SL vs AUS: కొత్త పాత్రలో శ్రీలంక దిగ్గజ బౌలర్.. మరోసారి జాతీయ జట్టుతో జతకట్టేందుకు రెడీ..!

|

Jan 27, 2022 | 9:02 AM

Lasith Malinga: రాబోయే ఆస్ట్రేలియా పర్యటన కోసం శ్రీలంక జట్టుకు స్పెషలిస్ట్ బౌలింగ్ కోచ్‌గా లసిత్ మలింగ నియమితులయ్యారు.

SL vs AUS: కొత్త పాత్రలో శ్రీలంక దిగ్గజ బౌలర్.. మరోసారి జాతీయ జట్టుతో జతకట్టేందుకు రెడీ..!
Sl Vs Aus Lasith Malinga
Follow us on

Lasith Malinga: వెటరన్ పేసర్ లసిత్ మలింగ(Lasith Malinga) రాబోయే ఆస్ట్రేలియా పర్యటన కోసం శ్రీలంక(Sri Lanka) సీనియర్ పురుషుల జాతీయ జట్టుకు స్పెషలిస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది. “మలింగ కొద్ది కాలం పాటు స్పెషలిస్ట్ కోచ్‌గా నియమించాం. శ్రీలంక బౌలర్లకు సహాయం చేయడంతో పాటు వ్యూహాత్మక ప్రణాళికలను రూపొందించడంలో వారికి సహాయం చేస్తాడు” అని శ్రీలంక క్రికెట్ (Sri Lanka Cricket) పేర్కొంది.

“ఈ సిరీస్‌లో, ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో మలింగ విస్తృతమైన అనుభవం జట్టుకు గొప్పగా సహాయపడుతుందని శ్రీలంక బోర్డు నమ్మకంగా ఉంది” అని సెలక్టర్లు పేర్కొన్నారు. శ్రీలంక ఫిబ్రవరి 11 నుంచి ఆస్ట్రేలియాలో ఐదు టీ20 మ్యాచుల్లు ఆడనుంది. మరోవైపు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే శ్రీలంక జట్టుకు తాత్కాలిక కోచ్‌గా రుమేశ్ రత్నాయకే నియమితులయ్యారు.

గతేడాది రిటైర్మెంట్..
గత ఏడాది సెప్టెంబర్‌లో లసిత్ మలింగ అన్ని రకాల క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. మలింగ 2020లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అతను తన చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ని 6 మార్చి 2020న వెస్టిండీస్‌తో ఆడాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తరఫున మలింగ ఆడాడు. ఈ లీగ్‌లో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 122 మ్యాచ్‌ల్లో 170 వికెట్లు తీశాడు. 13 పరుగులకే ఐదు వికెట్లు తీసి తన అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

Also Read: IND vs WI: రవి బిష్ణోయ్ ఎంట్రీ నుంచి అశ్విన్‌పై వేటు వరకు.. టీమిండియా స్వ్కాడ్‌లో 5 భారీ మార్పులు

Pushpa: ఇది వేరే లెవెల్.. శ్రీవల్లి పాటకు నాన్నమ్మతో కలిసి స్టెప్పులేసిన టీమిండియా ఆల్ రౌండర్..