Video: ముగిసిన శకం.. ఫుట్‌బాల్ లెజండరీ ప్లేయర్స్‌కు వీడ్కోలు పలికిన జర్మనీ

Germany Legendary Players: జర్మనీ ప్రపంచ కప్ విజేతలైన ముల్లర్, న్యూయర్, గుండోగన్, క్రూస్‌ వంటి దిగ్గజాలకు అలయన్జ్ అరేనాలో జరిగిన ప్రత్యేక వేడుకతో భావోద్వేగ వీడ్కోలు పలికారు. వీరితో పాటు తెర వెనుక పనిచేసిన సిబ్బందికి కూడా సత్కారం చేశారు.

Video: ముగిసిన శకం.. ఫుట్‌బాల్ లెజండరీ ప్లేయర్స్‌కు వీడ్కోలు పలికిన జర్మనీ
Muller, Neuer, Gundogan, Kr
Follow us

|

Updated on: Oct 16, 2024 | 10:16 AM

Germany Legendary Players: ప్రపంచకప్ 2014 విజేతలైన థామస్ ముల్లర్, మాన్యువల్ న్యూయర్, మాజీ కెప్టెన్ ఇక్కే గుండోగన్, టోనీ క్రూస్ జాతీయ జట్టుకు తుది వీడ్కోలు పలికారు. జర్మనీ UEFA నేషన్స్ లీగ్ 4వ రౌండ్ మ్యాచ్‌కి ముందు నెదర్లాండ్స్‌తో అలయన్జ్ అరేనాలో ఈ జర్మన్ ఫుట్‌బాల్ దిగ్గజాల గౌరవార్థం ఒక ప్రత్యేక వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో దాదాపు 70,000 మంది అభిమానులు పాల్గని, తమ అభిమాన క్రీడాకారులకు ఘనమైన వీడ్కోలు తెలిపారు.

అయితే, మైదానంలో టోని క్రూస్ లేకపోవడం గమనార్హం. DFB ఈ విషయాన్ని ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. “క్రూస్ వ్యక్తిగతంగా మ్యూనిచ్‌లో ఉండటానికి ఇష్టపడ్డాడని, అయితే, అతను సోమవారం తన యూత్ అకాడమీలోని పిల్లలతో ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొన్నాడు. దీంతో ఈ వేడుకకు హాజరుకాలేదు” అని తెలిపింది.

అద్భుతమైన వారసత్వం..

న్యూయర్, గుండోగన్, ముల్లర్, క్రూస్ జాతీయ జట్టులో తమదైన ముద్ర వేశారు. న్యూయర్ 124 మ్యాచ్‌లతో అంతర్జాతీయ రికార్డ్ లిఖించాడు. గుండోగన్ 82 మ్యాచ్‌ల్లో 19 గోల్స్‌, ముల్లర్ 131 మ్యాచ్‌ల్లో 45 గోల్స్, క్రూస్ 114 మ్యాచ్‌ల్లో 17 గోల్స్‌తో సత్తా చాటారు.

ముల్లర్ 2009లో జాతీయ జట్టుకు అరంగేట్రం చేశాడు. 2010 ప్రపంచ కప్‌నకు ముందు న్యూయర్, క్రూస్‌లు అరంగేట్రం చేశారు. ఇక గుండోగన్ 2011లో ఎంట్రీ ఇచ్చాడు. క్రూస్ అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుంచి రిటైర్ అయినప్పటికీ, మిగిలిన ముగ్గురు క్లబ్ స్థాయిలో ఆడుతున్నారు.

ZDFతో ముల్లర్ మాట్లాడుతూ జాతీయ జట్టుతో తన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. “ఇది గొప్ప విజయం. తరువాతి తరం తలుపు తడుతోంది” అంటూ ముగించాడు.

సన్మానం..

ఇదే వేడుకలో సుదీర్ఘకాలం సేవలందించిన ఐదురుగు సిబ్బందిని డీఎఫ్‌బీ గుర్తించింది. ఇందులో టీమ్ సైకాలజిస్ట్ హన్స్-డైటర్ హెర్మాన్, ఫిజియోథెరపిస్ట్ వోల్ఫ్‌గ్యాంగ్ బంజ్‌లతో సహా ఈ సిబ్బందిని అధికారికంగా సత్కరించారు. వీరంతా జట్టు వైద్యుడితో పాటు గాయపడిన ఆటగాళ్లకు సహాయం చేయడానికి తరచుగా మైదానంలోకి వస్తుంటారు.

