6,6,6,6,6,6.. 12 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌లో అరుదైన సీన్.. బద్దలైన ప్రపంచ రికార్డ్..

T20 World Cup 2026: వెస్టిండీస్ వర్సెస్ జింబాబ్వే మధ్య జరిగిన సూపర్ 8 మ్యాచ్ చారిత్రాత్మకమైనది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు అద్భుతమైన ఘనతను సాధించి, 12 ఏళ్ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాయి. ఆ వివరాలు ఏంటో ఓసారి చూద్దాం..

6,6,6,6,6,6.. 12 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌లో అరుదైన సీన్.. బద్దలైన ప్రపంచ రికార్డ్..
Wi Vs Zim World Record

Updated on: Feb 24, 2026 | 9:20 AM

T20 World Cup 2026: వెస్టిండీస్, జింబాబ్వే జట్ల మధ్య జరిగిన సూపర్-8 మ్యాచ్ క్రికెట్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిసి 12 ఏళ్ల పాత వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాయి. ఈ మ్యాచ్ లో భారీగా ఫోర్లు, సిక్సులు నమోదై అభిమానులకు అసలైన వినోదాన్ని అందించింది. ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు 107 పరుగుల భారీ తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది. ఈ పోరులో రికార్డుల వర్షం కురిసింది. ఇంతకుముందు ఈ టోర్నీలో ఎన్నడూ చూడని విధంగా సిక్సుల వర్షం కురిసి, అభిమానులను ఆశ్చర్యపరిచింది.

వెస్టిండీస్–జింబాబ్వే మ్యాచ్‌లో బద్దలైన వరల్డ్ రికార్డ్..

ఈ మ్యాచ్‌లో మొత్తం 31 సిక్సులు నమోదయ్యాయి. ఇది టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో నమోదైన అత్యధిక సిక్సుల కొత్త వరల్డ్ రికార్డు. ఇంతకుముందు 2014లో ఐర్లాండ్–నెదర్లాండ్స్ మ్యాచ్‌లో నమోదైన 30 సిక్సుల రికార్డును ఇది అధిగమించింది. అంటే, టీ20 వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి ఒకే మ్యాచ్‌లో 30కి పైగా సిక్సులు నమోదయ్యాయి.

వెస్టిండీస్ బ్యాటర్ల తుఫాన్ బ్యాటింగ్..

టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 6 వికెట్లకు 254 పరుగులు చేసింది. ఇది ఈ వరల్డ్ కప్‌లోనే అత్యధిక జట్టు స్కోర్ కాగా, టీ20 వరల్డ్ కప్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్‌గా నిలిచింది. వెస్టిండీస్ బ్యాటర్లు మొత్తం 19 సిక్సులు బాదుతూ, ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సుల రికార్డును సమం చేశారు.

ప్రత్యుత్తరంగా జింబాబ్వే 255 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు ప్రయత్నించి 17.4 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయింది. బ్రాడ్ ఎవాన్స్ 21 బంతుల్లో 43 పరుగులు (5 సిక్సులు) చేస్తూ పోరాడాడు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో మొత్తం 12 సిక్సులు నమోదయ్యాయి. ఈ విధంగా మ్యాచ్ మొత్తంలో 31 సిక్సులు నమోదై కొత్త వరల్డ్ రికార్డు నెలకొంది.

ఈ విజయంతో వెస్టిండీస్ సెమీఫైనల్ దిశగా బలమైన అడుగు వేసింది. టోర్నీలో వరుసగా 5 విజయాలు సాధించిన వెస్టిండీస్, ఇకపై దక్షిణాఫ్రికా, భారత్ వంటి బలమైన జట్లను ఎదుర్కోనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us