AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LSG Stake Sale: ఐపీఎల్ వేలానికి ముందే గోయెంకా మైండ్ గేమ్.. అమ్మకానికి లక్నో టీమ్

LSG Stake Sale: ఐపీఎల్ లీగ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్‌పిఎస్‌జి గ్రూప్ తమ ఫ్రాంచైజీలోని 15 నుంచి 20 శాతం మైనారిటీ వాటాలను విక్రయించేందుకు ప్రణాళికలు వేస్తోంది. మార్కెట్లో టీమ్ విలువను 2 బిలియన్ డాలర్లుగా నిర్ణయించారు. వాటాల విక్రయం జరిగినా ప్రధాన కంట్రోల్ సంజీవ్ గోయెంకా చేతిలోనే ఉంటుంది.

LSG Stake Sale: ఐపీఎల్ వేలానికి ముందే గోయెంకా మైండ్ గేమ్.. అమ్మకానికి లక్నో టీమ్
Lsg Stake Sale (1)
Rakesh
|

Updated on: Oct 08, 2026 | 10:11 AM

Share

LSG Stake Sale: ఐపీఎల్ కొత్త సీజన్ వేలం పాటలు రాకముందే లీగ్‌లో రూ.వేల కోట్ల వ్యాపార హల్‌చల్ మొదలైంది. సంజీవ్ గోయెంకా నేతృత్వంలోని ఆర్‌పిఎస్‌జి గ్రూప్ తమ లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీలో మైనారిటీ వాటాను అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ మినీ, మెగా ఆక్షన్లు ప్రారంభం కాకముందే లీగ్‌లో భారీ బిజినెస్ హల్‌చల్ మొదలైంది. సంజీవ్ గోయెంకా నేతృత్వంలోని ఆర్‌పిఎస్‌జి గ్రూప్ తమ లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌లోని కొన్ని వాటాలను విక్రయించడానికి సిద్ధమవుతోంది. క్రీడా ప్రపంచంలో ఈ వార్త ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఫ్రాంచైజీకి ఉన్న మార్కెట్ విలువను మరింత పెంచుకునే దిశగా యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.

వేల కోట్ల రేంజ్‌లో లక్నో టీమ్ వాల్యుయేషన్

ఆర్‌పిఎస్‌జి గ్రూప్ లక్నో ఫ్రాంచైజీ విలువను దాదాపు 1.5 బిలియన్ డాలర్ల నుంచి 2 బిలియన్ డాలర్లుగా లెక్కగడుతోంది. అంటే మన రూపాయిల్లో సుమారు 12 వేల కోట్ల నుంచి 16 వేల కోట్ల పైమాటే. ఈ లెక్కన 15 నుంచి 20 శాతం వాటాను అమ్మడం ద్వారా గ్రూప్‌కు సుమారు 225 మిలియన్ల నుంచి 400 మిలియన్ డాలర్ల వరకు నిధులు సమకూరే అవకాశం ఉంది. 2021 నవంబర్‌లో ఈ ఫ్రాంచైజీని ఆర్‌పిఎస్‌జి రూ.7,090 కోట్లకు దక్కించుకోగా, ఇప్పుడు దాని విలువ రెట్టింపు కంటే ఎక్కువగా పెరగడం విశేషం.

సంజీవ్ గోయెంకా చేతిలోనే కంట్రోల్

వాటాల విక్రయం జరిగినంత మాత్రాన లక్నో జట్టు పూర్తి యాజమాన్య హక్కులు మారవని స్పష్టమవుతోంది. కేవలం మైనారిటీ భాగస్వామ్యం మాత్రమే కొత్త ఇన్వెస్టర్లకు లభిస్తుంది. ఫ్రాంచైజీ నిర్వహణ, కీలక నిర్ణయాధికారం అంతా సంజీవ్ గోయెంకా, ఆర్‌పిఎస్‌జి గ్రూప్ వద్దే భద్రంగా ఉంటాయి. కొత్తగా వచ్చే భాగస్వాములు కేవలం పెట్టుబడిదారులుగా మాత్రమే కొనసాగుతారు.

ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ దారిలోనే లక్నో

ఇటీవలే ఐపీఎల్ లీగ్‌లో పలు ఫ్రాంచైజీల వాటాలు భారీ ధరలకు అమ్ముడయ్యాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విలువ సుమారు 1.78 బిలియన్ డాలర్లుగా తేలగా, రాజస్థాన్ రాయల్స్ విలువ 1.65 బిలియన్ డాలర్ల వద్ద డీల్ కుదిరింది. ఈ వరుస పరిణామాలను గమనించిన గోయెంకా, తమ టీమ్ విలువను కూడా మార్కెట్లో సరైన సమయంలో విక్రయించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

డీల్ ఫైనల్ కావడానికి టైమ్ పడుతుంది

ఈ బిజినెస్ వ్యవహారాన్ని నడిపించడానికి ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ గోల్డ్‌మ్యాన్ శాక్స్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అయితే తుది ప్రకటన రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ సుదీర్ఘమైన ప్రక్రియ పూర్తయితే ఆర్‌పిఎస్‌జి గ్రూప్‌కు ఐపీఎల్ ద్వారా భారీ మొత్తంలో లాభాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో సెక్షన్ 168 కలకలం! ఆ నిర్మాణాలకు చెక్
హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో సెక్షన్ 168 కలకలం! ఆ నిర్మాణాలకు చెక్
యానాం-నరసాపురం మధ్య తీరాన్ని దాడిన అర్నబ్ తుఫాను
యానాం-నరసాపురం మధ్య తీరాన్ని దాడిన అర్నబ్ తుఫాను
రాజమౌళి సినిమాల్లో ఆ సినిమా నాకు అస్సలు నచ్చదు..
రాజమౌళి సినిమాల్లో ఆ సినిమా నాకు అస్సలు నచ్చదు..
అక్టోబర్ 29 నుంచి శబరిమల దర్శనం బుకింగ్‌.. రోజుకు 60 వేల మందికి..
అక్టోబర్ 29 నుంచి శబరిమల దర్శనం బుకింగ్‌.. రోజుకు 60 వేల మందికి..
ఆ ఇద్దరిని ఆపడం ఎవరి తరం కాదు.. ఓటమిపై కివీస్ కెప్టెన్ ఏమన్నాడంటే
ఆ ఇద్దరిని ఆపడం ఎవరి తరం కాదు.. ఓటమిపై కివీస్ కెప్టెన్ ఏమన్నాడంటే
ఫ్రిజ్‌ను అప్పుడప్పుడు ఆఫ్‌ చేస్తున్నారా? ఏమవుతుందో తెలుసా?
ఫ్రిజ్‌ను అప్పుడప్పుడు ఆఫ్‌ చేస్తున్నారా? ఏమవుతుందో తెలుసా?
అలా అయితే 30- 40 సినిమాలు చేసేదాన్ని.. ఆ రూమర్లపై శ్రీనిధి శెట్టి
అలా అయితే 30- 40 సినిమాలు చేసేదాన్ని.. ఆ రూమర్లపై శ్రీనిధి శెట్టి
ఐఫోన్ తయారీపై విమర్శలకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కౌంటర్
ఐఫోన్ తయారీపై విమర్శలకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కౌంటర్
నేడు కోచి వేదికగా డబ్ల్యూపీఎల్ ఆక్షన్
నేడు కోచి వేదికగా డబ్ల్యూపీఎల్ ఆక్షన్
అట్లతద్ది పండుగ నేడు.. 11 అట్ల నైవేద్యం ఎందుకు సమర్పిస్తారంటే..
అట్లతద్ది పండుగ నేడు.. 11 అట్ల నైవేద్యం ఎందుకు సమర్పిస్తారంటే..