IND vs ZIM: జింబాబ్వేతో కీలక మ్యాచ్.. ఏకంగా నలుగురికి హ్యాండిచ్చిన సూర్య.. ఎవరంటే?

India vs Zimbabwe: టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు జింబాబ్వేతో కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సి ఉంది. ఈ క్రమంలో టీమిండియా ప్లేయింగ్ 11లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఏకంగా నలుగురు ప్లేయర్లకు మొండిచేయి చూపించేందుకు సూర్యకుమార్ యాదవ్ సిద్ధమయ్యాడు.

IND vs ZIM: జింబాబ్వేతో కీలక మ్యాచ్.. ఏకంగా నలుగురికి హ్యాండిచ్చిన సూర్య.. ఎవరంటే?
Ind Vs Zim Playing Xi

Updated on: Feb 24, 2026 | 5:15 PM

India vs Zimbabwe: భారత క్రికెట్ జట్టు తదుపరి మ్యాచ్ ఫిబ్రవరి 26న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జింబాబ్వేతో జరగనుంది. ఈ మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియాకు అత్యంత కీలకం. సూపర్-8 దశలో సెమీఫైనల్ ఆశలు నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలవాల్సిన అవసరం ఉంది. జింబాబ్వేతో మ్యాచ్ కోసం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పటికే తన వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

వచ్చే మ్యాచ్‌లో కొంతమంది కీలక ఆటగాళ్లు బెంచ్‌పైనే కూర్చునే అవకాశముంది. సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కలిసి కొత్త ప్లేయింగ్ ఎలెవన్‌పై ముద్ర వేసే సూచనలు కనిపిస్తున్నాయి. సెమీఫైనల్‌కు చేరాలంటే కేవలం గెలుపే కాకుండా భారీ తేడాతో విజయం సాధించాల్సిన పరిస్థితి భారత్ ముందు ఉంది.

అభిషేక్ శర్మ – వాషింగ్టన్ సుందర్‌కు డ్రాప్..?

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8లో రెండో మ్యాచ్ కోసం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ తమ అత్యంత దూకుడైన ఓపెనర్ అభిషేక్ శర్మను ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించే అవకాశముంది. టోర్నమెంట్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ కేవలం 15 పరుగులే చేశాడు. ఈ క్రమంలో వరుసగా మూడు సార్లు డక్‌గా ఔటయ్యాడు.

అభిషేక్ స్థానంలో సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వనున్నారని సమాచారం. ఇక వాషింగ్టన్ సుందర్‌ను కూడా బెంచ్‌పైనే ఉంచే అవకాశముంది. రెండు మ్యాచ్‌ల్లో అవకాశమిచ్చినా సుందర్ బ్యాట్‌తోనూ, బౌలింగ్‌తోనూ ప్రభావం చూపలేకపోయాడు. నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌ల్లో అతను వికెట్లు తీయలేకపోయాడు. బ్యాటింగ్‌లో కూడా పరుగులు రాలేదు.

రింకూ సింగ్ – సిరాజ్ కూడా బెంచ్‌పై..!

లోయర్ ఆర్డర్‌లో దూకుడుగా ఆడే ఆటగాడిగా పేరున్న రింకూ సింగ్‌ను కూడా జింబాబ్వేతో మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించే అవకాశముంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో రింకూ కేవలం 24 పరుగులు మాత్రమే చేశాడు. దక్షిణాఫ్రికాతో కీలక మ్యాచ్‌లో ఖాతా కూడా తెరవలేకపోయాడు.

పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో చేసిన అజేయ 11 పరుగుల ఇన్నింగ్స్‌ను తప్పితే, మిగతా టోర్నమెంట్ అంతా రింకూ బ్యాట్ నిశ్శబ్దంగానే ఉంది. అందుకే రింకూ స్థానంలో ఉప కెప్టెన్ అక్షర్ పటేల్‌ను తిరిగి జట్టులోకి తీసుకురావాలని సూర్యా నిర్ణయించవచ్చని సమాచారం. ఇక మొహమ్మద్ సిరాజ్ కూడా తదుపరి మ్యాచ్ ఆడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. సిరాజ్ స్థానంలో అర్షదీప్ సింగ్ – జస్ప్రీత్ బుమ్రా పేస్ జోడీపై సూర్యా నమ్మకం పెట్టుకోవచ్చని అంచనా.

సెమీఫైనల్ దారి మరింత కఠినం..

భారత్‌కు సెమీఫైనల్ చేరే మార్గం ఇప్పటికే కఠినంగా మారింది. సూపర్-8 తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ 76 పరుగుల భారీ ఓటమిని ఎదుర్కొంది. మరోవైపు వెస్టిండీస్ జింబాబ్వేపై 107 పరుగుల భారీ విజయం సాధించడంతో భారత్ పరిస్థితి మరింత కఠినమైంది.

ప్రస్తుతం భారత్ నెట్ రన్ రేట్ మైనస్‌లో ఉంది. వెస్టిండీస్ మాత్రం భారీ విజయంతో మంచి రన్‌రేట్‌ను సాధించింది. అందుకే భారత్ సెమీఫైనల్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో పెద్ద తేడాతో గెలవాల్సిన అవసరం ఉంది.

టీమిండియా స్క్వాడ్..

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ (ఉప కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us