IPL 2025 మెగా వేలం సమీపిస్తోంది. ఈ కాష్ రిచ్ లీగ్ ప్రపంచ క్రికెట్ టాలెంట్ కు ఎప్పుడు వేదికగా నిలుస్తోంది. రికార్డు స్థాయిలో 1,574 మంది క్రికెటర్లు వేలానికి తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అందులో 1,165 మంది భారతీయు ఆటగాళ్లు ఉన్నారు. 320 మంది క్యాప్డ్ ప్లేయర్లు, 1,224 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు, 30 మంది అసోసియేట్ దేశాల నుంచి ప్లేయర్లు ఉన్నారు. ప్లేయర్ల రిజిస్ట్రేషన్ అధికారికంగా ముగిసింది, కాగా మొత్తం 409 మంది విదేశీ క్రికెటర్లు వేలంలో అందుబాటులో ఉన్నారు. ఈసారి ఈ వేలం సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో నవంబర్ 24-25 తేదీల్లో జరగనుంది.
ఫ్రాంచైజీలు గెలుపు గుర్రాలను దక్కించుకునేందుకు సిద్దమవుతున్నాయి. అయితే అందులో ముఖ్యంగా ఏడుగురు విదేశీ స్టార్లపై ఇప్పుడు అందరీ దృష్టి పడింది. వారి కోసం ప్రాంచైజీలు ఎంత డబ్బు పెట్టడానికైన వెనకాడబోవు… ఆ ఏడుగురు స్టార్ ప్లేయర్లు ఎవరో ఓ సారి పరిశీలిద్దాం.
గత సీజన్‌లో తన అరంగేట్రంతోనే సత్తా చాటిన జేక్ ఫ్రేసర్-మెక్‌గర్క్ 9 మ్యాచ్‌ల్లో 330 పరుగులు సాధించడమే కాకుండా 234.04 స్ట్రైక్ రేట్‌తో దుమ్మురేపాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున డేవిడ్ వార్నర్ స్థానాన్ని భర్తీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ యువ ఆటగాడిని దక్కించుకునేందుకు ఫ్రాంచైజీల మధ్య బిడ్డింగ్ వార్ తప్పక జరుగుతుంది.
రాజస్థాన్ రాయల్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన జోస్ బట్లర్ గత కొన్ని సీజన్లుగా స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇంగ్లండ్ వైట్-బాల్ కెప్టెన్‌గా ఉన్న బట్లర్ ఈ సీజన్‌లో భారీ ధరకు అమ్ముడయ్యే అవకాశముంది.
కగిసో రబాడా మంచి వేగంతో బంతులేయడమే కాదు నిలకడగా వికెట్లు తీయగల సామర్థ్యం కలిగిన బౌలర్. ఒంటి చేత్తో మ్యాచ్ ను మలుపుతిప్ప గల పేసర్..అతడిని తమ జట్టులోకి తీసుకునేందుకు చాలా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతాయి. 80 IPL మ్యాచ్‌ల్లో 117 వికెట్లతో రబాడా సత్తా చాటాడు నిరూపించాడు.
2024 వేలంలో మొదటగా అన్‌సోల్డ్‌గా ఉన్న ఫిల్ సాల్ట్ తర్వాత KKRతో జట్టులో చేరాడు. గత సీజన్ లో నిలకడగా రాణించాడు. 182.01 స్ట్రైక్ రేట్‌తో 435 పరుగులు సాధించి తన సత్తాను చాటాడు. ఒక పవర్‌ఫుల్ టాప్ ఆర్డర్ బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా ఉన్న సాల్ట్ కోసం ఈ సీజన్‌లో ఫ్రాంచైజీలు అతడి కోసం పోటిపడటం ఖాయం.
మిచెల్ స్టార్క్ గత సీజన్‌లో కోల్ కత్తా నైట్ రైడర్స్ కోసం ₹24.75 కోట్ల భారీ ధరకు వేలంలో అమ్ముడయ్యి IPL చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ఈ ఆస్ట్రేలియా పేసర్ తన వేగంతో, క్లచ్ ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకుంటాడు. మెగా వేలంలో అతడు టాప్ బైస్‌లో ఒకడిగా నిలుస్తాడు.
107 మ్యాచ్‌లలో 3,157 IPL పరుగులతో క్వింటన్ డికాక్ ఇప్పటి వరకు నిలకడైన ఆటగాడిగా పేరు గాంచాడు. ఒక టాప్ క్లాస్ వికెట్ కీపర్‌గా, ఏ జట్టుకైనా అతను చాలా ముఖ్యమైన ఆటగాడిగా నిలుస్తాడు. జట్లు అతడిని తమ బ్యాటింగ్ లైనప్‌లో చేర్చుకోవాలని కోరుకుంటున్నాయి.
దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ గెరాల్డ్ కోయెట్జీ, మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ వదిలివేయగా, గత సీజన్‌లో ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తూ 13 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ అతడిని తీసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. జెడ్డా లో జరగనున్న మెగా వేలంలో అతడి విలువ పెరిగే అవకాశముంది.