పొట్టి ప్రపంచకప్‌లో 2 సెంచరీలు.. కట్‌చేస్తే.. 8 ఏళ్ల తర్వాత వన్డే అరంగేట్రం.. ఎవరంటే?

Sahibzada Farhan ODI Debut:టీ20 ఫార్మాట్‌లో ఇప్పటికే తన ప్రతిభను నిరూపించుకున్న పాకిస్తాన్ బ్యాటర్ సాహిబ్జాదా ఫర్హాన్ ఇప్పుడు మరో కీలక అవకాశాన్ని అందుకోబోతున్నాడు. అంతర్జాతీయ టీ20లో 46 మ్యాచ్‌ల అనుభవం ఉన్న ఈ ఆటగాడు, ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి వన్డే క్రికెట్‌లో అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతున్నాడు.

పొట్టి ప్రపంచకప్‌లో 2 సెంచరీలు.. కట్‌చేస్తే.. 8 ఏళ్ల తర్వాత వన్డే అరంగేట్రం.. ఎవరంటే?
Ind Vs Pak Key Players

Updated on: Mar 11, 2026 | 12:23 PM

Pakistan vs Bangladesh ODI series: సాహిబ్జాదా ఫర్హాన్ (Sahibzada Farhan) పాకిస్తాన్ క్రికెట్‌లో ఫ్యూచర్ స్టార్ గా గుర్తింపు పొందాడు. 2018లో ఆస్ట్రేలియాతో హరారేలో జరిగిన మ్యాచ్ ద్వారా టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఫర్హాన్, ఇప్పటి వరకు 46 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో అతను మొత్తం 1305 పరుగులు చేసి తన బ్యాటింగ్ ప్రతిభను చూపించాడు. అతని సగటు 30.34 కాగా స్ట్రైక్ రేట్ 136.64గా ఉంది. ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత అతనికి వన్డే క్రికెట్‌లో తొలి మ్యాచ్ ఆడే అవకాశం లభించనుంది.

బంగ్లాదేశ్ సిరీస్‌లో అరంగేట్రం..

పాకిస్తాన్ (Pakistan national cricket team) టీ20 వరల్డ్ కప్ 2026 అనంతరం ద్వైపాక్షిక సిరీస్‌లకు సిద్ధమవుతోంది. మార్చి 11 నుంచి బంగ్లాదేశ్ (Bangladesh national cricket team) తో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ మ్యాచ్‌లు ఢాకాలోని షేర్ ఏ బంగ్లా నేషనల్ స్టేడియం (Sher-e-Bangla National Cricket Stadium లో జరగనున్నాయి. పాకిస్తాన్ వన్డే కెప్టెన్ షాహిన్ షా అఫ్రిది (Shaheen Shah Afridi) మ్యాచ్‌కు ముందు మాట్లాడుతూ ఫర్హాన్ వన్డేలో అరంగేట్రం చేయనున్నట్లు వెల్లడించాడు.

ఎక్కువమంది చదివినది: పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన మిస్టరీ స్పిన్నర్.. దెబ్బ అదుర్స్ కదూ..!

ఇవి కూడా చదవండి

టీ20 వరల్డ్ కప్‌లో మెరిసిన ఫర్హాన్..

ఫర్హాన్ ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026లో అద్భుత ప్రదర్శన చేశాడు. టోర్నమెంట్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన అతను 383 పరుగులు సాధించాడు. ఈ టోర్నమెంట్‌లో అతని బ్యాటింగ్ ప్రత్యేకంగా నిలిచింది. ముఖ్యంగా రెండు సెంచరీలు నమోదు చేసి పాకిస్తాన్ జట్టుకు కీలకంగా నిలిచాడు. అతని దూకుడు బ్యాటింగ్ వల్లే జట్టుకు మంచి ఆరంభాలు లభించాయి.

మరో ఇద్దరు ఆటగాళ్లకు కూడా అరంగేట్రం..

ఈ సిరీస్‌లో ఫర్హాన్‌తో పాటు మరో ఇద్దరు యువ ఆటగాళ్లు కూడా అరంగేట్రం చేయనున్నారు. మజ్ సదాఖత్ (Maj Sadaqat) ఓపెనర్‌గా ఫర్హాన్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. అలాగే షమీల్ హుస్సెన్ (Shameel Hussain) మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు.

ఎక్కువమంది చదివినది: పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన మిస్టరీ స్పిన్నర్.. దెబ్బ అదుర్స్ కదూ..!

సదాఖత్ గతంలో రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో అద్భుతంగా ఆడుతూ ఐదు మ్యాచ్‌ల్లో 258 పరుగులు చేశాడు. మరోవైపు షమీల్ హుస్సైన్ డొమెస్టిక్ క్రికెట్‌లో మంచి ప్రదర్శన చేసి జాతీయ జట్టులో చోటు సంపాదించాడు.

పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇప్పుడు యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడంపై దృష్టి పెట్టింది. టీ20లో ఇప్పటికే ప్రతిభ చూపించిన సాహిబ్జాదా ఫర్హాన్ వన్డేలో ఎలా ఆడతాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్ అతని కెరీర్‌లో కీలక మలుపుగా మారే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us