Paris Olympics: లైవ్‌లో మహిళా క్రీడాకారులపై నోరు పారేసుకున్న కామెంటేటర్.. కట్‌చేస్తే.. ఊహించని షాక్

|

Jul 29, 2024 | 11:17 AM

EuroSport Commentator Bob Ballard Comments: ఆదివారం (AEST) 4x100m ఫ్రీస్టైల్ రిలేలో ఆస్ట్రేలియా స్వర్ణ పతకాన్ని సాధించింది. అయితే, ఈ మ్యాచ్ లైవ్‌లో ఓ వ్యాఖ్యత ఘోర తప్పిదం చేశాడు. దీంతో ఏకంగా ఒలింపిక్స్ కవరేజీ నుంచి తప్పించారు. యూరోస్పోర్ట్ వ్యాఖ్యాత బాబ్ బల్లార్డ్ సోమవారం (AEST) 2024 పారిస్ ఒలింపిక్స్‌ లైవ్ కవరేజీ చేస్తున్నాడు. ఆస్ట్రేలియా రిలే జట్టు తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

Paris Olympics: లైవ్‌లో మహిళా క్రీడాకారులపై నోరు పారేసుకున్న కామెంటేటర్.. కట్‌చేస్తే.. ఊహించని షాక్
Eurosport Commentator Bob Ballard
Follow us on

EuroSport Commentator Bob Ballard Comments: ఆదివారం (AEST) 4x100m ఫ్రీస్టైల్ రిలేలో ఆస్ట్రేలియా స్వర్ణ పతకాన్ని సాధించింది. అయితే, ఈ మ్యాచ్ లైవ్‌లో ఓ వ్యాఖ్యత ఘోర తప్పిదం చేశాడు. దీంతో ఏకంగా ఒలింపిక్స్ కవరేజీ నుంచి తప్పించారు. ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం.. యూరోస్పోర్ట్ వ్యాఖ్యాత బాబ్ బల్లార్డ్ సోమవారం (AEST) 2024 పారిస్ ఒలింపిక్స్‌ లైవ్ కవరేజీ చేస్తున్నాడు. ఆస్ట్రేలియా రిలే జట్టు తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బల్లార్డ్ మాట్లాడుతూ “ ఓకే.. మహిళలు మీ పని పూర్తి చేశారు. మహిళలు ఎలా ఉంటారో తెలిసిందేగా.. మేకప్ వేసుకుంటూ, ఖాళీగా ఉంటారు’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ అనుచిత వ్యాఖ్యలు వైరల్ అయ్యాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈయన మాటలపై విమర్శలు గుప్పించారు. దీంతో యూరోస్పోర్ట్ వ్యాఖ్యాత బాబ్ బల్లార్డ్‌పై కీలక నిర్ణయం తీసుకునేలా చేశాయి. ఈ క్రమంలో ఒలింపిక్స్ కవరేజీ విధుల నుంచి తప్పించినట్లు యూరోస్పోర్ట్ పేర్కొంది.

4×100 మీటర్ల ఫ్రీస్టైల్ రిలేలో ఆస్ట్రేలియా జట్టు 3:28.92 సమయంతో స్వర్ణం చేజిక్కించుకుంది. ఆస్ట్రేలియన్ జట్టు ఆ దేశ అభిమానులకు విజయవంతమైన రోజును అందించారు. ఈ విజయంతో ఈ ఈవెంట్‌లో ఆస్ట్రేలియా వరుసగా నాలుగో విజయం సాధించింది. అమెరికా, చైనాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..