Pregnant Athlete: ఆ అథ్లెట్ ఎనిమిది నెలల గర్భవతి.. అయినా వెనక్కి తగ్గలేదు.. స్వర్ణ పతకాన్ని నెగ్గింది..

|

Apr 11, 2021 | 9:50 PM

Pregnant Athlete: క్రీడలంటే చాలా మంది ఆసక్తి కనబరుస్తారు. మరికొందరికి క్రీడలంటే ప్రాణంతో సమానంగా భావిస్తారు. తాను ఇష్టంగా..

Pregnant Athlete: ఆ అథ్లెట్ ఎనిమిది నెలల గర్భవతి.. అయినా వెనక్కి తగ్గలేదు.. స్వర్ణ పతకాన్ని నెగ్గింది..
Pregnant Athlete
Follow us on

Pregnant Athlete: క్రీడలంటే చాలా మంది ఆసక్తి కనబరుస్తారు. మరికొందరికి క్రీడలంటే ప్రాణంతో సమానంగా భావిస్తారు. తాను ఇష్టంగా భావించే ఆట కోసం ఏమైనా చేస్తారు. తన లక్ష్యాన్ని చేరేందుకు ఎంత కష్టాన్నైనా భరిస్తారు. చివరికి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఇలాంటి ఘటనే నైజీరియాలో వెలుగు చూసింది. ఎనిమిది నెలల గర్భవతి అయిన నైజీరియా అథ్లెట్ అమీనాత్ ఇద్రీస్.. తైక్వాండోలో బంగారు పథకం సాధించి ఔరా అనిపించింది. నైజీరియాలో జాతీయ క్రీడా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎడో స్టేట్‌లోని బెనిన్‌లో ఈ క్రీడా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ గేమ్స్‌లో పాల్గొన్న అమీనాత్ ఇడ్రీస్ తైక్వాండో మిక్స్‌డ్ పూమ్సే విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఈ గేమ్స్‌ ప్రారంభానికి ముందు ఇడ్రీస్ తైక్వాండో పలు భంగిమలు ప్రదర్శించింది. దీనికి సంబంధించిన వీడియోను నైజీరియా నేషనల్ స్పోర్ట్స్ ఫెస్టివల్ 2020 నిర్వాహకులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అమినాట్ ఇడ్రీస్ అసాధారణ ప్రతిభను ప్రశంసించారు. అందరికీ ఆదర్శంగా నిలిచిందంటూ కొనియాడారు.

గోల్డ్ మెడల్ సాధించడంపై అమినాట్ ఇడ్రీస్ స్పందించింది. ‘ఇది నాకు గర్వంగా ఉంది. కొన్నిసార్లు శిక్షణ తీసుకున్న తరువాత ఒకసారి ప్రయత్నించాలని భావించి ట్రై చేశాను. ఇది నిజంగా సంతోషంగా ఉంది. నేను గర్భవతిని కాకముందు శిక్షణను ఎప్పుడూ ఆస్వాధిండేదానిని. గర్భం దాల్చాక కూడా ఆ శిక్షణలో భిన్నంగా ఏమీ అనిపించలేదు’ అని ఇడ్రీస్ చెప్పుకొచ్చింది.

Also read:

Rahul Dravid Video: రాహుల్ ద్రావిడ్ కోపం.. తెలివిగా వాడేసుకున్న సూరత్ పోలీసులు.. ఇంతకీ ఏం చేశారంటే..

మానవుల ప్రాణాలు హరించే ప్రమాదకర జీవి ఏంటో తెలుసా?.. నిత్యం మీవెంటే ఉంటుంది.. తెలిస్తే షాక్ అవుతారు!

Mars helicopter flight : అంగారక గ్రహంపై బుల్లి హెలికాప్టర్‌ నేడు ఎగరలేదు, వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన నాసా, ఎందుకంటే..