ఇదేందిది.. ఫనిష్మెంట్ ఇద్దామని నంబర్ 6లో పంపితే.. మాస్టర్ ప్లాన్‌తో ముంచెత్తిన తెలుగబ్బాయ్..

Tilak Varma Number 6 Batting: గంభీర్, సూర్యకుమార్ యాదవ్‌ల మాస్టర్ ప్లాన్ జింబాబ్వే‌పై పని చేసింది. తెలుగబ్బాయ్ తిలక్ వర్మను సరిగ్గా ఆడడం లేదని బ్యాటింగ్ ఆర్డర్‌లో మరింత కిందికి పంపారు. కానీ, ఈ నిర్ణయం 100 శాతం పనిచేసింది.

ఇదేందిది.. ఫనిష్మెంట్ ఇద్దామని నంబర్ 6లో పంపితే.. మాస్టర్ ప్లాన్‌తో ముంచెత్తిన తెలుగబ్బాయ్..
Tilak Varma

Updated on: Feb 27, 2026 | 5:55 PM

Tilak Varma: టీ20 వరల్డ్ కప్ 2026లో జింబాబ్వేపై టీమ్ ఇండియా ఘనవిజయం సాధించింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. ఈ విజయానికి కారణం జట్టు మేనేజ్‌మెంట్ వేసిన మాస్టర్ ప్లాన్ అని చెప్పాలి. నంబర్-3లో ఆడుతూ వస్తున్న తిలక్ వర్మను నంబర్-6కు పంపించడం గేమ్ ఛేంజర్‌గా మారింది.

తిలక్ వర్మ ‘డిమోషన్’.. కానీ పెరిగిన ప్రభావం..!

జింబాబ్వే మ్యాచ్‌కు ముందు తిలక్ వర్మ నంబర్-3లో ఆడుతూ 25, 25, 25, 31, 1 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో జట్టు మేనేజ్‌మెంట్ అతడిని నంబర్-6లో బ్యాటింగ్‌కు పంపింది. ఈ నిర్ణయం పూర్తిగా సక్సెస్ అయింది. తిలక్ వర్మ (Tilak Varma) కేవలం 16 బంతుల్లోనే 44* పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 275 స్ట్రైక్ రేట్‌తో 3 ఫోర్లు, 4 సిక్సర్లు బాదుతూ చివరి ఓవర్లలో మ్యాచ్‌ను పూర్తిగా మలిచాడు.

హార్దిక్‌తో కలసి విధ్వంసకర భాగస్వామ్యం..

తిలక్ వర్మకు తోడుగా హార్దిక్ పాండ్య (Hardik Pandya) కూడా దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ కలిసి కేవలం 31 బంతుల్లోనే 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ దూకుడుతో భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 256 పరుగుల భారీ స్కోరు సాధించింది. హార్దిక్ పాండ్యా 23 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి 217 స్ట్రైక్ రేట్‌తో ఆడటం విశేషం.

టాప్ ఆర్డర్ దూకుడు..

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు మంచి ఆరంభం లభించింది. సంజూ శాంసన్ (Sanju Samson) శుభారంభం అందించాడు. అభిషేక్ శర్మ (Abhishek Sharma) 30 బంతుల్లో 55 పరుగులు (4 ఫోర్లు, 4 సిక్సర్లు) బాదాడు. ఇషాన్ కిషన్ (Ishan Kishan) 24 బంతుల్లో 38 పరుగులు చేయగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కేవలం 13 బంతుల్లో 33 పరుగులు చేశాడు. ఈ సమిష్టి ప్రదర్శనతో భారత్ టోర్నీలో రెండో అత్యధిక స్కోరు నమోదు చేసింది.

జట్టు వ్యూహం సక్సెస్..

బ్యాటింగ్ ఆర్డర్‌లో చేసిన చిన్న మార్పు ఎంత పెద్ద ఫలితాన్ని ఇస్తుందో ఈ మ్యాచ్ స్పష్టం చేసింది. తిలక్ వర్మను చివరి ఓవర్లలో ఉపయోగించడం ద్వారా భారత్ భారీ స్కోరు సాధించింది. సెమీఫైనల్ పోరాటానికి ముందు ఈ విజయం జట్టుకు భారీ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us