AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: మంగళగిరిలో వైభవంగా ఉమెన్ ఏపీఎల్ ప్రారంభం.. ముఖ్య అతిథులుగా నారా బ్రాహ్మణి, మిథాలీ రాజ్

మంగళగిరి (Mangalagiri) స్టేడియం వేదికగా ఉమెన్ ఏపీఎల్ (Women AP Premier League - WAPL) పోటీలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభ వేడుకకు ప్రముఖ ప్రముఖులు నారా బ్రాహ్మణి (Nara Brahmani), భారత క్రికెట్ జట్టు (Team India) మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ (Mithali Raj) ముఖ్య అతిథులుగా విచ్చేసి సందడి చేశారు.

Video: మంగళగిరిలో వైభవంగా ఉమెన్ ఏపీఎల్ ప్రారంభం.. ముఖ్య అతిథులుగా నారా బ్రాహ్మణి, మిథాలీ రాజ్
Women Ap Premier League 2026 (1)
Venkata Chari
|

Updated on: Sep 19, 2026 | 7:42 PM

Share

Women AP Premier League 2026: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) క్రీడా రంగంలో నూతన ఉత్సాహాన్ని నింపుతూ ఉమెన్ ఏపీఎల్ (Women AP Premier League – WAPL) సీజన్-1 టోర్నమెంట్ అధికారికంగా ప్రారంభమైంది. మంగళగిరిలోని అత్యాధునిక స్టేడియంలో జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుక క్రీడా ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ వేడుకలో పాల్గొన్న నారా బ్రాహ్మణి (Nara Brahmani) స్వయంగా ఉమెన్ ఏపీఎల్ (Women AP Premier League) ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా క్రీడాకారిణులకు ఇదొక అద్భుతమైన వేదిక అని ప్రశంసించారు. ప్రతిభ ఉండి సరైన అవకాశాలు లభించని యువతకు ఈ టోర్నమెంట్ చక్కటి భవిష్యత్తును ఇస్తుందని, దక్కిన ప్రతి అవకాశాన్ని క్రీడాకారిణులు నమ్మకంతో సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాల మహిళలకు ఈ వేదిక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ అట్టహాస వేడుకలో విజయవాడ ఎంపీ అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (Andhra Cricket Association – ACA) అధ్యక్షుడు కేశినేని శివనాథ్, కార్యదర్శి సానా సతీష్, గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ సుజయ్ కృష్ణరంగారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే సినీ నటి స్నిగ్ధ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ గాయకులు హేమచంద్ర , గీతా మాధురి తమ మధురమైన పాటలతో మైదానంలో ఉన్న ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలతో స్టేడియం మొత్తం కోలాహలంగా మారింది.

Women Ap Premier League 2026 Start

ఈ టోర్నమెంట్‌లో భాగంగా ఉమెన్ ఆంధ్ర ప్రిమియర్ లీగ్ (Women Andhra Premier League) సీజన్-1 తొలి మ్యాచ్‌లో అమరావతి ఈగల్ ఛాంపియన్స్ (Amaravati Eagle Champions), వైజాగ్ ఫైర్‌బర్డ్స్ (Vizag Firebirds) జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మహిళా క్రికెట్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభమైన ఈ లీగ్ మ్యాచ్‌లు రాబోయే రోజుల్లో మరింత రసవత్తరంగా సాగనున్నాయి.

ఏసీఏ క్రికెట్ స్టేడియంలో 7 రోజులు 13 మ్యాచ్ లు..

భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ డబ్ల్యూఏపీఎల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఫ్రాంచైజీ విధానంలో రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న డబ్ల్యూఏపీఎల్ టీ-20 క్రికెట్ పోటీల్లో నాలుగు జట్లు రాయలసీమ జెన్ స్టార్స్, గోదావరి ఈగల్స్, అమరావతి ఈ-ఛాంపియన్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్ తలపడనున్నాయి. మంగళగిరిలోని ఏసీఏ క్రికెట్ స్టేడియంలో 7 రోజుల పాటు 13 మ్యాచ్ లు జరగనున్నాయి. శనివారం మధ్యాహ్నం రాయలసీమ జెన్ స్టార్స్, గోదావరి ఈగల్స్ మధ్య ప్రారంభ మ్యాచ్ జరిగింది. సాయంత్రం అమరావతి ఈ-ఛాంపియన్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్ మధ్య రెండో మ్యాచ్ జరిగింది.

Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా