Trending Photo: పిల్లలతో ఫుట్‌బాల్‌ ఆడిన రొనాల్డో.. ‘ప్రౌడ్ డాడ్’ అంటూ నెట్టింట్లో దూసుకెళ్తోన్న ఫొటో..!

|

Jan 27, 2022 | 8:18 AM

Manchester United: క్రిస్టియానో ​​రొనాల్డో తన పిల్లలతో బీచ్‌లో సరదాగా ఫుల్‌బాల్‌ ఆడుతూ సేదతీరుతున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది.

Trending Photo: పిల్లలతో ఫుట్‌బాల్‌ ఆడిన రొనాల్డో.. ప్రౌడ్ డాడ్ అంటూ నెట్టింట్లో దూసుకెళ్తోన్న ఫొటో..!
Ronaldo
Follow us on

Manchester United: పోర్చుగీసుకు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్‌(Football) క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) (36) అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ పోటీల్లో 115 గోల్స్‌ సాధించి అధిక గోల్స్‌ సాధించిన వారి జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. తన కెరీర్‌లో ఎన్నో రికార్డు నెలకొల్పిన ఈ దిగ్గజ ప్లేయర్ నెట్టింట్లోనూ ఎప్పుడూ సందడి చేస్తూనే ఉంటాడు. మాంచెస్టర్ యునైటెడ్(Manchester United) తరపున క్లబ్ ఫుట్‌బాల్ ఆడుతోన్న క్రిస్టియానో ​​రొనాల్డో.. తాజాగా మరోసారి నెట్టింట్లో తన సత్తా చాటుతున్నాడు.

క్లబ్ ఫుట్‌బాల్ విరామంతో, క్రిస్టియానో ​​రొనాల్డో తన కుటుంబంతో ఆనందంగా గడుపుతున్నాడు. ఆ‍యన పిల్లలతో బీచ్‌లో ఫుట్‌బాల్ ఆడుతూ సేద తీరుతున్నారు. మాంచెస్టర్ యునైటెడ్ స్టార్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘ప్రౌడ్ డాడ్’ అనే క్యాప్షన్‌తో ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో దూసూకపోతోంది. 78 లక్షల లైక్స్‌తో మరెన్నో కామెంట్లతో తన సత్తా చూపిస్తోంది. ఈ ఫొటోపై ఫ్యాన్స్‌ కూడా తమ అభిప్రాయాలను సరదాగా పంచుకుంటున్నారు.

క్రిస్టియానో ​​రొనాల్డో తరువాత ఒక జట్టు తరఫున అత్యధిక గోల్స్‌ చేసిన లిస్టులో ఎవరున్నారో ఓసారి చూద్దాం. అలీ దేయి 109 గోల్స్ చేసి రెండో స్థానంలో, మోఖ్తర్‌ దహారి 89, ఫెర్నిస్‌ పుస్కస్‌ 84, గాడ్‌ఫ్రే చిటాలు 79 తదుపరి స్థానాల్లో నిలిచారు. ఇక భారతదేశం తరపున సునీల్‌ ఛెత్రీ 74 గోల్స్‌తో 12వ స్థానంలో ఉన్నాడు.

Also Read: IND vs WI: రవి బిష్ణోయ్ ఎంట్రీ నుంచి అశ్విన్‌పై వేటు వరకు.. టీమిండియా స్వ్కాడ్‌లో 5 భారీ మార్పులు

Pushpa: ఇది వేరే లెవెల్.. శ్రీవల్లి పాటకు నాన్నమ్మతో కలిసి స్టెప్పులేసిన టీమిండియా ఆల్ రౌండర్..