డిఫెండింగ్ ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా సోమవారం స్టేడ్ డి ఫ్రాన్స్‌లో 89.34 మీటర్ల త్రో (గ్రూప్ బి)తో పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఇది గ్లోబల్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్‌కి అత్యుత్తమ త్రో గా నిలిచింది. స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్‌లో 89.94 మీటర్ల తర్వాత అతని రెండవ అత్యుత్తమ త్రో ఇదే కావడం గమనార్హం. తొలి ప్రయత్నంలోనే అర్హత సాధించాడు.
అంతకు ముందు దోహాలో నీరజ్ 88.36 మీటర్లు విసిరాడు. అలాగే, పావో నుర్మి గేమ్స్‌లో 85.97 మీటర్లు విసిరి విజేతగా నిలిచాడు.
క్వాలిఫికేషన్ ఈవెంట్‌లో, నీరజ్ సహచర భారత అథ్లెట్ కిషోర్ జెనా గ్రూప్ ఏలో 80.73 మీటర్లు విసిరాడు.
అదే సమయంలో, కెన్యాకు చెందిన జూలియస్ యెగో, చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వడ్లెజ్‌లు వరుసగా 85.97 మీటర్లు, 85.63 మీటర్లు విసిరి ఫైనల్‌కు అర్హత సాధించారు. జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ కూడా 87.76 మీటర్ల త్రోతో అర్హత సాధించాడు.
What a day for Indian Sports! 🇮🇳 #NeerajChopra secures his spot in the Javelin final in style 🔥
89.34 🚀 #Javelin #Olympics #Paris2024 pic.twitter.com/eODlwVTB5H
— Nigel D’Souza (@Nigel__DSouza) August 6, 2024
84 మీటర్లు దాటి త్రో విసిరిన వారంతా ఆటోమేటిక్ అర్హత సాధిస్తారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..