భువీలా షమీ కూడా టీమ్‌ఇండియాలోకి రీఎంట్రీ..? కోచ్ కీలక వ్యాఖ్యలు..!

Team India Star Pacer Mohammed Shami: టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ నాలుగేళ్ల తర్వాత టీమ్‌ఇండియాలోకి తిరిగి రావడంతో మహ్మద్ షమీ రీఎంట్రీపై ఆశలు పెరిగాయి. బెంగాల్ కోచ్ లక్ష్మీరతన్ శుక్లా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈ చర్చకు మరింత ఊపునిచ్చాయి.

భువీలా షమీ కూడా టీమ్‌ఇండియాలోకి రీఎంట్రీ..? కోచ్ కీలక వ్యాఖ్యలు..!
Mohammed Shami

Updated on: Oct 07, 2026 | 9:53 PM

Mohammed Shami: టీమ్‌ఇండియాలోకి భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) నాలుగేళ్ల తర్వాత తిరిగి రావడంతో మరో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) రీఎంట్రీపై చర్చ మొదలైంది. షమీకి ఇంకా భారత జట్టులో ఆడే సత్తా ఉందా? అతని కెరీర్‌లో మరో కంబ్యాక్ సాధ్యమేనా? బెంగాల్ కోచ్ లక్ష్మీరతన్ శుక్లా (Laxmi Ratan Shukla) మాత్రం దీనిపై సానుకూలంగా స్పందించారు. షమీ అద్భుతమైన ఆటగాడని, డ్రెస్సింగ్ రూమ్‌లో సహచరులను ఉత్సాహపరచగల వ్యక్తి అని శుక్లా పేర్కొన్నారు. షమీలో ఇప్పటికీ ఆడాలన్న కసి ఉందని ఆయన నమ్ముతున్నారు. రాబోయే రంజీ ట్రోఫీలో బలమైన ప్రదర్శన ఇచ్చి భారత జట్టులోకి తిరిగి వచ్చే ప్రయత్నం షమీ చేస్తాడన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

దేశవాళీ క్రికెట్‌లో షమీ దూకుడు..

గత రెండేళ్లలో IPLలో షమీ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడం అతని రీఎంట్రీ అవకాశాలకు ప్రతికూలంగా మారింది. అయితే దేశవాళీ క్రికెట్‌లో మాత్రం అతని బౌలింగ్ పదును స్పష్టంగా కనిపించింది.

ఎక్కువమంది చదివినది: IND vs NZ: రాడనుకున్నారా.. రాలేడనుకున్నారా.. 4 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి భువీ రీఎంట్రీ..!

ఇవి కూడా చదవండి

2025-26 సీజన్‌లో షమీ ఏడు రంజీ మ్యాచ్‌ల్లో 37 వికెట్లు పడగొట్టాడు. బెంగాల్ జట్టు సెమీఫైనల్ చేరడంలో అతని ప్రదర్శన కీలకంగా నిలిచింది. విజయ్ హజారే ట్రోఫీలో ఏడు మ్యాచ్‌ల్లో 15 వికెట్లు, సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ఏడు మ్యాచ్‌ల్లో 16 వికెట్లు సాధించాడు.

భువీ కంబ్యాక్ షమీకి బాట చూపిస్తుందా..?

భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీకి ఐపీఎల్ ప్రదర్శన కీలక కారణంగా నిలిచింది. 2025, 2026 సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున 30 మ్యాచ్‌లు ఆడిన భువీ 45 వికెట్లు తీశాడు. కొత్త బంతితో పవర్ ప్లేలో వికెట్లు తీయగల సామర్థ్యం, డెత్ ఓవర్లలో కచ్చితమైన యార్కర్లు అతని బలంగా నిలిచాయి. ఇదే కారణంగా షమీ విషయంలో ఐపీఎల్ ప్రదర్శనకు ప్రాధాన్యం పెరగొచ్చు. అయితే దేశవాళీ క్రికెట్‌లో అతని గణాంకాలు మాత్రం ఆశలు కలిగిస్తున్నాయి.

ఎక్కువమంది చదివినది: IND vs WI: నేను పులి, వాడు సింహం.. టాస్‌కి ముందే వార్నింగ్ ఇచ్చిన అభిషేక్..!

షమీకి రీఎంట్రీ తలుపులు పూర్తిగా మూసుకుపోయాయని చెప్పలేం. దేశవాళీ క్రికెట్‌లో అతని ప్రదర్శన ఇంకా పోరాట పటిమను చూపిస్తోంది. భువనేశ్వర్ కంబ్యాక్ అతనికి ఒక ఉదాహరణగా నిలిచినా, షమీకి తదుపరి అవకాశం రావాలంటే రాబోయే ప్రదర్శనలే కీలకం. ఇప్పుడు అందరి చూపు అతని తదుపరి రంజీ సీజన్‌పైనే..!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us