AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాడు పోర్న్‌స్టార్.. నేడు అంపైర్.. ఎలాగంటే.?

చిన్నతనంలో అందరం హీరోలవుతాం.. ఐపీఎస్ ఆఫీసర్స్ అవుతాం అంటూ చెప్పుకుంటాం.. తీరా పెద్దయ్యాక ఏ డాక్టరో.. లేదా స్కూల్ టీచర్ గానో స్థిరపడతాం. అందరి జీవితంలో ఇదంతా కామన్ అయిపొయింది. అయితే న్యూజిలాండ్‌కు చెందిన ఓ మాజీ పోర్న్‌స్టార్.. ఏకంగా క్రికెట్‌లో అంపైర్ అయ్యాడు. వినడానికే షాకింగ్‌గా ఉంది కదా.. అసలు అతడు ఎలా అంపైర్‌గా మారాడో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం న్యూజిలాండ్-ఇంగ్లాండ్‌ల మధ్య టీ20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. హోరాహోరీగా జరుగుతున్న ఈ సిరీస్‌లో […]

నాడు పోర్న్‌స్టార్.. నేడు అంపైర్.. ఎలాగంటే.?
Ravi Kiran
|

Updated on: Nov 10, 2019 | 6:42 PM

Share

చిన్నతనంలో అందరం హీరోలవుతాం.. ఐపీఎస్ ఆఫీసర్స్ అవుతాం అంటూ చెప్పుకుంటాం.. తీరా పెద్దయ్యాక ఏ డాక్టరో.. లేదా స్కూల్ టీచర్ గానో స్థిరపడతాం. అందరి జీవితంలో ఇదంతా కామన్ అయిపొయింది. అయితే న్యూజిలాండ్‌కు చెందిన ఓ మాజీ పోర్న్‌స్టార్.. ఏకంగా క్రికెట్‌లో అంపైర్ అయ్యాడు. వినడానికే షాకింగ్‌గా ఉంది కదా.. అసలు అతడు ఎలా అంపైర్‌గా మారాడో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం న్యూజిలాండ్-ఇంగ్లాండ్‌ల మధ్య టీ20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. హోరాహోరీగా జరుగుతున్న ఈ సిరీస్‌లో డిసైడర్ మ్యాచ్ ఇవాళ జరగ్గా అందులో ఇంగ్లాండ్ విన్ కావడంతో సిరీస్ 3-2తో ఆ జట్టు కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే మూడో టీ20 మ్యాచ్‌కు నాలుగో అంపైర్‌గా న్యూజిలాండ్‌కు చెందిన గార్త్ స్తిరాత్(51) వ్యవహరించగా.. అతడి గురించి ఆ దేశ క్రికెటర్లు కథలు కథలుగా తోటి ఇంగ్లాండ్ ఆటగాళ్లతో చెబుతుండటం విశేషం. గతంలో గార్త్ స్తిరాత్ ప్రముఖ పోర్న్‌స్టార్.. ఇతడి నగ్న చిత్రాలు న్యూజిలాండ్‌లో బాగా పాపులర్ అయ్యాయి కూడా.. అంతేకాకుండా ఇతగాడి నీలి చిత్రాల గురించి ఓ మ్యాగజైన్ విపరీతంగా ప్రచురించింది. దీంతో గార్త్ స్తిరాత్ రహస్యంగా చేస్తున్న ఈ పని బహిర్గతం కావడంతో గతంలో చేసిన గోల్ఫ్ అసోసియేషన్ పదవిని కూడా కోల్పోయాడు. అయితే తాజాగా ఇవన్నీ వదిలేసి గార్త్ స్తిరాత్ జెంటిల్‌మెన్ గేమ్‌లో అంపైర్‌గా అవతారమెత్తాడు. మహిళల క్రికెట్‌‌తో పాటు అంతర్జాతీయంగా పలు మ్యాచులకు అంపైర్‌గా వ్యవహరించి.. అద్భుతంగా రాణిస్తున్నాడు.

Follow Us