడ్చిన చిన్నారికి జెర్సీ బహూకరణ..

|

Nov 13, 2021 | 1:40 PM

క్రిస్టియానో రొనాల్డో... ఫుట్‌బాల్‌లో ఈ పేరుకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైదానంలో పాదరసంలా కదులుతూ గోల్స్‌తో ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఈ స్టార్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడికి..

Cristiano Ronaldo: మరోసారి మంచి మనసు చాటుకున్న రొనాల్డో.. గోల్‌ కొట్టలేదని ఏడ్చిన చిన్నారికి జెర్సీ బహూకరణ..
Follow us on

క్రిస్టియానో రొనాల్డో… ఫుట్‌బాల్‌లో ఈ పేరుకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైదానంలో పాదరసంలా కదులుతూ గోల్స్‌తో ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఈ స్టార్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడికి మిలియన్ల సంఖ్యలో అభిమానులున్నారు. మైదానంలో కేవలం ఆటతోనే కాదు తన వ్యవహారశైలి, ప్రవర్తనతోనూ ఫ్యాన్స్ హృదయాలను కొల్లగొడుతుంటాడీ స్టార్‌ ప్లేయర్‌. ప్రస్తుతం అలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఫిపా వరల్డ్‌ కప్‌ అర్హత పోటీల్లో భాగంగా ఐర్లాండ్‌లోని డబ్లిన్‌ వేదికగా శుక్రవారం పోర్చుగల్, రిపబ్లిక్ ఆఫ్‌ ఐర్లాండ్‌ జట్లు తలపడ్డాయి. ఇరు జట్ల ఆటగాళ్లు పోటాపోటీగా ఆడడంతో మ్యాచ్‌ 0-0 స్కోరుతో డ్రాగా ముగిసింది.

కాగా ఈ మ్యాచ్‌లో పోర్చుగల్‌ను ముందుండి నడిపించిన రొనాల్డో బాగానే ఆడాడు. కానీ నిర్ణీత సమయంలో ఒక్క గోల్‌ కూడా కొట్టలేకపోయాడు. దీంతో మ్యాచ్‌ చూడడానికి వచ్చిన ఐర్లాండ్‌ చిన్నారి తీవ్ర నిరాశకు గురైంది. మ్యాచ్‌ ముగిసిన అనంతరం గ్రౌండ్‌లోకి పరుగెత్తుకుని వచ్చి రొనాల్డోను పట్టుకుని గట్టిగా ఏడ్చింది. దీంతో చలించిపోయిన రొనాల్డో ఆ చిన్నారిని హత్తుకుని ఓదార్చాడు. అనంతరం తన జెర్సీని బహుమతిగా అందించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘నువ్వు గోల్‌ కొట్టకపోయినా… మళ్లీ మా మనసులు గెల్చుకున్నావ్‌’ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

T20 World Cup 2021: కాబోయే అల్లుడిపై మామ ఫైర్.. తెలివిగా బౌల్ చేయడంలో విఫలం.. ఆ మూడు సిక్సులే పాక్ ఓటమికి కారణమంటూ విమర్శలు..!

Syed Mushtaq Ali Trophy 2021: ఢిల్లీలో ఇక క్రికెట్ కష్టమేనా.. ప్రశ్నార్థకంగా మారిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌లు?

T20 World Cup Final: టెస్టు, వన్డేల్లో అగ్రస్థానం.. మరి టీ20ల్లోనూ కివీస్‌కు సాధ్యమయ్యేనా.. టీ20 ప్రపంచకప్‌ గెలిస్తే ఏం జరగనుందో తెలుసా?