Vijay Hazare Trophy 2021: సిక్సర్ల వర్షం కురిపించిన రాబిన్ ఊతప్ప.. 50 ఓవర్ల మ్యాచ్ కేవలం 53 బంతుల్లో పూర్తి.. ఒకే ఓవర్‌లో వరుసగా ఐదు సిక్స్‌లు..

| Edited By: Team Veegam

Mar 01, 2021 | 1:30 PM

Vijay Hazare Trophy 2021: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోపీలో భాగంగా వివిధ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఆదివారం బిహార్- కేరళ మధ్య జరిగిన

Vijay Hazare Trophy 2021: సిక్సర్ల వర్షం కురిపించిన రాబిన్ ఊతప్ప.. 50 ఓవర్ల మ్యాచ్ కేవలం 53 బంతుల్లో పూర్తి.. ఒకే ఓవర్‌లో వరుసగా ఐదు సిక్స్‌లు..
Follow us on

Vijay Hazare Trophy 2021: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోపీలో భాగంగా వివిధ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఆదివారం బిహార్- కేరళ మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో కేరళ్ ఘన విజయం సాధించింది. మొదటగా బ్యాటింగ్ ప్రారంభించిన బిహార్ 40.2 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌట్ అయింది. బబూల్ కుమార్ ఒక్కడే కేరళ బౌలర్ల ధాటికి నిలిచి 64 పరుగులు చేశాడు. దీంతో బిహార్ ఆ మాత్రం స్కోరో అయినా సాధించగలిగింది. ఇక శ్రీశాంత్ 4 వికెట్లతో చెలరేగగా జలజ్ సక్సేనా 3 వికెట్లు సాధించాడు. ఎమ్‌డీ నిధీశ్ 2, అక్షయ్ చంద్రన్ 1 వికెట్ సాధించారు.

148 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కేరళ 8.5 ఓవర్లలో విజయం సాధించింది. యాభై ఓవర్ల ఆటను కేవలం 53 బంతుల్లో ముగించారు. కేరళ ఆటగాడు రాబిన్ ఊతప్ప ఒక్కసారిగా సిక్సర్లతో బిహార్ బౌలర్లపై విరుచుకపడ్డాడు. కేవలం 32 బంతుల్లో 82 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చి నాటౌట్‌గా నిలిచాడు. 10 సిక్సర్లు, 4 బౌండరీలతో వేగంగా పరుగులు రాబట్టాడు. బీహార్ బౌలర్ వికాస్ పటేల్ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో వరుసగా ఐదుబంతుల్లో ఐదు సిక్స్‌లు బాదాడు. మరోవైపు విష్ణు వినోద్ 37 పరుగులు చేయగా సంజు శాంసన్ 24 పరుగులతో నిలిచాడు. బిహార్ బౌలర్లలో అశుతోశ్ అమన్‌ ఒక వికెట్ సాధించాడు. ఫలితంగా బిహార్‌పై కేరళ ఘన విజయం సాధించి తదుపరి రౌండ్‌కి ఎంపికైంది. కాగా రాబిన్ ఊతప్పకు విజయ్ హజారే ట్రోపీలో రెండో వేగవంతమైన హాప్ సెంచరీ. టోర్నీలో ఇప్పటి వరకు అతడు 2 అర్ధ సెంచరీలతో పాటు, 2 సెంచరీలు సాధించాడు. ఇక ఐపీల్‌లో ఊతప్ప సీఎస్‌కే తరపున ఆడనున్నాడు. ఈసారి రాబిన్ ఉత్తప్ప పసుపు జెర్సీలో ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఆడబోతున్నాడు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో ‘క్రాక్ జయమ్మ’.. పొలిటికల్ లీడర్‌గా తడాఖా చూపనున్న తమిళ లేడీ విలన్..

మహబూబ్‌నగర్ జిల్లాలో గ్రనేడ్ బాంబు కలకలం, హడలిపోతోన్న స్థానికులు..టీవీ9 సాహసోపేత కవరేజ్

Hari Nadar As Hero: ఈ గోల్డ్ మ్యాన్ హీరోగా మారాడు.. హీరోయిన్‌ ఎవరో తెలిస్తే షాకవుతారు…