Exclusive: షట్లర్ లక్ష్య సేన్‌ ఎదుగుదలకు అడ్డుగా గోపిచంద్‌.. నిబంధనల పేరుతో అడ్డుకున్నాడు: విమల్ కుమార్

|

Oct 21, 2021 | 3:55 PM

Vimal Kumar vs Gopichand: సుదిర్మన్ కప్ మిశ్రమ జట్టు పోటీలో గానీ, డెన్మార్క్‌లోని ఆర్హస్‌లో ముగిసిన థామస్ కప్ పురుషుల పోటీలో గానీ భారతదేశం తరఫున లక్ష్య సేన్ ఎంపిక కాకపోవడంతో భారతీయ బ్యాడ్మింటన్ ప్రేమికులకు షాక్‌కు గురయ్యారు.

Exclusive: షట్లర్ లక్ష్య సేన్‌ ఎదుగుదలకు అడ్డుగా గోపిచంద్‌.. నిబంధనల పేరుతో అడ్డుకున్నాడు: విమల్ కుమార్
Vimal Kumar Vs Gopichand
Follow us on

Vimal Kumar vs Gopichand: గత రెండేళ్లుగా కిదాంబి శ్రీకాంత్, బి. సాయి ప్రణీత్ వంటి అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ ప్లేయర్ల ఆటలో నాణ్యత తగ్గిపోతుంది. ప్రతీ సిరీస్‌లో ఓడిపోవడంతో వీరి ఆట ఎలా ఉందో తేటతెల్లమవుతోంది. అయితే పురుషుల విభాగాన్ని నెం .1 స్థానంలో నిలిపే బాధ్యత 20 ఏళ్ల లక్ష్య సేన్ భుజాలపై ఉందని తెలుస్తోంది. కానీ, సెప్టెంబర్ చివరి వారంలో ఫిన్లాండ్‌లోని వంతాలో జరిగిన సుదిర్మన్ కప్ మిశ్రమ జట్టు పోటీలో గానీ, గత ఆదివారం డెన్మార్క్‌లోని ఆర్హస్‌లో ముగిసిన థామస్ కప్ పురుషుల పోటీలో గానీ భారతదేశం తరఫున లక్ష్య సేన్ ఎంపిక కాకపోవడంతో భారతీయ బ్యాడ్మింటన్ ప్రేమికులకు షాక్ తగిలింది.

అధికారిక కథనం మేరకు, సేన్ ఆగస్టు చివరి వారంలో నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌లో జరిగిన సెలెక్షన్ ట్రయల్స్‌కు హాజరయ్యాడు. పురుషుల సింగిల్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. కానీ, రౌండ్-రాబిన్ గ్రూప్ దశలో తన మొదటి మ్యాచ్‌లో ఓడిపోయాడు. అదికూడా బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF) ర్యాంకింగ్స్‌లో 1,414 వ స్థానంలో ఉన్న 19 ఏళ్ల సాయి చరణ్ కోయపై ఓడిపోయాడంట.

బెంగుళూరులోని పదుకొనె ద్రవిడ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ (PDCE) లోని తన హోమ్ ట్రైనింగ్ అకాడమీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సేన్ సహజంగానే బాగా ఆడాలని అనుకున్నాడు. అయితే అతన్ని 9 నుంచి 16 స్థానాల్లో ఆడాలని చెప్పారంట. ట్రయల్స్ ప్రారంభానికి ముందు నియమాలు రూపొందించడంతో.. ఇవి యువ షట్లర్‌కి నచ్చలేదు. దీంతో తదుపరి మ్యాచ్‌లు ఆడకుండా బెంగళూరుకు బయలుదేరాడు.

దేశంలోనే ప్రధాన షట్లర్‌గా పేరొందిన సేన్‌కు ఇలాంటి ఊహించని పరిణామాలు ఎదురుకావడంతో ఈ ప్లేయర్ కోచ్ విమల్ కుమార్‌, గోపీచంద్‌కు మధ్య మాటల యుద్ధ జరిగింది. అయితే హైదరాబాద్‌లో జరిగిన సెలెక్షన్ ట్రయల్స్‌కు హాజరు కాలేకపోయిన విమల్, లక్ష్యసేన్ కడుపు ఇన్ఫెక్షన్ కారణంగా కోయ చేతిలో ఓడిపోయాడని వెల్లడించారు. దేశంలోనే నంబర్ 1 షట్లర్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి మరొక అవకాశం కల్పించాలని కోరాడు. అయితే గోపీచంద్ తన సొంత అకాడమీకి చెందిన ఆటగాళ్లకు అండగా ఉండేందుకు లక్ష్య‌సేన్‌కు అవకాశం ఇవ్వడం లేదంటూ ఆరోపించాడు.