తదుపరి యుగానికి స్వాగతం చెబుతూ.. జర్మన్ ఫుట్‌బాల్‌లో ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని ముగించింది. తెరవెనుక అవిశ్రాంతంగా పనిచేసిన ఆటగాళ్లతోపాటు, సిబ్బందికి ఈ వేడుకను అంకింతం చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ముహూర్తం ఫిక్స్.. ప్రజా ఉద్యమాలకు బీజేపీ, బీఆర్ఎస్ ప్లాన్..!
ముహూర్తం ఫిక్స్.. ప్రజా ఉద్యమాలకు బీజేపీ, బీఆర్ఎస్ ప్లాన్..!
వెంట్రుక వాసిలో తప్పించుకుంది.. లేదంటేనా! నడిచి వెళ్లిన నో సేఫ్టీ
వెంట్రుక వాసిలో తప్పించుకుంది.. లేదంటేనా! నడిచి వెళ్లిన నో సేఫ్టీ
ఫుట్‌బాల్ లెజండరీ ప్లేయర్స్‌కు వీడ్కోలు పలికిన జర్మనీ
ఫుట్‌బాల్ లెజండరీ ప్లేయర్స్‌కు వీడ్కోలు పలికిన జర్మనీ
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రేణుకా స్వామి భార్య
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రేణుకా స్వామి భార్య
పచ్చి కొబ్బరితో పుట్టేడు లాభాలు..తెలిస్తే ముక్క కూడా వదిలిపెట్టరు
పచ్చి కొబ్బరితో పుట్టేడు లాభాలు..తెలిస్తే ముక్క కూడా వదిలిపెట్టరు
సివిల్‌ సర్వెంట్ల కొరతపై రేవంత్ సర్కార్ యాక్షన్‌ ప్లాన్‌ ఏంటి?
సివిల్‌ సర్వెంట్ల కొరతపై రేవంత్ సర్కార్ యాక్షన్‌ ప్లాన్‌ ఏంటి?
IND vs NZ: బెంగళూరులో బద్దలవ్వనున్న 5 భారీ రికార్డ్‌లు..
IND vs NZ: బెంగళూరులో బద్దలవ్వనున్న 5 భారీ రికార్డ్‌లు..
ఇంట్లో ఎవరి దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు.? రూల్స్‌ ఎలా ఉన్నాయి.?
ఇంట్లో ఎవరి దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు.? రూల్స్‌ ఎలా ఉన్నాయి.?
అప్పుడే ఓటీటీలోకి గోపిచంద్ 'విశ్వం'! ఆ పండగ రోజే స్ట్రీమింగ్!
అప్పుడే ఓటీటీలోకి గోపిచంద్ 'విశ్వం'! ఆ పండగ రోజే స్ట్రీమింగ్!
ఎర్ర చందనంతో ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. చంద్రబింబంలాంటి చర్మం
ఎర్ర చందనంతో ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. చంద్రబింబంలాంటి చర్మం
వెంట్రుక వాసిలో తప్పించుకుంది.. లేదంటేనా! నడిచి వెళ్లిన నో సేఫ్టీ
వెంట్రుక వాసిలో తప్పించుకుంది.. లేదంటేనా! నడిచి వెళ్లిన నో సేఫ్టీ
ఇంట్లో ఎవరి దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు.? రూల్స్‌ ఎలా ఉన్నాయి.?
ఇంట్లో ఎవరి దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు.? రూల్స్‌ ఎలా ఉన్నాయి.?
అదేమైనా గుర్రం అనుకున్నవా గురూ..!పులి మీద సవారీ చేసిన వ్యక్తి
అదేమైనా గుర్రం అనుకున్నవా గురూ..!పులి మీద సవారీ చేసిన వ్యక్తి
దూసుకొస్తున్న వాయుగుండం.. స్కూళ్లకు సెలవులు..
దూసుకొస్తున్న వాయుగుండం.. స్కూళ్లకు సెలవులు..
ముసలోళ్లే కానీ.. అదరగొట్టేశారు.! సాహసమనే చెప్పాలి..
ముసలోళ్లే కానీ.. అదరగొట్టేశారు.! సాహసమనే చెప్పాలి..
మరో రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు.. కాకాణి కీలక వ్యాఖ్యలు
మరో రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు.. కాకాణి కీలక వ్యాఖ్యలు
మరీ ఇంత దారుణమా.! అత్తా కోడళ్లపై గ్యాంగ్‌రేప్‌.. సీఎం చంద్రబాబు
మరీ ఇంత దారుణమా.! అత్తా కోడళ్లపై గ్యాంగ్‌రేప్‌.. సీఎం చంద్రబాబు
భారత సైన్యంలోకి కొత్త జంతువులు.! జడల బర్రెలపై ట్రయల్స్..
భారత సైన్యంలోకి కొత్త జంతువులు.! జడల బర్రెలపై ట్రయల్స్..
మహిళ బ్యాంకు ఖాతాలోకి రూ.999 కోట్లు.. తర్వాత ఏం జరిగింది.?
మహిళ బ్యాంకు ఖాతాలోకి రూ.999 కోట్లు.. తర్వాత ఏం జరిగింది.?
ప్రాణం తీసిన డీజే.! అప్పటివరకూ డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిన యువకుడ
ప్రాణం తీసిన డీజే.! అప్పటివరకూ డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిన యువకుడ