Paris Olympics 2024: లక్ష్యసేన్ ఘన విజయానికి విలువే లేదు.. రద్దు చేసిన అధికారులు.. కారణం ఏంటో తెలుసా?

|

Jul 29, 2024 | 11:38 AM

Lakhsya Sen: భారత స్టార్ లక్ష్యసేన్ తన ప్రారంభ మ్యాచ్‌లో 42 నిమిషాల్లో 21-8, 22-20 తేడాతో కోర్డెన్‌పై గెలిచాడు. తొలి గేమ్‌ను 14 నిమిషాల్లోనే గెలిచాడు. రెండో గేమ్‌లో కోర్డెన్ అతనికి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, భారత యువ ఆటగాడు వరుసగా ఆరు పాయింట్లు సాధించి మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. కానీ, ఇప్పుడు అతని విజయానికి అర్థం లేదు. మోచేయి గాయం కారణంగా కార్డెన్ పారిస్ ఒలింపిక్స్ నుంచి తప్పుకున్నాడు. దీంతో లక్ష్యసేన్ విజయం రికార్డ్ నుంచి తొలగించారు.

Paris Olympics 2024: లక్ష్యసేన్ ఘన విజయానికి విలువే లేదు.. రద్దు చేసిన అధికారులు.. కారణం ఏంటో తెలుసా?
Paris Olympics 2024 Lakshya Sen
Follow us on

Paris Olympics 2024: బ్యాడ్మింటన్‌లో భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. లక్ష్యసేన్ కృషి ఫలించలేదు. అతని విజయం రికార్డుల నుంచి తొలగించారు. పురుషుల సింగిల్స్‌లో గ్వాటెమాలాకు చెందిన కెవిన్ కోర్డెన్‌ను ఓడించడం ద్వారా రియో ​​ఒలింపిక్స్ 2024 కోసం భారత స్టార్ తన ప్రచారాన్ని ప్రారంభించాడు. అయితే కోర్డెన్‌పై అతని విజయం తొలగించారు. దీని కారణంగా ఇప్పుడు లక్ష్యసేన్.. అదనపు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. గ్రూప్‌లో అదనపు మ్యాచ్‌లు ఆడే ఏకైక ఆటగాడిగా లక్ష్య సేన్ నిలిచాడు.

భారత స్టార్ లక్ష్యసేన్ తన ప్రారంభ మ్యాచ్‌లో 42 నిమిషాల్లో 21-8, 22-20 తేడాతో కోర్డెన్‌పై గెలిచాడు. తొలి గేమ్‌ను 14 నిమిషాల్లోనే గెలిచాడు. రెండో గేమ్‌లో కోర్డెన్ అతనికి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, భారత యువ ఆటగాడు వరుసగా ఆరు పాయింట్లు సాధించి మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. కానీ, ఇప్పుడు అతని విజయానికి అర్థం లేదు. మోచేయి గాయం కారణంగా కార్డెన్ పారిస్ ఒలింపిక్స్ నుంచి తప్పుకున్నాడు. దీంతో లక్ష్యసేన్ విజయం రికార్డ్ నుంచి తొలగించారు.

నియమాలు ఏమిటి?

కోర్డెన్ ఒలింపిక్స్ నుంచి తప్పు కోవడంతో, లక్ష్య సేన్‌తో ఆడిన మ్యాచ్ ఫలితం కూడా తొలగించారు. అంటే కార్డన్‌పై లక్ష్యసేన విజయం పరిగణలోకి తీసుకోరు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF) ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘మోచేయి గాయం కారణంగా కార్డెన్ పారిస్ ఒలింపిక్స్ నుంచి వైదొలిగాడు. గ్రూప్ Lలో ఇండోనేషియాకు చెందిన జోనాథన్ క్రిస్టీ, బెల్జియంకు చెందిన జూలియన్ కరాగితో వారి మిగిలిన మ్యాచ్‌లు జరగవు. గ్రూప్ స్టేజ్ గేమ్‌ల కోసం BWF సాధారణ పోటీ నిబంధనలకు అనుగుణంగా, గ్రూప్ Lలో ఆడిన లేదా ఇంకా ఆడాల్సిన అన్ని కార్డన్-సంబంధిత మ్యాచ్‌ల ఫలితాలు ఇప్పుడు అలాగే ఉండిపోయాయి.

ఇవి కూడా చదవండి

అదనపు మ్యాచ్‌లు ఆడనున్న లక్ష్యసేన్..

కార్డన్ అవుట్‌తో, గ్రూప్ Lలో ముగ్గురు ఆటగాళ్ల సమూహంగా మారింది. ఇందులో జోనాథన్, కరాగి, లక్ష్య సేన్ ఉన్నారు. ఈ మార్పు వల్ల గ్రూప్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడిగా లక్ష్యసేన్ మారనున్నాడు. నాకౌట్‌కు చేరుకోవడానికి జోనాథన్, కరాగి రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. సోమవారం జరిగే తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో కరాగి, జోనాథన్‌తో లక్ష్యసేన్ తలపడనున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..