Team India: భారత్, జింబాబ్వే మ్యాచ్‌లో ఇది గమనించారా.. క్రికెట్ హిస్టరీలోనే అరుదైన సీన్ భయ్యో..!

Team India vs Zimbabwe 2026: భారత జట్టు మస్ట్ విన్ మ్యాచ్‌లో సత్తా చాటింది. బ్యాటింగ్ సమయంలో ఏకంగా ఆరుగురు ప్లేయర్స్ 150 + స్ట్రైక్ రేట్‌తో ఊచకోత కోశారు. దీంతో జింబాబ్వే ముందు 256 పరుగుల టార్గెట్ ఉంచారు.

Team India: భారత్, జింబాబ్వే మ్యాచ్‌లో ఇది గమనించారా.. క్రికెట్ హిస్టరీలోనే అరుదైన సీన్ భయ్యో..!
India Vs Zimbabwe Records List

Updated on: Feb 27, 2026 | 9:40 AM

6 Players 150 Plus Strike Rate: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 దశలో జింబాబ్వేపై టీమిండియా బ్యాటింగ్ విప్లవం సృష్టించింది. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు 256 పరుగుల భారీ స్కోరు నమోదు చేసి ప్రత్యర్థిని పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టింది. ముఖ్యంగా ఆరుగురు భారత బ్యాటర్లు 150కు పైగా స్ట్రైక్ రేట్ నమోదు చేయడం ఈ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

150కి పైగా స్ట్రైక్ రేట్ నమోదు చేసిన భారత ఆటగాళ్లు..

ఈ మ్యాచ్‌లో ప్రతి బ్యాటర్ దూకుడుగా ఆడి జింబాబ్వే బౌలర్లను మట్టికరిపించాడు.

150 + స్ట్రైక్ రేట్ తో ముగ్గురు..

సంజూ శాంసన్ – 24 (15), స్ట్రైక్ రేట్ 160.00

అభిషేక్ శర్మ – 55 (30), స్ట్రైక్ రేట్ 183.33

ఇషాన్ కిషన్ – 38 (24), స్ట్రైక్ రేట్ 158.33

210 + స్ట్రైక్ రేట్ తో ముగ్గురు..

సూర్యకుమార్ యాదవ్ – 33 (13), స్ట్రైక్ రేట్ 253.85

హార్దిక్ పాండ్యా – 50* (23), స్ట్రైక్ రేట్ 217.39

తిలక్ వర్మ – 44* (16), స్ట్రైక్ రేట్ 275.00

ఇందులో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన వేగంతో రన్స్ సాధించి డెత్ ఓవర్లలో స్కోరును మరింత పెంచారు.

పవర్‌ప్లే నుంచే దూకుడు..

ఓపెనర్లు వేగంగా ఆరంభం ఇవ్వడంతో రన్‌రేట్ 10కు పైగా కొనసాగింది. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లపై అటాక్ కొనసాగించడంతో మ్యాచ్ పూర్తిగా భారత జట్టుకే అనుకూలమైంది.

డెత్ ఓవర్లలో పరుగుల వర్షం..

చివరి 5 ఓవర్లలో హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ జంట విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించారు. ప్రతి ఓవర్‌లో 15-20 పరుగుల వేగంతో స్కోరు పెరిగింది.

బౌలింగ్‌లోనూ అదిరిన భారత్.. కానీ,

భారీ లక్ష్యాన్ని కాపాడుతూ భారత బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేశారు. కీలక సమయాల్లో వికెట్లు తీసి మ్యాచ్‌ను 72 పరుగుల తేడాతో ముగించారు. ఈ విజయం నెట్ రన్ రేట్ పరంగా కూడా భారత్‌కు భారీ లాభం ఇచ్చింది. అయితే, శివం దుబే మాత్రం చెత్తగా బౌలింగ్ చేశాడు.

ఒకే మ్యాచ్‌లో ఆరుగురు బ్యాటర్లు 150కి పైగా స్ట్రైక్ రేట్ నమోదు చేయడం అరుదైన ఘట్టం. సూపర్ 8లో ఈ విధ్వంసకర విజయం టీమిండియాకు సెమీఫైనల్ దిశగా బలమైన అడుగు. బ్యాటింగ్ లోతు, ఫినిషింగ్ శక్తి, అగ్రెసివ్ ఆట – ఇవన్నీ కలిసొచ్చినప్పుడు భారత్ ఎంత ప్రమాదకరమో ఈ మ్యాచ్ చూపించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us