భారత టెన్నిస్ స్టార్లు సానియా మీర్జా, రోహన్ బోపన్న జోడీ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ఫైనల్స్‌కు చేరుకుంది. సానియాకు ఇదే చివరి గ్రాండ్‌స్లామ్ కానుండడంతో ఇప్పుడు టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. సెమీఫైనల్లో సానియా-రోహన్ జోడీ బ్రిటన్‌కు చెందిన ఆన్ స్కుప్‌స్కీ, అమెరికాకు చెందిన డి కరావ్‌జిక్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో భారత జోడీ 7-6, 6-7, 10-6తో విజయం సాధించింది.
టోర్నీకి ముందే సానియా రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే ఆమెకు చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ. ఫిబ్రవరి 19న ప్రారంభమయ్యే WTA 1000 దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ తర్వాత ఆమె రిటైర్ అవుతుంది. రిటైర్మెంట్‌కు ముందు చివరి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకునే గోల్డెన్ ఛాన్స్ ఉంది.
రోహన్ బోపన్న, సానియా మీర్జా బుధవారం సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నారు. క్వార్టర్స్‌లో వారు జెలెనా ఒస్టాపెంకో, డేవిడ్ వేగా హెర్నాండెజ్‌ల జోడీతో తలపడ్డారు. అయితే ఈ జోడీ మైదానంలోకి దిగకపోవడంతో సానియా-రోహన్‌కు వాకోవర్ వచ్చింది. ఈ వాకోవర్‌తో నేరుగా సెమీఫైనల్‌కు చేరుకుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..