Neeraj Chopra: మొన్న సముద్రం గర్భంలో.. నేడు గగన వీధుల్లో నీరజ్‌ చోప్రా సాహస విన్యాసాలు.. వైరల్‌ వీడియో.

|

Oct 09, 2021 | 7:36 PM

Neeraj Chopra: నీరజ్‌ చోప్రా.. ఒలింపిక్స్‌కు ముందు పెద్దగా ఎవరికీ తెలియని ఈ పేరు, ఆ తర్వాత ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మోరు మోగింది. వందేళ్ల చరిత్రలో అథ్లెట్‌లో తొలిసారి భారత్‌కు స్వర్ణ పతకం..

Neeraj Chopra: మొన్న సముద్రం గర్భంలో.. నేడు గగన వీధుల్లో నీరజ్‌ చోప్రా సాహస విన్యాసాలు.. వైరల్‌ వీడియో.
Neeraj Chopra
Follow us on

Neeraj Chopra: నీరజ్‌ చోప్రా.. ఒలింపిక్స్‌కు ముందు పెద్దగా ఎవరికీ తెలియని ఈ పేరు, ఆ తర్వాత ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మోరు మోగింది. వందేళ్ల చరిత్రలో అథ్లెట్‌లో తొలిసారి భారత్‌కు స్వర్ణ పతకం సాధించిన సరికొత్త చరిత్రకు నాంది పలికాడు నీరజ్‌. తన అసమాన ఆటతో దేశం గర్వించే స్థాయికి ఎదిగాడు. దీంతో నీరజ్‌ పేరు దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా వినిపించింది. ఇక ఈ స్వర్ణంతో నీరజ్‌ బ్రాండ్ వ్యాల్యూ కూడా బాగా పెరిగిపోయింది. ప్రముఖ బ్రాండ్‌లన్నీ నీరజ్‌ వెంట పడుతున్నాయి. ఈ విజయం తర్వాత మరెన్నో అద్భుతాలను సృష్టించడమే తన లక్ష్యమని చెప్పిన నీరజ్‌ ఆ దిశగా ప్రాక్టిస్‌కు కూడా మొదలు పెట్టాడు.

అయితే తాజాగా ప్రాక్టిస్‌కు కాస్త విరామం ప్రకటించిన నీరజ్‌ హాలీడేను ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం అండమాన్‌ దీవుల్లో సందడి చేసిన నీరజ్‌ సముద్ర గర్భంలో స్కూబా డైవింగ్‌ చేశాడు. ఈ సమయంలో సముద్ర గర్భంలో జావెలిన్‌ త్రోను విసురుతున్నట్లు ఉన్న వీడియోను నీరజ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో అప్పట్లో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక మొన్నటి వరకు అండమాన్‌లో హల్చల్‌ చేసిన నీరజ్‌ ఇప్పుడు దుబాయ్‌ బాట పట్టాడు.

ఈ క్రమంలోనే మొన్న సముద్ర గర్భంలో సందడి చేస్తే.. నేడు తన సాహసాన్ని గగన వీధుల్లోకి తీసుకెళ్లాడు. ఆకాశంలో స్కై డైవ్‌ చేస్తూ ఎంజాయ్ చేశాడు. ఈ సందర్భంగా స్కై డైవ్‌ తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పిన నీరజ్‌, ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఇది ప్రయత్నించాలని చెప్పుకొచ్చాడు. స్కైవ్‌ డైవ్‌ చేస్తున్న సమయంలో తీసిన వీడియోను నీరజ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.

Also Read: Viral News: భర్త ప్రాణంగా పెంచుకుంటున్న చేపను భార్య వేపుకుని తినేసింది.. ఎందుకంటే?

Undavalli Arun Kumar-YS Jagan: ఆంధ్రను అప్పులాంధ్రగా మార్చేశారు అంటూ జగన్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్..(వీడియో)

CWC Meeting: ఈనెల 16న సీడబ్ల్యూసీ కీలక భేటీ.. సంస్థాగత ప్రక్షాళనతో పాటు కొత్త అధ్యక్షుడి ఎన్నికపై చర్చ