WTC Final Venue: వరుసగా 3 WTC ఫైనల్స్‌కు వేదికలు ఫిక్స్ చేసిన ఐసీసీ.. ఎక్కడంటే..?

WTC Final 2027: టెస్ట్ క్రికెట్‌కు పట్టం కట్టే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌పై కీలక ప్రకటన వెలువడింది. 2027, 2029, 2031లో జరగనున్న వరుస మూడు టైటిల్ పోరులకు ఆతిథ్యం ఎవరిదనే దానిపై ఐసీసీ దాదాపు స్పష్టత ఇచ్చింది. భారత్ ఆశిస్తున్నట్టుగా ఫైనల్ గడ్డపైకి రావడం లేదు.

WTC Final Venue: వరుసగా 3 WTC ఫైనల్స్‌కు వేదికలు ఫిక్స్ చేసిన ఐసీసీ.. ఎక్కడంటే..?
Wtc Final

Updated on: Nov 14, 2026 | 1:40 PM

WTC Final Venue: టెస్ట్ క్రికెట్‌కు ప్రాణం పోయడానికి 2019లో అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రారంభించిన ప్రయోగమే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్. హోమ్ అండ్ అవే సిరీస్‌లతో ఒక చక్రం సాగి, చివర్లో టాప్-2లో నిలిచిన జట్ల మధ్య ఫైనల్. ఇప్పటివరకు మూడు చక్రాలు పూర్తయ్యాయి. తొలి టైటిల్ న్యూజిలాండ్, రెండోది ఆస్ట్రేలియా, మూడోది దక్షిణాఫ్రికా గెలిచాయి. విశేషమేమిటంటే, ఇప్పటివరకు జరిగిన మూడు ఫైనల్స్ కూడా ఇంగ్లండ్ గడ్డపైనే జరిగాయి. కనీసం ఈసారైనా ఫైనల్ భారత్‌లో జరుగుతుందని అభిమానులు ఆశించారు. కానీ ఆ ఆశలకు తెరపడినట్లే కనిపిస్తోంది.

క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, తదుపరి మూడు WTC ఫైనల్స్ కూడా ఇంగ్లండ్‌లోనే జరగనున్నాయి. 2027 WTC ఫైనల్ లండన్‌లోని ది ఓవల్ స్టేడియంలో జరుగుతుందని ఇప్పటికే ప్రకటించారు. ఇక 2029, 2031 ఫైనల్స్ కూడా ఇంగ్లండ్‌కే దక్కనున్నాయి. ఏ మైదానాల్లో నిర్వహిస్తారనేది ఇంకా ఖరారు కాలేదు. బాలిలో జరగనున్న ఐసీసీ సమావేశంలో 2027-29, 2029-31 చక్రాల ఫైనల్స్‌కు ఇంగ్లండ్ ఆతిథ్యంపై తుది ముద్ర పడనుందని తెలుస్తోంది.

ఎక్కువమంది చదివినది: IND vs NZ 5th ODI: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. హమ్మయ్య చివరి వన్డే ఇక మనదే.. ఆ దరిద్రం పోయిందిగా..!

అంటే ఇంగ్లండ్‌కు వరుసగా బల్లె బల్లే అనే చెప్పాలి. వాతావరణం, డ్యూక్ బంతి, తటస్థ వేదిక అనే కారణాలతో ఐసీసీ మళ్లీ ఇంగ్లండ్‌వైపే మొగ్గు చూపుతోంది. భారత్ వంటి స్పిన్‌కు అనుకూల దేశానికి ఫైనల్ ఆతిథ్యం దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది.

2027 రేసులో ఏడు జట్లు.. భారత్ ఎక్కడ?

ప్రస్తుత 2025-27 చక్రంలో ఫైనల్ రేసు రసకందాయంలో పడింది. వెస్టిండీస్, పాకిస్తాన్ దాదాపుగా నిష్క్రమించగా, భారత్‌తో సహా 7 జట్లు పోటీలో ఉన్నాయి.

ఒక దశలో ఆస్ట్రేలియా దూసుకుపోయింది. కానీ బంగ్లాదేశ్ చేతిలో టెస్టు ఓడి, ఆ తర్వాత దక్షిణాఫ్రికా చేతిలో వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమితో వెనకబడింది. దీంతో న్యూజిలాండ్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. టెంబా బవుమా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉంది.

ఎక్కువమంది చదివినది: Year Ender 2026: 11 సిక్సర్లు, 9 ఫోర్లు.. 30 బంతుల్లో విధ్వంసకర సెంచరీ.. రోహిత్ రికార్డును చెరిపేసిన అభిషేక్ శర్మ..!

మూడో స్థానంలో ఆస్ట్రేలియా, నాలుగో స్థానంలో భారత్ ఉన్నాయి. బంగ్లాదేశ్ ఐదో స్థానంలో ఉండగా, ఇంగ్లండ్ ఆరో స్థానం, శ్రీలంక ఏడో స్థానంలో ఉన్నాయి.

WTC 2025-27 పాయింట్ల పట్టిక:

న్యూజిలాండ్ – 6 మ్యాచ్‌లు, 4 గెలుపు, PCT 72.22%

దక్షిణాఫ్రికా – 7 మ్యాచ్‌లు, 5 గెలుపు, PCT 71.43%

ఆస్ట్రేలియా – 13 మ్యాచ్‌లు, 9 గెలుపు, PCT 69.23%

భారత్ – 11 మ్యాచ్‌లు, 5 గెలుపు, 4 ఓటమి, 2 డ్రా, PCT 51.52%

బంగ్లాదేశ్ – 8 మ్యాచ్‌లు, 3 గెలుపు, PCT 45.83%

ఇంగ్లండ్ – 16 మ్యాచ్‌లు, 7 గెలుపు, PCT 38.54%

శ్రీలంక – 7 మ్యాచ్‌లు, 1 గెలుపు, PCT 33.33%

వెస్టిండీస్ – PCT 27.38%

పాకిస్తాన్ – PCT 7.50%

భారత్ ఫైనల్ చేరాలంటే ఇక ప్రతి సిరీస్ కీలకమే. సొంతగడ్డపై ఫైనల్ ఆడాలన్న కల నెరవేరకపోయినా, ఓవల్ గడ్డపై త్రివర్ణం ఎగరేయాలంటే ఇక్కడి నుంచి విజయ పరంపర తప్పనిసరి. ఇంగ్లండ్ వేదికలు భారత్‌కు అచ్చిరాని చరిత్రను తిరగరాయగలరా? అన్నదే ఇప్పుడు కోట్లాది అభిమానుల ప్రశ్న.

మరిన్ని క్రీడ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us