బ్యాటింగ్, బౌలింగ్ చేయకుండానే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్.. ఎలా వచ్చిందో తెలిస్తే

|

Dec 23, 2024 | 1:00 PM

అదేంటి... బ్యాటింగ్, బౌలింగ్ చేయకుండానే మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గెలుచుకోవడమా? అదెలాగ సాధ్యం? అని అనుకుంటున్నారా? అదెలా సాధ్యమో తెలియాలంటే ఈ స్టోరీ పూర్తిగా చదవాల్సిందే... సాధారణంగా 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అనేది ప్లేయర్ బ్యాట్ లేదా బాల్‌తో అత్యుత్తమ ప్రదర్శన చేసినప్పుడు మాత్రమే ఇస్తారు..

బ్యాటింగ్, బౌలింగ్ చేయకుండానే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్.. ఎలా వచ్చిందో తెలిస్తే
Cricket
Follow us on

సాధారణంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పురస్కారం.. మ్యాచ్‌లో బ్యాటింగ్ లేదా బౌలింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాడికి ఇస్తారు. కానీ ఇక్కడొక ఆటగాడు బ్యాటింగ్, బౌలింగ్ లేకుండానే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఇంతకీ అది సాధ్యమేనా.? ఎలా ఇస్తారు.! అని అనుకుంటున్నారా.. ఈ ఆటగాడు బ్యాటింగ్, బౌలింగ్ ఏం చేయలేదు. కానీ అసాధారణమైన ఫీల్డింగ్ చేసి.. ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి సంఘటన జరగడం ఇదే తొలిసారి కాగా.. అసలు ఇంతకీ ఆ మ్యాచ్ ఏంటి.? ఎప్పుడు జరిగిందో ఇప్పుడు తెలుసుకుందామా..

అది 1986 ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్. పాకిస్తాన్, వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ క్రికెటర్ గస్ లోగీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అతడు బ్యాటింగ్, బౌలింగ్ ఏమి చేయలేదు. కానీ అద్భుతమైన ఫీల్డింగ్ చేసినందుకు ఈ అవార్డు గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్ మనోడు ఏకంగా 3 అద్భుతమైన క్యాచ్‌లు పట్టడమే కాదు.. 2 రనౌట్లు చేశాడు.

మరోవైపు ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 45 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక 144 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విండీస్ 70 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ జట్టు ఓపెనర్లు గ్రీనిడ్జ్(74), హన్స్(59) అర్ధ సెంచరీలతో రాణించారు.

ఇది చదవండి: వాయుగుండం ఉగ్రరూపం.. బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు