నీ ఆటకో దండం సామీ.! వెళ్లి రంజీ ఆడుకో.. టీ20 వరల్డ్‌కప్ కోహ్లీ టీమ్‌మేట్‌కి నో ఛాన్స్.. ఎవరంటే.?

|

Apr 17, 2024 | 11:12 AM

టీమిండియా ప్రధాన బౌలరైన మహ్మద్ సిరాజ్.. ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న సిరాజ్.. ఇప్పుడు ఆ టీంకు పెద్ద భారంగా మారాడు. అతడి పేలవ ఫామ్‌కు గత మ్యాచ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.

నీ ఆటకో దండం సామీ.! వెళ్లి రంజీ ఆడుకో.. టీ20 వరల్డ్‌కప్ కోహ్లీ టీమ్‌మేట్‌కి నో ఛాన్స్.. ఎవరంటే.?
Royal Challengers Bangalore
Follow us on

టీమిండియా ప్రధాన బౌలరైన మహ్మద్ సిరాజ్.. ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న సిరాజ్.. ఇప్పుడు ఆ టీంకు పెద్ద భారంగా మారాడు. అతడి పేలవ ఫామ్‌కు గత మ్యాచ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. టీ20 ప్రపంచకప్ దగ్గర పడుతున్న సమయంలో.. ప్రస్తుతం అతడు కనబరుస్తోన్న ఆటతీరు.. టీమిండియాలో చోటుకే ఎసరు తీసుకొచ్చింది.

ఐపీఎల్ 2024లో ఇప్పటిదాకా 6 మ్యాచ్‌లాడిన సిరాజ్.. 57 సగటుతో 4 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఇలాంటి సమయంలో సిరాజ్ స్థానంలో టీ20 వరల్డ్‌కప్ జట్టులో మరో బౌలర్‌కు ఛాన్స్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. మయాంక్ యాదవ్, అర్షదీప్ సింగ్‌లతో పాటు మరికొంతమంది యువ బౌలర్లు కూడా అద్భుత ప్రదర్శన కనబరుస్తుండటంతో సిరాజ్ ప్లేస్ డౌట్‌లానే ఉంది.

ప్రస్తుతం మహ్మద్ సిరాజ్ తన ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. ప్రపంచకప్ రేసులో ఉన్న ఇతర బౌలర్లతో పోలిస్తే.. సిరాజ్‌కు కష్టమే. టీ20 ప్రపంచకప్ వెస్టిండీస్, అమెరికాలో జరగాల్సి ఉంది, ఆ పిచ్‌లు స్పిన్నర్లకు సాయం అందిస్తాయి. దీన్ని బట్టి చూస్తే భారత జట్టు 3 కంటే ఎక్కువ పేసర్లతో బరిలోకి దిగదు. ఇక నాలుగో ఎంపికగా హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉండటంతో.. సిరాజ్ ప్లేస్ డౌటే.!