Hyderabad: వరకట్న వేధింపులు తట్టుకోలేక వైద్యురాలి ఆత్మహత్య.. చివరకు ఏమైందంటే..?

Doctor suicide case: ఇద్దరిదీ రెండో వివాహమనే.. ఇద్దరు కూడా వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు.. కొన్ని రోజులు దాంపత్య జీవితం సంతోషంగా కొనసాగింది. ఆ తర్వత భర్త అసలు రూపం బయటపడింది.

Hyderabad: వరకట్న వేధింపులు తట్టుకోలేక వైద్యురాలి ఆత్మహత్య.. చివరకు ఏమైందంటే..?
Hyderabad Crime
Follow us

|

Updated on: Mar 17, 2022 | 8:48 AM

Doctor suicide case: ఇద్దరిదీ రెండో వివాహమనే.. ఇద్దరు కూడా వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు.. కొన్ని రోజులు దాంపత్య జీవితం సంతోషంగా కొనసాగింది. ఆ తర్వత భర్త అసలు రూపం బయటపడింది. వరకట్నం తీసుకురావాలంటూ తీవ్రంగా వేధించడంతో తట్టుకోలేక భార్య ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల 8న జరిగిన ఈ విషాద ఘటన హైదరాబాద్ మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అయితే.. ఈ కేసుపై విచారణ జరిపిన పోలీసులు భర్తను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా దామరచర్లవాసి గంగనపల్లి కాశీ విశ్వనాథం కుమార్తె డాక్టర్ స్వప్న (38) తొలి వివాహం మహబూబ్‌నగర్‌కు చెందిన వ్యక్తితో అయింది. ఆ తర్వాత ఖమ్మం జిల్లా పీహెచ్‌సీలో పనిచేస్తున్న క్రమంలో అనివార్య కారణాలతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు.

అనంతరం కర్నూలుకు చెందిన డాక్టర్‌ ఎం.శ్రీధర్‌తో 2015 ఏప్రిల్‌లో రెండో వివాహం జరిపించారు. ఆ సమయంలో రూ.10 లక్షల నగదు, 14 తులాల బంగారం కట్నం కింద ఇచ్చారు. అనంతరం స్వప్నకు హైదరాబాద్ ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో ఎండీ (ఎస్‌పీఎం) సీటు వచ్చింది. సైదాబాద్‌ డివిజన్‌ వెంకటాద్రినగర్‌లో ఇద్దరు నివాసం ఉంటున్నారు. కొన్ని రోజుల అనంతరం అదనపు కట్నం కోసం శ్రీధర్ ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. మానసిక వేదనకు గురైన ఆమె అంతకుముందు ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించగా.. ఆమెకు చికిత్స సైతం అందించారు.

అయితే.. మళ్లీ ఇంట్లో సగ భాగం, తల్లి బంగారు నగలు తీసుకురావాలని తీవ్రంగా వేధించడంతో ఈనెల 8న స్వప్న ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ కేసులో విచారణ జరిపిన మలక్‌పేట పోలీసులు శ్రీధర్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read:

Kuwait Triple Murder Case: కువైట్ జైలులో ఉన్న కడప వాసి ఆత్మహత్య.. ముగ్గురి హత్య కేసులో.. 

Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.3గా నమోదు..

బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి