Hyderabad Shooter Esha Singh: పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన షూటర్ ఈషా సింగ్ చోటు దక్కించుకుని తెలంగాణకు గర్వకారణంగా నిలిచింది. 18 ఏళ్ల ఈ షూటర్ ఆసియా క్వాలిఫయర్స్‌లో 243.1 స్కోర్‌తో స్వర్ణం గెలుచుకోవడం ద్వారా తన స్థానాన్ని ధృవీకరించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించి అర్హత సాధించిన షూటర్ వరుణ్ తోమర్‌తో పాటుగా పారిస్ ఒలంపిక్స్‌లో అడుగుపెట్టనుంది.
ఇప్పటి వరకు 15 మంది భారత షూటర్లు పారిస్ ఒలింపిక్స్‌లో తమ స్థానాన్ని ఖాయం చేసుకున్నారు. గతేడాది సెప్టెంబరులో జరిగిన ఆసియా క్రీడల్లో రెండు రజతాలతో సహా మొత్తం నాలుగు పతకాలను ఈషా సింగ్ సాధించింది.
ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ISSF) జూనియర్ వరల్డ్ కప్‌లో మహిళల 10M ఎయిర్ పిస్టల్‌లో రజతం గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ యువ షూటర్ రూ.2 కోట్ల నగదు బహుమతిని కూడా అందించింది. కొన్ని సంవత్సరాలుగా జూనియర్ ర్యాంక్‌లలో బహుళ ISSF పతకాలను గెలుచుకున్న తర్వాత, మార్చి 2022లో జరిగిన ISSF ప్రపంచ కప్‌లో ఈషా రజతం సాధించింది. కాగా, టోక్యో గేమ్స్‌లో అత్యధిక సంఖ్యలో షూటర్లను బరిలోకి దింపిన భారత్ తన మునుపటి అత్యుత్తమ ప్రదర్శనను సమం చేసిన సంగతి తెలిసిందే.
జకార్తాలో జరుగుతున్న చాంపియన్‌షిప్‌లో తొలి రోజైన సోమవారం పురుషుల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో వరుణ్ తోమర్ గోల్డ్ మెడల్ సాధించగా, మహిళల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో ఇషా సింగ్ రెండో కోటా సాధించింది. ఇషా కూడా బంగారు పతకం సాధించింది. మహిళల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ కోసం ఇషా భారత్‌కు తొలి ఒలింపిక్ కోటాను అందించింది.
అత్యధిక సంఖ్యలో ఒలింపిక్ కోటాలను సాధించిన భారత షూటింగ్ టోక్యో రికార్డును సమం చేసింది. 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్ క్రీడల కోసం భారత్ 15 ఒలింపిక్ కోటాలను దక్కించుకుంది. జకార్తాలో జరుగుతున్న ఈ పోటీలో పారిస్ ఒలింపిక్స్ 2024 కోసం రెండు కోటాలు వాటాలో ఉన్నాయి. 26 దేశాల నుంచి 385 మంది షూటర్లు పోటీలో పాల్గొంటున్నారు. ఈ పోటీలో ఒలింపిక్ కోటా కాకుండా 256 పతకాలు ఉన్నాయి. వీటిలో 84 స్వర్ణాలు, 84 రజతాలు, 88 కాంస్యాలు ఉన్నాయి.
Congratulations to #eshasingh for securing Gold and winning Paris Olympic Quota in 10 M AP Women and #rhythmsangwan for winning bronze medal 🥉 at Asian Championship 2024 Jakarta pic.twitter.com/Wrqz08nE8H
— SAI_KSSR Delhi (@SAI_KSSRDelhi) January 8, 2024
జులైలో జరగనున్న పారిస్ ఒలింపిక్స్‌కు భారత్ 31 కోటాలను సాధించింది. ఇందులో షూటర్లు అత్యధికంగా 15 స్థానాలు సాధించారు. భారత్‌కు అథ్లెటిక్స్‌లో 9, బాక్సింగ్‌లో 4, హాకీ, ఆర్చరీ, రెజ్లింగ్‌లో ఒక్కో కోటా లభించింది.
ఇప్పటివరకు భారతదేశం షూటింగ్ నుంచి 15 ఒలింపిక్ కోటాలను పొందింది. వీటిలో రైఫిల్‌లో 8 ఒలింపిక్ స్థానాలు, పిస్టల్‌లో 5, షాట్‌గన్‌లో 2 ఉన్నాయి. వరుణ్, ఇషా కంటే ముందు, సరబ్జోత్ సింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో, మను భాకర్ 25 మీటర్ల పిస్టల్‌లో, అనీష్ భన్వాల్ 25 మీటర్ల రాపిడ్ ఫైర్ పిస్టల్‌లో ఒలింపిక్ కోటా సాధించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..