Virat Kohli: విరాట్ కోహ్లీ పబ్‌పై పోలీసుల రైడ్.. కేసు నమోదు.. కారణమిదే

|

Jul 09, 2024 | 10:53 AM

టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన పబ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. జూన్ 6వ తేదీన రాత్రి, కబ్బన్ పార్క్ పోలీసులు రెస్టారెంట్లు, బార్‌లు, పబ్బులపై స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. ప్రభుత్వం విధించిన నిబంధనలను తుంగలో తొక్కి...

Virat Kohli: విరాట్ కోహ్లీ పబ్‌పై పోలీసుల రైడ్.. కేసు నమోదు.. కారణమిదే
Virat Kohli
Follow us on

టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన పబ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. బెంగళూరులోని కస్తూరాబా రోడ్డులో కోహ్లీకి చెందిన వన్8 కమ్యూన్ పబ్ నిర్ణీత సమయానికి మించి తెరిచి ఉండటంతో బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూన్ 6వ తేదీన రాత్రి, కబ్బన్ పార్క్ పోలీసులు రెస్టారెంట్లు, బార్‌లు, పబ్బులపై స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. ప్రభుత్వం విధించిన నిబంధనలను తుంగలో తొక్కి రాత్రి వరకు తెరచి ఉన్న పబ్బులు, క్లబ్ లపై కేసులు నమోదు చేశారు. ఈ సమయంలో కస్తూరాబా రోడ్డులోని వన్ 8 కమ్యూన్, చర్చి స్ట్రీట్‌లోని ఎంపైర్ రెస్టారెంట్, బ్రిగేడ్ రోడ్డులోని పాంజియో బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులపై తెల్లవారుజామున 1.20 గంటల వరకు పబ్ తెరిచి ఉంచారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు. రాత్రి గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు పబ్ తెరిచి ఉన్నట్టు సమాచారం వచ్చింది. దీతో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా.. పబ్‌లో కస్టమర్లు ఉన్నారు. నిబంధనలను ఉల్లంఘించి నిర్ణీత సమయానికి మించి పబ్ తెరిచారంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఈ విషయమై బెంగళూరు సెంట్రల్ డివిజన్ డీసీపీ శేఖర్ హెచ్.టి. మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ధేశించిన వ్యవధిని ఉల్లంఘించి కస్టమర్లకు అనుమతించిన పబులు, రెస్టారెంట్లపై కేసు నమోదు చేశామన్నారు. వన్ 8 కమ్యూన్ మాత్రమే కాకుండా సెంట్రల్ డివిజన్ పరిధిలో కాలపరిమితి దాటి వ్యాపారం చేస్తున్న మరికొన్ని రెస్టారెంట్లు, పబ్ లపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మరోవైపు కోహ్లీ ప్రస్తుతం లండన్ లో ఉన్నాడు. అనుష్క శర్మ, వామికా, అకాయ్ గత కొన్ని రోజులుగా అక్కడ ఉండడంతో టీ20 ప్రపంచ కప్ ముగిసిన వెంటనే లండన్ కు వెళ్లిపోయాడు కింగ్ కోహ్లీ.

ఇవి కూడా చదవండి

 

h3>ముంబై విమానాశ్రయంలో కింగ్ కోహ్లీ..


టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 76 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్‌తోనే కోహ్లి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు. అయితే భారత్ ప్రపంచకప్ గెలిచిన వెంటనే టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..