Sikandar Raza Auction Price: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 కోసం మినీ వేలం నేడు కొచ్చిలో జరిగింది. ఫ్రాంచైజీలు మిగిలిన స్థానాల కోసం ఈ వేలంలో పాల్గొని, పోటీపడి మరీ ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. కాగా, ఈ వేలంలో జింబాబ్వే స్టార్ ఆల్ రౌండర్ సికందర్ రజాపై అన్ని జట్లు ఆసక్తి చూపించాయి. అయితే మినీ వేలంలో పంజాబ్ సూపర్ కింగ్స్ ఈ జింబాబ్వే స్టార్ ఆల్ రౌండర్ ను అర కోటికే దక్కించుకుంది. కాగా జింబాబ్వే తరపున సికందర్ రజా ఇప్పటివరకు 17 టెస్టులు, 123 వన్డేలు, 63 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో వరుసగా 1187, 3656, 1185 పరుగులు చేశాడు. జింబాబ్వే తరపున టెస్టుల్లో 1 సెంచరీ, వన్డేల్లో 6 సెంచరీలు చేశాడు. ఇటీవల ఆస్ట్రేలియా వేదికగా ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2022లో సికిందర్ రాజా దుమ్మురేపాడు. మొత్తం 8 ఇన్నింగ్స్‌ల్లో 27.37 సగటుతో 219 పరుగులు చేసిన సికిందర్ రాజా.. 11 సిక్స్‌లు బాదాడు. 15.60 యావరేజ్‌తో 10 వికెట్లు పడగొట్టాడు. జింబాబ్వే సూపర్ -12 స్టేజ్ కు చేరడంతో పాటు పాకిస్థాన్‌ను ఓడించడంలో సికిందర్ రాజా కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రతిభతోనే ఐపీఎల్ 2023 మినీ వేలంలో పాల్గొన్నాడు. అరకోటితో పంజాబ్ జట్టు సొంతమయ్యాడు.
కాగా ఇప్పటి వరకు ఐపీఎల్ ఆడే అవకాశం ఈ జింబాబ్వే ఆల్ రౌండర్ కు దక్కలేదు. దీంతో మొదటిసారి ఈ క్యాష్ రిచ్ లీగ్ లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. అటు బ్యాట్ తోనూ, అవసరమైతే బంతితో అద్భుతాలు సృష్టించే ఈ ఆల్ రౌండర్ ఐపీఎల్ లో మరెన్ని అద్భుతాలు సృష్టిస్తాడో చూడాలి.
ఐపీఎల్ లైవ్ యాక్షన్ లైవ్ ఇక్కడ వీక్షించండి