IPL 2024: క్వాలిఫయర్ 2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తగ్గేదేలే.. గణాంకాలు చూస్తే రాజస్థాన్‌కు మడతడినట్లే..

|

May 24, 2024 | 3:48 PM

Sunrisers Hyderabad Records in Qualifier 2: ఈ విధంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ 3 సార్లు క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లు ఆడింది. అందులో రెండుసార్లు గెలిచి ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. SRH IPL చరిత్రలో తన నాల్గవ క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌ని రాజస్థాన్ రాయల్స్‌తో ఆడుతుంది. క్వాలిఫయర్ 1లో కేకేఆర్ చేతిలో ఓడిపోవడంతో హైదరాబాద్ జట్టు కచ్చితంగా కొంత ఒత్తిడికి లోనవుతుంది. అదే సమయంలో ఆర్సీబీని ఓడించి గెలుపొందాలనే ఉద్దేశ్యంతో రాజస్థాన్ జట్టు రంగంలోకి దిగనుంది.

IPL 2024: క్వాలిఫయర్ 2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తగ్గేదేలే.. గణాంకాలు చూస్తే రాజస్థాన్‌కు మడతడినట్లే..
Srh Vs kkr Stats
Follow us on

Sunrisers Hyderabad Records in Qualifier 2: ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రెండో టైటిల్ సాధించే బాధ్యత పాట్ కమిన్స్ భుజాలపై ఉంది. కొత్త కెప్టెన్ నాయకత్వంలో, SRH దూకుడుగా ముందుకెళ్తోంది. ప్లేఆఫ్‌లకు అర్హత సాధించింది. అయితే, క్వాలిఫయర్ 1లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో హైదరాబాద్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ ఫైనల్‌లో చోటు కోసం హైదరాబాద్‌ సవాలు చేయనుంది. క్వాలిఫయర్ 2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గణాంకాలను చూద్దాం..

క్వాలిఫయర్ 2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డ్..

సన్‌రైజర్స్ హైదరాబాద్ IPLలో 2016లో గుజరాత్ లయన్స్‌తో తన మొదటి క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఆడింది. ఇందులో డేవిడ్ వార్నర్ జట్టు 4 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. ఆ తర్వాత జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ 8 పరుగుల తేడాతో ఆర్‌సీబీని ఓడించి తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

ఐపీఎల్ 2018లో కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. క్వాలిఫయర్-1లో హైదరాబాద్ 2 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. దీని తర్వాత క్వాలిఫయర్ 2లో హైదరాబాద్ బలమైన పునరాగమనం చేసి కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 14 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌లోకి ప్రవేశించింది. అయితే, ఫైనల్ మ్యాచ్‌లో SRH చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

IPL 2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడోసారి క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఆడింది. ఇందులో ఆ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడ్డారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 189/3 స్కోరు చేసింది. రిప్లై ఇన్నింగ్స్‌లో, లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, SRH 8 వికెట్లు కోల్పోయి 172 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ 17 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది.

ఈ విధంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ 3 సార్లు క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లు ఆడింది. అందులో రెండుసార్లు గెలిచి ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. SRH IPL చరిత్రలో తన నాల్గవ క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌ని రాజస్థాన్ రాయల్స్‌తో ఆడుతుంది. క్వాలిఫయర్ 1లో కేకేఆర్ చేతిలో ఓడిపోవడంతో హైదరాబాద్ జట్టు కచ్చితంగా కొంత ఒత్తిడికి లోనవుతుంది. అదే సమయంలో ఆర్సీబీని ఓడించి గెలుపొందాలనే ఉద్దేశ్యంతో రాజస్థాన్ జట్టు రంగంలోకి దిగనుంది.

మరిన్న క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..