Video: రూథర్‌ఫోర్డ్ ఔట్‌పై రచ్చ.. అంపైర్లతో విండీస్ బ్యాటర్ వాగ్వాదం.. అసలేమైందంటే..?

Sherfane Rutherford Wicket Controversy: భారత్, వెస్టిండీస్ మూడో వన్డేలో 30వ ఓవర్ ముగిసే సమయానికి షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ వికెట్ తీవ్ర చర్చకు దారితీసింది. నమన్ ధీర్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ క్యాచ్ పట్టిన తర్వాత రివ్యూ కోరిన రూథర్‌ఫోర్డ్.. నిర్ణయం తనకు అనుకూలంగా లేకపోవడంతో అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు.

Video: రూథర్‌ఫోర్డ్ ఔట్‌పై రచ్చ.. అంపైర్లతో విండీస్ బ్యాటర్ వాగ్వాదం.. అసలేమైందంటే..?
Sherfane Rutherford Wicket Controversy

Updated on: Oct 04, 2026 | 1:48 PM

Sherfane Rutherford Wicket Controversy: భారత్, వెస్టిండీస్ మధ్య ముల్లన్‌పూర్‌లో జరుగుతున్న మూడో వన్డేలో షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ వికెట్ వివాదానికి కేంద్రంగా మారింది. వెస్టిండీస్ ఛేజింగ్‌లో 30వ ఓవర్ ముగిసే సమయానికి ఈ ఘటన జరిగింది. నమన్ ధీర్ బౌలింగ్‌లో రూథర్‌ఫోర్డ్ క్యాచ్ ఔట్‌గా ప్రకటించబడ్డాడు. ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని రివ్యూ కోరినా.. థర్డ్ అంపైర్ కూడా ఔట్‌గానే నిర్ధారించాడు.

నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రూథర్‌ఫోర్డ్ 25 బంతుల్లో 24 పరుగులు చేశాడు. రెండు బౌండరీలు సాధించాడు. నమన్ ధీర్ వేసిన బంతిని ఆడే ప్రయత్నంలో ఎడ్జ్ తీసుకున్నట్లు భావించిన ఫీల్డింగ్ జట్టు అప్పీల్ చేసింది. బంతి వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ (KL Rahul) చేతుల్లోకి వెళ్లడంతో క్యాచ్‌అవుట్ నిర్ణయం వచ్చింది. రూథర్‌ఫోర్డ్ మాత్రం వెంటనే రివ్యూ కోరాడు.

ఇవి కూడా చదవండి

ఎక్కువమంది చదివినది: 351 పరుగులు చేసినా ఓటమి.. ఆ నిర్ణయమే టీమిండియా కొంపముంచిదా..?

టెలివిజన్ రీప్లేలో స్పైక్ కనిపించింది. కానీ బంతి బ్యాట్‌కు తగిలిందా, లేక వెనుక కాలికి తాకిందా అన్నది స్పష్టంగా కనిపించలేదు. రూథర్‌ఫోర్డ్ బ్యాట్ ప్యాడ్‌ను తాకడం వల్ల కూడా ఆ శబ్దం వచ్చి ఉండొచ్చనే సందేహం కనిపించింది. పూర్తి స్పష్టత లేకపోయినా థర్డ్ అంపైర్ బ్యాట్‌కు ఎడ్జ్ తగిలిందనే నిర్ణయంతో ఔట్ ఇచ్చాడు.

వికెట్ పడటంతో భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. రూథర్‌ఫోర్డ్ మాత్రం నిర్ణయంతో సంతృప్తి చెందలేదు. మైదానంలోనే నిలబడి అంపైర్లతో వాదించాడు. రివ్యూ ఫలితం కూడా తనకు అనుకూలంగా రాకపోవడంతో అతడు అక్కడే తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశాడు. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ (Shai Hope) జోక్యం చేసుకుని అతడిని శాంతింపజేశాడు. ఆ తర్వాత రూథర్‌ఫోర్డ్ పెవిలియన్‌కు వెళ్లాడు.

ఎక్కువమంది చదివినది: ఈ జట్టుతో వన్డే వరల్డ్ కప్‌నకు పోతే పరువుపోద్ది.. ఈ ఇద్దరిని తప్పించి, ఆ ఇద్దర్ని పిలవండి..!

ఈ వికెట్ పడిన సమయానికి వెస్టిండీస్ స్కోరు 206/2. రూథర్‌ఫోర్డ్, హోప్ కలిసి మూడో వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత్ నిర్దేశించిన 352 పరుగుల లక్ష్య ఛేదనలో ఈ భాగస్వామ్యం విండీస్‌కు ఊపునిచ్చింది. రూథర్‌ఫోర్డ్ ఔట్ కావడం వారి వేగాన్ని కొంత ప్రభావితం చేసిన కీలక ఘట్టంగా మారింది.

అంపైర్‌తో రూథర్‌ఫోర్డ్ రచ్చ..! 

హోప్ మాత్రం ఆ తర్వాత కూడా దూకుడుగా ఆడాడు. సెంచరీ పూర్తి చేసి వెస్టిండీస్ ఆశలను కొనసాగించాడు. కీమో పాల్‌తో కలిసి మరో 50 పరుగుల భాగస్వామ్యాన్ని కూడా నమోదు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us