IPL 2027: సన్‌రైజర్స్‌కు అభిషేక్ శర్మ గుడ్‌బై..? గురువు సెంటిమెంట్‌తో కొత్త జట్టుతో బరిలోకి.!

Abhishek Sharma: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కీలక ఆటగాడిగా కొనసాగుతున్న అభిషేక్ శర్మ (Abhishek Sharma) విషయంలో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. 2027 సీజన్‌కు ముందే ఫ్రాంచైజీతో అతడి బంధం మారే అవకాశాలపై మీడియా కథనాలు వస్తున్నాయి. ఈషాన్ కిషన్‌కు కెప్టెన్సీ ఇవ్వడంపై అసంతృప్తి కారణంగా ట్రేడ్ డీల్ ద్వారా మరో జట్టుకు వెళ్లొచ్చన్న ప్రచారం జోరందుకుంది.

IPL 2027: సన్‌రైజర్స్‌కు అభిషేక్ శర్మ గుడ్‌బై..? గురువు సెంటిమెంట్‌తో కొత్త జట్టుతో బరిలోకి.!
Ipl 2027 Abhishek Sharma

Updated on: Oct 04, 2026 | 12:03 PM

Abhishek Sharma: అభిషేక్ శర్మ పేరు ఐపీఎల్ 2027కు ముందే ట్రేడ్ చర్చల్లో వినిపిస్తోంది. గత ఐదేళ్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)లో కీలక బ్యాటర్‌గా ఉన్న అతడు, పవర్‌ప్లేలో దూకుడైన బ్యాటింగ్‌తో జట్టుకు ఉపయోగపడ్డాడు. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీతో అతడి భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మీడియా కథనాల ప్రకారం, ఈషాన్ కిషన్ (Ishan Kishan)కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై అభిషేక్ సంతోషంగా లేడనే ప్రచారం ఉంది. ఐపీఎల్ 2026లో ప్యాట్ కమిన్స్ (Pat Cummins) తొలి మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోయిన సమయంలో ఈషాన్‌కు కెప్టెన్సీ ఇచ్చారు. ఆ నిర్ణయం అభిషేక్‌కు నచ్చలేదని కథనాలు పేర్కొంటున్నాయి.

ఎక్కువమంది చదివినది: 351 పరుగులు చేసినా ఓటమి.. ఆ నిర్ణయమే టీమిండియా కొంపముంచిదా..?

ఇవి కూడా చదవండి

అప్పటి పరిణామాల తర్వాత అతడు సన్‌రైజర్స్‌ను వీడొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. ట్రేడ్ డీల్ ద్వారా మరో ఫ్రాంచైజీలోకి వెళ్లే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ (Mumbai Indians), గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), పంజాబ్ కింగ్స్ (Punjab Kings) అతడిపై ఆసక్తి చూపుతున్నట్లు మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.

ఇక కొత్త జట్టు విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అభిషేక్ శర్మ గురువు యువరాజ్ సింగ్ (Yuvraj Singh) ఆ ఫ్రాంచైజీ కోచింగ్ సెటప్‌లో ఉండటం దీనికి ఒక కారణంగా చెబుతున్నారు. అందుకే సన్‌రైజర్స్‌ను వీడితే ఢిల్లీ అతడిని తీసుకునే అవకాశాలున్నాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఐపీఎల్ 2027లో అభిషేక్ నిజంగానే కొత్త జట్టుకు మారతాడనే విషయం ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారణ కాలేదు. కెప్టెన్సీ విషయానికి వస్తే అతడికి అవకాశం దక్కడం ప్రస్తుతం కష్టంగానే కనిపిస్తోందని సోర్స్ పేర్కొంటోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) మినహా మిగతా జట్లకు కెప్టెన్లు ఖరారై ఉన్నారని అందులో ఉంది. ఆ రెండు ఫ్రాంచైజీలు అభిషేక్‌పై ఆసక్తి చూపలేదని సమాచారం.

ఎక్కువమంది చదివినది: ఈ జట్టుతో వన్డే వరల్డ్ కప్‌నకు పోతే పరువుపోద్ది.. ఈ ఇద్దరిని తప్పించి, ఆ ఇద్దర్ని పిలవండి..!

ట్రేడ్ జరిగితే అతడు ప్రధానంగా బ్యాటర్‌గా ఆడే అవకాశం ఉంటుందని కథనం చెబుతోంది. చివరికి అభిషేక్ శర్మ ఏ జట్టులో కనిపిస్తాడనేది ఐపీఎల్ 2027కు ముందు కీలక అంశంగా మారనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us