బుమ్రా, స్టార్క్ కాదు.. నేను భయపడే బౌలర్ ఎవరంటే.. వైభవ్ సూర్యవంశీ మాస్ స్టేట్‌మెంట్..!

Vaibhav Sooryavanshi: వయసు చిన్నదైనా వైభవ్ సూర్యవంశీ చూపుతున్న ఆత్మవిశ్వాసం, పరిణతి క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఏ బౌలర్‌కూ భయపడని ఈ విధ్వంసకర ధోరణితో రాబోయే రోజుల్లో భారత్ తరఫున మరిన్ని అద్భుతాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో బుడ్డోడిని భయపెట్టేదెవరో చెప్పేశాడు.

బుమ్రా, స్టార్క్ కాదు.. నేను భయపడే బౌలర్ ఎవరంటే.. వైభవ్ సూర్యవంశీ మాస్ స్టేట్‌మెంట్..!
Vaibhav Sooryavanshi

Updated on: Aug 02, 2026 | 8:36 PM

Vaibhav Sooryavanshi: టీమిండియా యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో తుఫాన్ సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయ దిగ్గజ బౌలర్లను సైతం లెక్కచేయని ఈ 15 ఏళ్ల కుర్రాడు.. తానూ ఏ బౌలర్‌కు భయపడనంటూ ఇచ్చిన సంచలన ఇంటర్వ్యూ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

ప్రస్తుత భారత క్రికెట్‌లో వైభవ్ సూర్యవంశీ పేరు మారుమోగిపోతోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే దేశవాళీ టోర్నీలతో పాటు ఐపీఎల్, భారత ఏ జట్టు తరపున అద్భుతాలు సృష్టిస్తూ అంతర్జాతీయ స్థాయి ఆటగాడిగా అవతరించాడు. ఐపీఎల్ ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డును సొంతం చేసుకోవడమే కాక, అతి చిన్న వయసులోనే ఆరెంజ్ క్యాప్ అందుకున్న ఆటగాడిగా చరిత్ర పుటలకెక్కాడు.

జింబాబ్వే పర్యటనలో విధ్వంసకర ప్రదర్శన..

ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ సంచలన బ్యాటర్, జింబాబ్వే టీ20 సిరీస్‌లో మైదానంలో పూనకం వచ్చినట్లు చెలరేగిపోయాడు. రెండు అదిరిపోయే అర్ధశతకాలతో విరుచుకుపడి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును చేజిక్కించుకున్నాడు. పవర్‌ప్లేలోనే ప్రత్యర్థి బౌలర్ల బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ గ్రౌండ్ నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపించడం ఈ కుర్రాడి నైజం.

దిగ్గజ బౌలర్లకే చుక్కలు చూపించిన వైనం..

ఐపీఎల్‌లో ప్రపంచస్థాయి బౌలర్లను వైభవ్ ఏమాత్రం లెక్కచేయలేదు. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, భువనేశ్వర్ కుమార్, పాట్ కమిన్స్, మహమ్మద్ సిరాజ్, మిచెల్ స్టార్క్ లాంటి దిగ్గజాల బౌలింగ్‌లో సైతం సునాయాసంగా భారీ సిక్సర్లు బాదాడు. మైదానంలో ఎంతటి స్టార్ బౌలర్ ఉన్నా తన శైలిలోనే ఆడుతూ ఒత్తిడిని ప్రత్యర్థులపైకి నెట్టేసే మనస్తత్వం అతడి సొంతం.

జడేజా ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు..

రాజస్థాన్ రాయల్స్ విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో రవీంద్ర జడేజా వైభవ్‌ను ఇంటర్వ్యూ చేశాడు. “అందరి బౌలింగ్‌లో సులువుగా సిక్సర్లు కొడుతున్నావు కదా, మైదానంలో నిన్ను భయపెట్టిన బౌలర్ ఎవరైనా ఉన్నారా?” అని జడేజా ప్రశ్నించగా వైభవ్ అద్భుతమైన సమాధానం ఇచ్చాడు. తాను ఎదుర్కోవడానికి ఇష్టపడని బౌలర్ అంటూ ప్రస్తుతం ఎవరూ లేరని ధైర్యంగా చెప్పాడు. ఫాస్ట్ బౌలర్లు అయినా, స్పిన్నర్లు అయినా తనను ఏమాత్రం భయపెట్టలేరని స్పష్టం చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us