
Jasprit Bumrah 4 wickets in T20 World Cup Final: జస్సీ జైసా కోయి నహీ.. (బుమ్రా లాంటి వారు ఎవరూ లేరు) అనే మాటను జస్ప్రీత్ బుమ్రా మరోసారి నిజం చేశాడు. 2026 టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరులో న్యూజిలాండ్ బ్యాటర్లను తన బౌలింగ్‌తో ఉక్కిరిబిక్కిరి చేశాడు. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై భారత్ 255 పరుగులు చేయగా, కివీస్ బ్యాటర్లు చేధనలో తడబడ్డాడు. బుమ్రా తన 4 ఓవర్ల కోటాలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. 3.8 ఎకానమీతో బౌలింగ్ చేసి రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, జిమ్మీ నీషమ్, మాట్ హెన్రీలను అవుట్ చేశాడు.
నెంబర్ 1 బౌలర్: ఈ టోర్నీలో 8 మ్యాచుల్లో బుమ్రా 14 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి కూడా 14 వికెట్లు తీసినప్పటికీ, బుమ్రా ఎకానమీ (6.2) తక్కువగా ఉండటంతో టోర్నీ బెస్ట్ బౌలర్‌గా నిలిచాడు.
అత్యధిక వికెట్లు: టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్‌గా బుమ్రా (39 వికెట్లు) రికార్డు సృష్టించాడు. తద్వారా లసిత్ మలింగ, అన్రిచ్ నోర్కియా రికార్డులను అధిగమించాడు.
ఫైనల్ సెన్సేషన్: టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో 4 వికెట్ల హాల్ సాధించిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.
బుమ్రా తన 14 వికెట్లలో 6 వికెట్లను తనదైన ‘స్లోయర్’ బాల్స్‌తోనే సాధించడం విశేషం. సెమీఫైనల్‌లో హ్యారీ బ్రూక్‌ను, ఫైనల్‌లో రచిన్ రవీంద్రను తొలి బంతికే అవుట్ చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
“గతంలో నా సొంత మైదానంలో ఫైనల్ ఆడి ఓడిపోయాను, కానీ నేడు ఛాంపియన్‌గా నిలవడం ఆనందంగా ఉంది. ఈ టోర్నీకి ముందు నా మనసును ప్రశాంతంగా ఉంచుకున్నాను. అనుభవం ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాను. వేగంగా బౌలింగ్ చేయడం కంటే, తెలివితో బౌలింగ్ చేయడం వల్ల ఫలితాలు వస్తాయని అర్థం చేసుకున్నాను” అని బుమ్రా పేర్కొన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..