“లక్ష్య సేన్‌ను ఆట నుంచి తప్పించేందుకు గోపీచంద్ ఓ పథకం ప్రకారం ఇలా చేశాడని” విమల్ న్యూస్ 9తో తెలిపారు. “ట్రయల్స్ ప్రారంభంలో అగ్రశ్రేణి ఆటగాళ్లకు కూడా చెడ్డ దశ అనేది ఒకటి ఉంటుంది. ఉదాహరణకు కిరణ్ జార్జ్, ట్రయల్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. ప్రణయ్, సమీర్ వర్మతో సహా అనేక అగ్రశ్రేణి ఆటగాళ్లను ఓడించాడు. శంకర్ ముత్తుస్వామితో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌లో ఓడిపోయాడు. మిగిలిన మ్యాచ్‌లలో అతను అజేయంగా నిలిచాడు.”

“రెండవ రోజు తొమ్మిదవ నుంచి 16 వ స్థానాల కొరకు మ్యాచ్‌లు ఆడమని గోపి చెప్పాడని, అందుకు లక్ష్యసేన్ సిద్ధంగా లేడు. గత రెండు సంవత్సరాలుగా ఎంతో మంచి ప్రదర్శన ఇస్తున్న అగ్రశ్రేణి ఆటగాడిని ఇలా తొమ్మిది నుంచి 16 వ స్థానాల్లో ఆడమని చెప్పడం ఎంతవరకు సబబు.” అని విమల్ అన్నాడు.

దీంతో గోపీచంద్ ఐదుగురు సభ్యులతో కూడిన ప్యానెల్ ద్వారా ఎంపిక ప్రమాణాలను నిర్ణయించారు. అందులో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) ప్రధాన కార్యదర్శి అజయ్ సింఘానియా, BAI కార్యదర్శి (ఈవెంట్స్) ఒమర్ రషీద్, చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, జూనియర్ చీఫ్ కోచ్ సంజయ్ మిశ్రా, చీఫ్ రిఫరీ ఉదయ్ సేన్ వంటి వారు ఉన్నారు. ఓ ఆటగాడికి ఎంత అర్హత ఉన్నా.. ఇలాంటి నియమాలతో అతడి ప్రతిభను అడ్డుకోలేరు.

ఈ ప్యానల్ నియమాల మేరకు బీడబ్ల్యూఎఫ్ ర్యాకింగ్స్‌లో టాప్ -20 లో స్థానం పొందిన ఆటగాళ్లందరూ ట్రయల్స్ ఆడకుండా మినహాయింపు లభించనుందని, వారు పోటీలకు డైరెక్ట్‌గా ఎంపికవుతారు. అంటే శ్రీకాంత్, సాయి ప్రణీత్, పీవీ సింధు, సైనా నెహ్వాల్, సాత్విక్షైరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ట్రయల్స్‌లో పాల్గొనాల్సిన అవసరం లేదన్నమాట.

20 మంది పురుషుల సింగిల్స్ ఆటగాళ్లు సుదిర్మన్, థామస్ కప్‌లలో భారతదేశం కోసం ఆడాలని కోరుకున్నారు. ట్రయల్స్ జరిగిన నాలుగు రోజులలో ప్రతి క్రీడాకారుడు ఇతర క్రీడాకారుడితో పోటీ పడడం సాధ్యం కాదు. కాబట్టి, ఆటగాళ్లను ఎనిమిది మంది చొప్పున రౌండ్ రాబిన్ గ్రూపులుగా విభజించాలని నిర్ణయించారు. ఒక్కొక్కరు ఇద్దరు లేదా ముగ్గురు ఆటగాళ్లతో ఒక గ్రూపులో ఉంటారు. గ్రూప్ విజేతలు మాత్రమే ప్లే ఆఫ్ క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరుకుంటారు.

సెలెక్టర్లు 20 మంది పురుషుల సింగిల్స్ ఆటగాళ్లను ఐదుగురు ఆటగాళ్ల చొప్పున నాలుగు రౌండ్ రాబిన్ గ్రూపులుగా విభజించాలని భావించారు. అయితే ట్రయల్స్ జరిగిన నాలుగు రోజుల పాటు ప్రతి ఆటగాడు ఉదయం, సాయంత్రం మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. గ్రూప్ దశలో వారి బెల్ట్ కింద నాలుగు మ్యాచ్‌లు ఉన్నందున, ప్రతి గ్రూప్ నుంచి మొదటి రెండు క్వార్టర్ ఫైనల్స్ ఆడతాయి. అంటే దీని అర్థం విజేతతోపాటు రన్నరప్ నాలుగు రోజుల్లో ఏడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఇది ఆటగాళ్లకు ఎంతో అలసటకు గురిచేసే షెడ్యూల్‌ అని విమర్శులు వచ్చాయి.

