Lionel Messi: ఫిఫా విజయం తర్వాత.. రొనాల్డో రికార్డ్‌ను బ్రేక్ చేసిన మెస్సీ.. నెట్టింట్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న ఇన్‌స్టా పోస్ట్..

|

Dec 20, 2022 | 11:30 AM

Fifa World Cup 2022: పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో ​​రొనాల్డో రికార్డును మెస్సీ బద్దలు కొట్టాడు. ప్రపంచకప్ ప్రారంభానికి ముందు మెస్సీ షేర్ చేసిన ఓ ఫొటో నెట్టింట్లో ప్రకంపనలు పుట్టిస్తోంది.

Lionel Messi: ఫిఫా విజయం తర్వాత.. రొనాల్డో రికార్డ్‌ను బ్రేక్ చేసిన మెస్సీ.. నెట్టింట్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న ఇన్‌స్టా పోస్ట్..
Fifa World Cup 2022 Lionel Messi
Follow us on

Lionel Messi Instagram Post: స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ ఫిఫా ప్రపంచ కప్‌లో అనేక ఆన్-ఫీల్డ్ రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో అతను అర్జెంటీనాకు ఫిఫా ప్రపంచ కప్‌ను గెలుచుకోవడంలో సహాయం చేశాడు. అయితే ఇప్పుడు మైదానం వెలుపల కూడా ఎన్నో రికార్డులు సృష్టిస్తున్నాడు. సోమవారం ప్రపంచ కప్ గెలిచిన తర్వాత, మెస్సీ ట్రోఫీతో కూడిన పోస్ట్‌ను సోషల్ మీడియా హ్యాండిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీనికి 54 మిలియన్లకు పైగా (5 కోట్లు) లైక్స్ వచ్చాయి. ఒక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో అత్యధిక లైక్‌లు సాధించిన క్రీడాకారుడిగా నిలిచాడు.

ఈ క్రమంలో పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో ​​రొనాల్డో రికార్డును మెస్సీ బద్దలు కొట్టాడు. ప్రపంచకప్ ప్రారంభానికి ముందు మెస్సీతో కలిసి చెస్ ఆడుతున్న చిత్రాన్ని రొనాల్డో పోస్ట్ చేశాడు. దీనికి 42 మిలియన్లకు పైగా (4 కోట్లు) లైక్స్ వచ్చాయి. ఆ తర్వాత ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అయితే మెస్సీ అంతకు మించి ముందుకెళ్లాడు. ఈ పోస్ట్‌పై రొనాల్డోకు 42 మిలియన్లకు పైగా లైక్‌లు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

మెస్సీ ఈ పోస్ట్‌లో ఇలా వ్రాశాడు – నేను దీని గురించి ఎన్నిసార్లు కలలు కన్నాను. నేను నమ్మలేకపోతున్నాను… నా కుటుంబానికి, నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ, మమ్మల్ని నమ్మిన ప్రతి ఒక్కరికీ చాలా ధన్యవాదాలు. అర్జెంటీనా ప్రజలు కలిసి ఐక్యంగా పోరాడితే మనం అనుకున్నది సాధించగలమని మరోసారి నిరూపించుకున్నాం. మెరిట్ ఈ సమూహానికి చెందినది. ఇది వ్యక్తుల కంటే ఎక్కువగా ఉంటుంది. అర్జెంటీనియన్లందరిదీ అయిన ఈ కల మాకు పోరాడే శక్తిని ఇచ్చింది… మేము చేశాం!!! లెట్స్ గో అర్జెంటీనా !!!!! మేం అతి త్వరలో ఒకరినొకరు కలవబోతున్నాం… అంటూ రాసుకొచ్చాడు.

మెస్సీ ఇన్‌స్టా పోస్ట్..

ఆదివారం జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో మెస్సీ 4-2తో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌ను పెనాల్టీల ద్వారా ఓడించాడు. అంతకుముందు పూర్తి సమయంలో 2-2తో, అదనపు సమయంలో 3-3తో స్కోరు సమమైంది. ఫైనల్‌లో మెస్సీ ఇప్పటి వరకు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. అతను రెండు గోల్స్ చేశాడు.

రొనాల్డో పోస్ట్..

ఈ ప్రపంచకప్‌లో మెస్సీ మొత్తం ఏడు గోల్స్ చేశాడు. దీంతో ప్రపంచకప్‌లో అతని మొత్తం గోల్స్ సంఖ్య 13కి చేరుకుంది. ప్రపంచకప్‌లో అర్జెంటీనా తరపున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు. ఫైనల్లో మైదానంలోకి దిగిన వెంటనే మెస్సీ పేరిట మరో రికార్డు ఉంది. ప్రపంచకప్‌లో అత్యధిక మ్యాచ్‌లు (26) ఆడిన ఆటగాడిగా కూడా నిలిచాడు. మెస్సీకి ఇది ఐదో ప్రపంచకప్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..