వామ్మో.! వాయమ్మో.. ఇదేం విధ్వంసం సామీ. మాటల్లో చెప్పలేం. ఇంగ్లాండ్ జాతీయ జట్టు తరపున కేవలం 14 టీ20 మాత్రమే ఆడిన ఈ ప్లేయర్.. ప్రస్తుతం ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో చెలరేగిపోతున్నాడు. అతడు మరెవరో కాదు టామ్ బాంటన్. ఈ టోర్నీలో తన జట్టుకు కోసం మరోసారి పేలుడు సెంచరీతో సాయపడ్డాడు. గత 8 రోజుల్లో దూకుడైన ఆటతీరుతో రెండో సెంచరీ సాధించాడు ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్. ఈ క్రమంలోనే ఐఎల్‌టి20 చరిత్రలో ఒకే సీజన్‌లో 2 సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
జనవరి 27న డెసర్ట్ వైపర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టామ్ బాంటన్ 55 బంతుల్లో తన రెండో సెంచరీని నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో 7 సిక్సర్లు, 9 ఫోర్ల సాయంతో 190.90 స్ట్రైక్ రేట్‌తో 105 పరుగులు చేశాడు. విశేషమేమిటంటే డెసర్ట్ వైపర్స్‌పై వరుసగా 3 సిక్సర్లు కొట్టి తన రెండో సెంచరీ పూర్తి చేశాడు. జనవరి 19న షార్జా వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బాంటన్ 44 బంతుల్లో ILT20లో తన మొదటి సెంచరీని సాధించాడు.
టామ్ బాంటన్ ILT20లో 369 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే రెండు సెంచరీలు కొట్టాడు. ఈ స్కోరుతో అతడు ప్రస్తుత సీజన్‌లో టాప్ స్కోరర్‌గా కూడా నిలిచాడు. టామ్ బాంటన్ 8 మ్యాచ్‌లలో 16 సిక్సర్లు, 38 ఫోర్ల సహాయంతో 156.35 స్ట్రైక్ రేట్‌తో ఈ పరుగులు సాధించాడు.
ఐఎల్‌టి20లో టామ్ బాంటన్ పరుగుల వరద పారిస్తున్నాడు. రెడ్ హాట్ ఫామ్‌లో ఉన్న ఇతడు.. 2024 నుంచి పేలుడు ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఇప్పటిదాకా T20 క్రికెట్‌లో 151.60 స్ట్రైక్ రేట్‌తో 1134 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతడి బ్యాట్ నుంచి 2 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలు వచ్చాయి. 20 ఓవర్ల గేమ్‌లో ఈ ఇంగ్లాండ్ వికెట్ కీపర్ అద్భుత గణాంకాలు నమోదు చేశాడు.
CARNAGE! DESTRUCTION! RUTHLESS!
Tom Banton & Andre Fletcher were at their unforgiving best tonight.
The two batters sent the fielders on a leather hunt, thumping 6️⃣4️⃣ runs off 18 deliveries, in the 16th, 17th and 18th over. 🥵#MIEvDV #DPWorldILT20 #AllInForCricket… pic.twitter.com/nn5jozZpNj— International League T20 (@ILT20Official) January 27, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి