ఇలాంటోడు ఒక్కడు చాలు.. ఇంకోసారి చేతికి బాల్ ఇవ్వనంటే ఇవ్వను.. మెంటలెక్కించేశాడు..

Shivam Dube Bowling: టీమిండియా ఆల్ రౌండర్ శివమ్ దూబే వేసిన ఓ విచిత్ర నోబాల్ భారత్, జింబాబ్వే మ్యాచ్‌లో చర్చనీయాంశమైంది. అయితే, భారత్ సమష్టి ప్రదర్శనతో భారీ విజయం సాధించింది. ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక మ్యాచ్‌లో గెలిస్తే సెమీఫైనల్ అవకాశాలు మరింత బలపడతాయి.

ఇలాంటోడు ఒక్కడు చాలు.. ఇంకోసారి చేతికి బాల్ ఇవ్వనంటే ఇవ్వను.. మెంటలెక్కించేశాడు..
Shivam Dube Bowling

Updated on: Feb 27, 2026 | 9:45 AM

Shivam Dube Bowling: తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సూర్యసేన సారధ్యంలోని భారత జట్టు 72 పరుగుల తేడాతో జింబాబ్వేను మట్టికరింపించింది. అయితే, 77 పరుగుల తేడాతో గెలవాల్సిన తరుణంలో సూర్యకుమార్ తీసుకున్న ఓ నిర్ణయం దారుణంగా విఫలమైంది. దీంతో భారత జట్టు ఆ ఒక్క ఓవర్ తో సీన్ రివర్స్ అయింది. టీమిండియా ఆల్ రౌండర్ శివం దుబే వేసిన రెండు ఓవర్లు జింబాబ్వేపై భారీ విజయాన్ని కాస్త తగ్గించేలా చేసింది. ఈ క్రమంలో శివం దుబే ఒక విచిత్రమైన నోబాల్ టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్‌లో పెద్ద చర్చకు దారితీసింది. గురువారం జింబాబ్వేతో జరిగిన పోరులో ఈ సంఘటన చోటుచేసుకుంది.

ఎలా జరిగింది?

జింబాబ్వే ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో దూబే, బ్యాటర్ బెన్నెట్ (Brian Bennett)కు ఆఫ్ స్టంప్ బయటగా బంతులు వేయాలని వ్యూహం అమలు చేశాడు. కానీ, బెన్నెట్ దూబే బౌలింగ్‌పై దాడి చేసి పరుగులు సాధించాడు. దాంతో దూబే వరుసగా ఆఫ్ స్టంప్ బయట బౌలింగ్ కొనసాగించాడు. ఫలితంగా 3 వైడ్లు నమోదయ్యాయి. అయితే తదుపరి బంతి మరింత బయటకు వెళ్లి పిచ్ బయట గడ్డిపై పడింది. వెంటనే అంపైర్ నోబాల్ సంకేతం ఇచ్చాడు.

క్రికెట్ నిబంధనల ప్రకారం బంతి పిచ్ పరిమితుల్లోనే పడాలి. కానీ ఈ బంతి పూర్తిగా పిచ్ బయట పడడంతో అది నోబాల్‌గా ప్రకటించాడు.

ఎంసీసీ చట్టం ఏమంటుంది?

ఎంసీసీ లా 21.7 ప్రకారం: బంతి బ్యాటర్ లేదా అతని శరీరాన్ని తాకకముందు, ఒకసారి కంటే ఎక్కువ బౌన్స్ అయితే లేదా గ్రౌండ్ మీద రోల్ అయితే లేదా పిచ్ పరిమితి బయట పడితే అంపైర్ దానిని నోబాల్‌గా ప్రకటించాలి.

ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు దూబే బౌలింగ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే మ్యాచ్ ఫలితంలో భారత్ ఘన విజయం సాధించింది. అభిషేక్ శర్మ (Abhishek Sharma), హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. బౌలింగ్‌లో అర్షదీప్ సింగ్ (Arshdeep Singh) 3/24తో కీలక పాత్ర పోషించాడు. దీంతో భారత జట్టు జింబాబ్వేపై 72 పరుగుల తేడాతో విజయం సాధించింది.

శివం దుబే బౌలింగ్ వివరాలు..

మొత్తంగా శివం దుబే 2 ఓవర్లు బౌలింగ్ చేసి 46 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో నోబాల్స్ 2, వైడ్స్ 4 ఉన్నాయి. అయితే, తొలి ఓవర్ లో ఏకంగా 10 బంతులు విసిరాడు. ఆ తర్వాత రెండో ఓవర్ లో 8 బంతులు విసిరాడు.

సెమీఫైనల్ సమీకరణాలు..

ఈ ఓటమితో జింబాబ్వే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అదే సమయంలో సౌతాఫ్రికా సెమీఫైనల్ స్థానం ఖరారైంది. భారత్‌ జట్టుకు సౌతాఫ్రికాపై 76 పరుగుల ఓటమి ఎదురైనా, ఈ భారీ విజయం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇప్పుడు మార్చి 1న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens)లో వెస్టిండీస్ జట్టుతో జరిగే మ్యాచ్ వర్చువల్ నాకౌట్‌గా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us