Paris Olympic: 14వ పుట్టినరోజుకు ముందే పారిస్‌లో స్వర్ణం.. 88 ఏళ్ల రికార్డ్ తృటిలో మిస్.. ఎవరో తెలుసా?

|

Jul 29, 2024 | 1:02 PM

Yoshizawa Coco: ఒలింపిక్స్‌లో మరో అద్భుతం చోటు చేసుకుంది. తన 14వ పుట్టినరోజుకు ముందు పారిస్ ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సాధించిన అథ్లెట్.. 88 ఒలింపిక్స్ రికార్డ్‌ను సమం చేసింది. జపాన్‌కు చెందిన కోకో యోషిజావా గురించి మాట్లాడుతున్నాం. ఆమె 22 సెప్టెంబర్ 2024న తన 14వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోనుంది. కానీ, అంతకుముందే ఆమె స్కేట్‌బోర్డ్‌లో ఒలింపిక్ ఛాంపియన్‌గా మారింది.

Paris Olympic: 14వ పుట్టినరోజుకు ముందే పారిస్‌లో స్వర్ణం.. 88 ఏళ్ల రికార్డ్ తృటిలో మిస్.. ఎవరో తెలుసా?
Yoshizawa Coco
Follow us on

Olympic Champion: ఒలింపిక్స్‌లో మరో అద్భుతం చోటు చేసుకుంది. తన 14వ పుట్టినరోజుకు ముందు పారిస్ ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సాధించిన అథ్లెట్.. 88 ఒలింపిక్స్ రికార్డ్‌ను సమం చేసింది. జపాన్‌కు చెందిన కోకో యోషిజావా గురించి మాట్లాడుతున్నాం. ఆమె 22 సెప్టెంబర్ 2024న తన 14వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోనుంది. కానీ, అంతకుముందే ఆమె స్కేట్‌బోర్డ్‌లో ఒలింపిక్ ఛాంపియన్‌గా మారింది. ఆమెతోపాటు రజతం, కాంస్యం సాధించిన ఆటగాళ్లు కూడా కేవలం 15, 16 ఏళ్ల వయసువారే కావడం గమనార్హం.

ఒలింపిక్స్‌లో అతి పిన్న వయసులో స్వర్ణం గెలుచుకున్నది ఎవరు?

కోకో యోషిజావా ఒలింపిక్ చరిత్రలో అతి పిన్న వయస్కురాలైన ఛాంపియన్‌గా మారే ఛాన్స్‌ను కొద్దిలో మిస్సయింది. ఎందుకంటే, ఈ 88 ఏళ్ల రికార్డు తృటిలో మిస్సయింది. సమ్మర్ ఒలింపిక్స్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన ఛాంపియన్ ప్లేయర్ పేరు మార్జోరీ గెస్ట్రింగ్. ఈ అమెరికన్ అథ్లెట్ 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో స్ప్రింగ్‌బోర్డ్ డైవింగ్‌లో స్వర్ణం సాధించాడు. అప్పటికి అతని వయసు 13 ఏళ్ల 268 రోజులు మాత్రమే. కాగా, జపాన్ అథ్లెట్ కోకో యోషిజావా 13 ఏళ్ల 341 రోజుల్లో పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాడు.

రజతం, కాంస్యం గెలిచిన వాళ్లు మాత్రం పెద్ద వయస్కులే..

పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల స్కేట్‌బోర్డ్ ఈవెంట్‌లో జపాన్ కూడా రజత పతకాన్ని గెలుచుకుంది. 15 ఏళ్ల లిజ్ అకామా పేరుతో ఈ పతకం నమోదైంది. 16 ఏళ్ల బ్రెజిలియన్ స్కేట్‌బోర్డర్ రైసా లీల్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. కోకో యోషిజావా 272.75 పాయింట్లు సాధించి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. లిజ్ అకామా 265.95 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. బ్రెజిలియన్ స్కేట్‌బోర్డర్ 253.37 స్కోర్ చేశాడు.

ఇవి కూడా చదవండి

రజతం కోల్పోయిన బ్రెజిల్ ప్లేయర్..

బ్రెజిలియన్ మహిళా స్కేట్ బోర్డర్ లీల్ టోక్యో 2020లో రజత పతకాన్ని గెలుచుకుంది. కానీ, పారిస్‌లో కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంతకుముందు శనివారం జరగాల్సిన పురుషుల స్కేట్‌బోర్డింగ్ సోమవారానికి వాయిదా పడింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..