AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోహ్లీ తన పని తాను చూస్కోకుండా.. ఎంతసేపు పక్కోడిని..! ఇంగ్లాండ్ ప్లేయర్, RCB టీమ్మెంట్ షాకింగ్ కామెంట్స్

ఇంగ్లాండ్ క్రికెటర్ జోర్డాన్ కాక్స్, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ వ్యక్తిత్వంపై ప్రశంసలు కురిపించారు. ఐపీఎల్ అనుభవాలను పంచుకుంటూ, కోహ్లీ కేవలం గొప్ప ఆటగాడే కాదు, యువ క్రికెటర్లకు గొప్ప మార్గదర్శి అని తెలిపారు. తనకంటే తోటివారి ఎదుగుదలను కోహ్లీ ఎక్కువ కోరుకుంటారని, వారికి విలువైన సలహాలు, సూచనలు ఇస్తూ వారిని ప్రోత్సహిస్తారని కాక్స్ పేర్కొన్నారు.

కోహ్లీ తన పని తాను చూస్కోకుండా.. ఎంతసేపు పక్కోడిని..! ఇంగ్లాండ్ ప్లేయర్, RCB టీమ్మెంట్ షాకింగ్ కామెంట్స్
Virat Kohli
SN Pasha
|

Updated on: Jul 10, 2026 | 7:02 PM

Share

క్రికెట్‌లో పెద్ద స్థాయికి చేరుకున్న ఆటగాళ్లు సాధారణంగా తమ ఆట, తమ ప్రదర్శనపైనే ఎక్కువ దృష్టి పెడతారని భావిస్తుంటారు. అయితే కొందరు మాత్రం గ్రౌండ్‌లోనే కాదు, వ్యక్తిత్వంలోనూ ఉన్నంతంగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో అతను ఒకడంటూ ఇంగ్లాండ్ క్రికెటర్ జోర్డాన్ కాక్స్, టీమిండియా దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం అతని కామెంట్స్ భారత క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఐపీఎల్ సందర్భంగా తనకు ఎదురైన అనుభవాన్ని గుర్తు చేసుకున్న కాక్స్.. నాకు అత్యంత ప్రత్యేకంగా అనిపించిన విషయం ఏమిటంటే, ఒక ఆటగాడిగా విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ నా కోసం టైమ్ కేటాయించడం. విరాట్ లాంటి గొప్ప క్రికెటర్, పేరు, ప్రతిష్ఠ ఉన్నప్పటికీ కొత్త ఆటగాళ్లతో మాట్లాడేందుకు, వారికి మార్గనిర్దేశం చేసేందుకు ఎప్పుడూ ముందుంటాడు. ఇన్‌ఫ్యాక్ట్ తన కంటే కూడా తన చుట్టూ ఉన్న వాళ్లు మరింత మెరుగు అవ్వాలని తపన పడుతుంటాడు. తనకు తాను ఇచ్చుకునే టైమ్ కంటే తన పక్కన వారు ఇంప్రూవ్ అయ్యేందుకు కోహ్లీ ఎక్కువ టైమ్ కేటాయిస్తూ ఉంటాడు అని పేర్కొన్నాడు.

కాగా విరాట్ కోహ్లీతో కలిసి జోర్డాన్ కాక్స్ ఐపీఎల్‌లో ఆర్సీబీ టీమ్‌లో ఉన్న విషయం తెలిసిందే. కాక్స్‌కు ఆర్సీబీ తరఫున మ్యాచ్‌లు ఆడే అవకాశం రాకపోయినా.. బెంచ్ బలంగా ఉండటంలో కాక్స్ ఒక కారణం. ఇంగ్లాండ్ నుంచి ఫిల్ సాల్ట్, జాకబ్ బెతెల్‌తో పాటు కాక్స్ కూడా ఆర్సీబీ టీమ్‌లో ఉన్నాడు. మరి వచ్చే ఏడాది అయినా అతనికి ఆర్సీబీ తరఫున ప్లేయింగ్ ఎలెవన్‌లో బరిలోకి దిగే అవకాశం వస్తుందో రాదో చూడాలి. అయితే కాక్స్ చెప్పినట్లు విరాట్ కోహ్లీ యువ క్రికెటర్లకు, విదేశీ క్రికెటర్లు కూడా బ్యాటింగ్ టిప్స్, తన విలువైన సలహాలు సూచనలు ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అంతెందుకు తనను ఎలా అవుట్ చేయాలో లక్నో బౌలర్ ప్రిన్స్ యాదవ్‌కు చెప్పి, ఐపీఎల్‌లో అతని బౌలింగ్‌‌లోనే అవుట్ అయిన ప్లేయర్ కోహ్లీ. ఆటగాళ్లు టెంపరరీ.. క్రికెట్ పర్మినెంట్ అనుకునే ప్లేయర్ కోహ్లీ అని ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us