టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్‌మెన్ ఎవరో తెలుసా?
TV9 Telugu
15 October 2024
భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ అక్టోబర్ 16న ప్రారంభం కానుంది. బెంగళూరులో తొలి టెస్ట్ జరగనుంది.
ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ భారీ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం..
ఇప్పటివరకు టెస్టుల్లో భారత్ తరపున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా వీరేంద్ర సెహ్వాగ్ నిలిచాడు. 91 సిక్సర్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
టెస్టు ఫార్మాట్‌లో రోహిత్ శర్మ ఇప్పటివరకు 87 సిక్సర్లు బాదాడు. ప్రస్తుతం ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.
న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ 5 సిక్సర్లు బాదితే వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టగలడు.
ఎంఎస్ ధోని టెస్టుల్లో మొత్తం 78 సిక్సర్లు బాదాడు. టెస్టుల్లో భారత్ తరపున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా మూడో స్థానంలో ఉన్నాడు.
ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ నాలుగో స్థానంలో ఉన్నాడు. సచిన్ తన టెస్టు కెరీర్‌లో మొత్తం 69 సిక్సర్లు కొట్టాడు.
ఈ జాబితాలో రవీంద్ర జడేజా పేరు కూడా చేరింది. ఇప్పటి వరకు 66 సిక్సర్లు కొట్టాడు. ఈ సిరీస్‌లో అతను సచిన్ టెండూల్కర్‌ను విడిచిపెట్టే అవకాశం ఉంది.
ఇక్కడ క్లిక్ చేయండి..