Sharapova: టెన్నిస్ స్టార్ షరపోవా, రేసర్ మైఖేల్‌పై చీటింగ్ కేసు.. ఢిల్లీ మహిళ కోర్టుకు వెళ్లడంతో..

|

Mar 17, 2022 | 9:29 AM

Maria Sharapova: రష్యా మాజీ టెన్నిస్ స్టార్ మరియా షరపోవా, మాజీ ఫార్ములా 1 రేసర్ మైఖేల్ షూమేకర్‌తో పాటు మరో 11 మందిపై కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలతో గుర్గావ్ పోలీసులు

Sharapova: టెన్నిస్ స్టార్ షరపోవా, రేసర్ మైఖేల్‌పై చీటింగ్ కేసు.. ఢిల్లీ మహిళ కోర్టుకు వెళ్లడంతో..
Maria Sharapova
Follow us on

Maria Sharapova: రష్యా మాజీ టెన్నిస్ స్టార్ మరియా షరపోవా, మాజీ ఫార్ములా 1 రేసర్ మైఖేల్ షూమేకర్‌తో పాటు మరో 11 మందిపై కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలతో గుర్గావ్ పోలీసులు నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు చేశారు. కాగా.. తమను మోసం చేశారంటూ ఢిల్లీ మహిళ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. న్యూఢిల్లీలోని చత్తర్‌పూర్ మినీ ఫామ్‌లో నివాసం ఉంటున్న షఫాలీ అగర్వాల్.. షరపోవా పేరుతో ఓ ప్రాజెక్ట్‌లో అపార్ట్‌మెంట్‌ను బుక్ చేశారంటూ ఫిర్యాదు చేసింది. ప్రాజెక్ట్‌లోని ఒక టవర్‌కు షూమేకర్ పేరు పెట్టారని ఆమె పేర్కొంది. ఈ ప్రాజెక్ట్ 2016 నాటికి పూర్తి కావాల్సి ఉంది, కానీ ఇప్పటివరకు ప్రారంభించలేదని షఫాలీ ఫిర్యాదులో పేర్కొన్నారని పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఇన్‌స్పెక్టర్ దినకర్‌ వార్త సంస్థ పీటీఐకి తెలిపారు. కోర్టు ఆదేశం మేరకు, ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని.. దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

అంతర్జాతీయ సెలబ్రిటీలు తమ అసోసియేషన్ ప్రచారం చేసి ఈ మోసంలో భాగమయ్యారని షఫాలీ ఫిర్యాదులో పేర్కొంది. అంతకుముందు, ఆమె M/S రియల్‌టెక్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌పై గురుగ్రామ్ కోర్టులో ఫిర్యాదు చేసింది. లిమిటెడ్, ఇతర డెవలపర్‌లు, షరపోవా, షూమేకర్ పేరిట దాదాపు రూ.80 లక్షల వరకు మోసం చేశారని పేర్కొంది.

గుర్గావ్‌లోని సెక్టార్ 73లో షరపోవా పేరు మీద ఉన్న ప్రాజెక్ట్‌లో తాను, తన భర్త రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌ను బుక్ చేసుకున్నామని, అయితే డెవలపర్ కంపెనీలు తమ ప్రాజెక్ట్‌లో భాగంగా డబ్బు వసూలు చేశారని.. చివరకు డెలవరీ చేయకుండా తమను మోసం చేశాయంటూ కోర్టులో పేర్కొంది. తాము ప్రాజెక్ట్ గురించి ప్రకటనల ద్వారా తెలుసుకున్నామని.. ప్రాజెక్ట్ చిత్రాలు, వాగ్దానాలు చూసి కంపెనీ యాజమాన్యాన్ని సంప్రదించి మోసపోయామని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

ప్రాజెక్ట్ ప్రమోటర్లుగా షరపోవా, షూమేకర్ ఉన్నారని.. మాజీ టెన్నిస్ స్టార్ సైట్‌ను సందర్శించి టెన్నిస్ అకాడమీ, స్పోర్ట్స్ స్టోర్‌ను ప్రారంభిస్తానంటూ హామీ సైతం ఇచ్చారని అగర్వాల్ ఆరోపించారు. ప్రమోషన్‌లో పాల్గొన్నట్లుగా హామీలు నెరవేర్చలేదని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల మేరకు బాద్‌షాపూర్ పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Also Read:

Tirupati Wildlife: తిరుపతి శేషాచలం అటవీప్రాంతంలో కార్చిచ్చు.. ఫారెస్ట్‌ బీట్‌లో చెలరేగిన మంటలు

Hyderabad: వరకట్న వేధింపులు తట్టుకోలేక వైద్యురాలి ఆత్మహత్య.. చివరకు ఏమైందంటే..?