300కు పైగా స్ట్రైక్‌రేట్‌.. 12 బంతుల్లో 37 రన్స్‌.. 7 బంతుల్లో మ్యాచ్‌ను మలుపు తిప్పిన వెటరన్‌ ప్లేయర్‌

|

Sep 30, 2022 | 7:46 AM

మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 171 పరుగులు చేయగా, భారత్ లెజెండ్స్ 4 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. ఇండియా లెజెండ్స్ తరఫున నమన్ ఓజా అత్యధికంగా అజేయంగా 90 పరుగులు చేశాడు.

300కు పైగా స్ట్రైక్‌రేట్‌.. 12 బంతుల్లో 37 రన్స్‌.. 7 బంతుల్లో మ్యాచ్‌ను మలుపు తిప్పిన వెటరన్‌ ప్లేయర్‌
Irfan Pathan
Follow us on

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్ అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తోంది. గురువారం జరిగిన తొలి సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా లెజెండ్స్‌ను ఓడించి ఇండియా లెజెండ్స్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 171 పరుగులు చేయగా, భారత్ లెజెండ్స్ 4 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. ఇండియా లెజెండ్స్ తరఫున నమన్ ఓజా అత్యధికంగా అజేయంగా 90 పరుగులు చేశాడు. అతనితో పాటు, ఇర్ఫాన్ పఠాన్ 7వ స్థానంలో దిగి కేవలం 12 బంతుల్లో 37 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఆస్ట్రేలియా తరఫున బెన్ డంక్ 46, అలెక్స్ డూలన్ 35, షేన్ వాట్సన్ 30 పరుగులు చేసినప్పటికీ ఓజా, పఠాన్ ల పవర్ హిట్టింగ్ ముందు ఆస్ట్రేలియా జట్టు నిలబడలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది.

7 బంతుల్లోనే తిప్పేశాడు..

ఇవి కూడా చదవండి

ఇండియా లెజెండ్స్‌కు ఈ విజయం అంత ఈజీగా దక్కలేదు. అయితే ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మెరుపు ఇన్నింగ్స్‌తో మ్యాచ్ మొత్తాన్ని మార్చేశాడు. 7 బంతుల్లో 4 సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టి పఠాన్ మ్యాచ్‌ని ఇండియా లెజెండ్స్ వైపు మళ్లించాడు. 17వ ఓవర్ నుంచి పఠాన్ హిట్టింగ్ ప్రారంభించాడు. అతను డిర్క్ నాన్నెస్‌ బౌలింగ్‌లో మొత్తం 4 సిక్సర్లు బాదాడు. 19వ ఓవర్లో నాన్స్ వేసిన ఓవర్లో పఠాన్ వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. చివరి 2 ఓవర్లలో ఇండియా లెజెండ్స్‌కు 24 పరుగులు అవసరం కాగా నాన్స్ ఓవర్‌లో పఠాన్-ఓజా 21 పరుగులు చేశారు. ఇక బ్రెట్‌ లీ వేసిన చివరి ఓవర్‌లో ఫోర్ కొట్టి ఇండియా లెజెండ్స్‌ విజయాన్ని ఖరారు చేశాడు పఠాన్‌.

నేడు రెండో సెమీ ఫైనల్..
కాగా ఈ సిరీస్‌ లో భారత దిగ్గజాలు ఫైనల్‌కు చేరుకున్నారు. మరో ఫైనల్‌ బెర్తు కోసం శ్రీలంక లెజెండ్స్, వెస్టిండీస్ లెజెండ్స్ పోటీ పడనున్నాయి. ఈరోజు రాయ్‌పూర్‌ వేదికగా మ్యాచ్‌ జరగనుంది.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..