సెలెక్టర్లు ఆటగాళ్లను ఎనిమిది గ్రూపులుగా విభజించడంలో నిమగ్నమయ్యారు. ఇందులో కొన్ని గ్రూపులలో ముగ్గురు ఆటగాళ్లు ఉన్నారు. మరికొన్ని గ్రూపులలో కేవలం ఇద్దరు ప్లేయర్లు మాత్రమే ఉన్నారు. సేన్‌కు టాప్ సీడింగ్ ఇచ్చారు. కిరణ్ జార్జ్ రెండవ సీడ్‌ కేటాయించారు. ఇద్దరూ కేవలం ఇద్దరు ఆటగాళ్లతో డ్రా చేసుకున్నారు. వీరిలో ఒకరు మాత్రమే చివరి ఎనిమిదవ దశకు చేరుకుంటారు. సేన్ తన ఏకైక రౌండ్-రాబిన్ గ్రూప్ మ్యాచ్‌ను సాయి కిరణ్ కోయ చేతిలో ఓడిపోవడం దురదృష్టకరం.

“లక్ష్య సేన్ ప్రస్తుతం దేశంలో అత్యుత్తమ ఆటగాడని నేను అంగీకరిస్తున్నాను” అని గోపీచంద్ చెప్పారు. “కానీ, రౌండ్ రాబిన్‌లో పద్ధతిలో ఊహించని ఓటమి తరువాత, క్వార్టర్‌ ఫైనల్స్‌లో లక్ష్యసేన్ ఆడలేకపోయాడు. ఐదుగురు సభ్యులతో రూపొందించిన నియమాలు ఆదర్శమని నేను చెప్పడం లేదు. కానీ, కమిటీ సభ్యులు లేదా ఆటగాళ్లు ఎవరూ కూడా వీటిపై అభ్యంతరం వ్యక్తం చేయలేదు” అని గోపిచంద్ పేర్కొన్నారు. అందుకే, గోపీచంద్ 9 నుంచి 16 వరకు ప్లే ఆఫ్‌లలో సేన్ ఆడాలని సూచించాడు. 1 నుంచి 8 స్థానాల్లో ప్లేఆఫ్‌ల విజేత లేదా రన్నరప్‌తో ఆడించి చివరలో ఎంపిక చేసి అతడిని జట్టులోకి తీసుకురావడానికి సెలెక్టర్లు ఏదో ఒక మార్గంలో ప్రయత్నించే ఛాన్స్ ఉంది. కానీ, అలా జరగలేదు.

కొన్ని వర్గాల నుంచి వచ్చే ఆరోపణలను ఊహించి, భారత చీఫ్ కోచ్, ద్రోణాచార్య అవార్డు విజేత నిబంధనల ఫ్రేమింగ్‌తో సహా అన్ని కార్యక్రమాలను వీడియో తీశారు. ట్రయల్స్‌ మ్యాచులను యూట్యూబ్‌లోకూడా ప్రసారం చేశారు. తద్వారా ఎంపిక ప్రక్రియలో నిష్పాక్షికత నిరూపించేందుకు ప్రయత్నించారు. బీడబ్ల్యూఎఫ్ ర్యాకింగ్స్‌లో ప్రస్తుతం 25 వ స్థానంలో ఉన్న దేశంలోని అత్యుత్తమ పురుషుల సింగిల్స్ ప్లేయర్ లక్ష్య సేన్ గ్రేడ్ సాధించడంలో విఫలమైనందుకు గోపీచంద్ అసంతృప్తిగా ఉన్నాడు. కానీ, పారదర్శకత, ఫెయిర్‌ ప్లే ప్రయోజనాల దృష్ట్యా, అతనికి వేరే మార్గం చూపలేదు.

దేశంలోని ఇద్దరు అగ్రశ్రేణి కోచ్‌ల మధ్య సంబంధాలు దెబ్బతినడంతోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడడం దురదృష్టకరం. ప్రస్తుత మహిళా ప్రపంచ ఛాంపియన్, సింధు.. వ్యక్తిగత ఈవెంట్‌ల కోసం రెండు టీంల పోటీలకు దూరంగా ఉండటం చాలా బాధాకరం.

గతంలో దేశం కోసం ఆడటం అత్యున్నత గౌరవంగా భావించేవారు. ప్రస్తుతం అంతర్జాతీయ ఈవెంట్‌లలో దేశానికి ప్రాతినిధ్యం వహించడం వ్యక్తిగత కీర్తిగా భావిస్తున్నారు. దీంతో అనేక మంది ఆటగాళ్లు ఆటకు తక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ఇండోనేషియా థామస్ కప్‌లో పాల్గోనే స్క్వాడ్ నుంచి ఎవరో ఒకరు కప్ తీసుకరావొచ్చు. 19 సంవత్సరాల తర్వాత ట్రోఫీని తిరిగి తమ దేశానికి కప్‌ను తీసుకొచ్చేందుకు సహాయపడతారని ఆశిద్దాం.

Also Read: Denmark Open: డెన్మార్క్ ఓపెన్ తొలి రౌండ్‎లో విజయం సాధించిన పీవీ సింధు.. శుభారంభం చేసిన శ్రీకాంత్..

Novak Djokovic: టీకా వేసుకున్నానో లేదో తెలియనవసరం లేదు.. నొవాక్ జకోవిచ్ వివాదాస్పద వ్యాఖ్యలు..