Sri Lanka Tour: శ్రీలంక టూర్‌కు అంతా సిద్ధం.. హెడ్‌కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌!?

|

May 11, 2021 | 10:39 PM

India tour of Sri Lanka: శ్రీలంక టూర్ కోసం అంతా సిద్ధం చేస్తోంది బీసీసీఐ. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌, ఇంగ్లండ్‌ పర్యటన లో భాగంగా బీసీసీఐ తుది జట్టును కొన్ని రోజుల కింద ప్రకటించిన విషయం తెలిసిందే. వీటితో పాటుగా శ్రీలంక పర్యటన కోసం...

Sri Lanka Tour: శ్రీలంక టూర్‌కు అంతా సిద్ధం.. హెడ్‌కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌!?
India Tour Of Sri Lanka
Follow us on

శ్రీలంక టూర్ కోసం అంతా సిద్ధం చేస్తోంది బీసీసీఐ. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌, ఇంగ్లండ్‌ పర్యటన లో భాగంగా బీసీసీఐ తుది జట్టును కొన్ని రోజుల కింద ప్రకటించిన విషయం తెలిసిందే. వీటితో పాటుగా శ్రీలంక పర్యటన కోసం మరో టీంను బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ప్రకటించారు. భారత జట్టు ఇంగ్లండ్‌ పర్యటనలో ఉండగానే మరోక వన్డే జట్టును శ్రీలంక పర్యటనకు పంపనుంది. అయితే ఈ శ్రీలంక టూర్‌లో ఎవరు వెళ్తారు అనే అంశంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు బీసీసీఐ. సభ్యులతోపాటు హెడ్ కోచ్ ఎవరనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారుతోంది. బీసీసీఐ వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం టీమిండియా లెజెండ్ రాహుల్ ద్రవిడ్ ఉండే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.

న్యూజిలాండ్‌తో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ ముగిసిన నెల తరువాత ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ మొదలు కానుంది.  అయితే ఇదే సమయంలోనే టీమిండియా శ్రీలంక టూర్ చేయనుంది. ఈ నేపథ్యంలో  టీమిండిాయ వన్డే జట్టుకు కోచ్‌ రవిశాస్త్రి అందుబాటులో ఉండడు. దీంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీలంకతో జరిగే మ్యాచులకు రాహుల్‌ ద్రవిడ్‌ను హెడ్‌ కోచ్‌గా పంపాలని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ద్రవిడ్‌తోపాటు పాటు నేషనల్‌ క్రికెట్‌ అకాడమీకి సంబంధించిన సిబ్బంది కూడా శ్రీలంక టూర్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

కోహ్లీ సేన ఈ నెల 29న ఇంగ్లండ్‌కు..

ఇంగ్లండ్‌లో వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్, ఐదు టెస్ట్‌లు సిరీస్ కోసం కోహ్లీ సేన ఈ నెల 29న ఇంగ్లండ్‌కు పయనమవనుంది. అదే సమయంలో శ్రీలంకతో 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లను టీమిండియా ఆడాల్సి ఉంది. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక కాని ఆటగాళ్లు శ్రీలంక టూర్‌కు వెళ్లనున్నారు.

శ్రీలంక టూర్…

శ్రీలంకలో భారత జట్టు పరిమిత ఓవర్ల సిరీస్‌లకు సంబంధించి మ్యాచ్‌ల తేదీలు ఖరారయ్యాయి. ఈ టూర్‌లో భాగంగా భారత్, లంక మధ్య జూలై 13, 16, 19 తేదీల్లో వన్డేలు… జూలై 22, 24, 27 తేదీల్లో టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి.

ఇవి కూడా చదవండి : Telangana Lockdown: తెలంగాణ‌లో క‌ఠినంగా లాక్ డౌన్.. ప్ర‌జ‌ల‌కు కీల‌క సూచ‌న‌లు చేసిన పోలీస్ శాఖ‌

Police Case on Babu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై గుంటూరు జిల్లాలో కేసు నమోదు.. కారణమేంటంటే..