India vs West Indies: విండీస్‌తో టీ20 సిరీస్‌.. టాస్‌ గెలిచిన పూరన్‌.. టీమిండియా ప్లేయింగ్‌ XI ఎలా ఉందంటే?

|

Jul 29, 2022 | 8:02 PM

India vs West Indies,1st T20: విండీస్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా ఇప్పుడు టీ20 ఫార్మాట్‌లో ఆతిథ్య జట్టుతో తలపడనుంది. మొత్తం 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌

India vs West Indies: విండీస్‌తో టీ20 సిరీస్‌.. టాస్‌ గెలిచిన పూరన్‌.. టీమిండియా ప్లేయింగ్‌ XI ఎలా ఉందంటే?
India Vs West Indies
Follow us on

India vs West Indies,1st T20: విండీస్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా ఇప్పుడు టీ20 ఫార్మాట్‌లో ఆతిథ్య జట్టుతో తలపడనుంది. మొత్తం 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఈ ఈ సిరీస్‌కు తిరిగి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోనున్నాడు. అతనితో పాటు రిషబ్ పంత్ కూడా జట్టులోకి రానున్నాడు. కాగా T20 ప్రపంచ కప్‌కు మూడు నెలల కన్నా తక్కువ సమయం మిగిలి ఉన్నందున, కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ తమ కోర్ టీమ్‌ను బలోపేతం చేయడానికి ఈ సిరీస్ చాలా కీలకం. మరోవైపు టీ20 ఫార్మాట్‌లో వెస్టిండీస్ బలమైన జట్టు. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య ఆసక్తికర పోరు జరగవచ్చునని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ ముందుగా పర్యాటక జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

భారత్

రోహిత్ శర్మ(కెప్టెన్‌), రిషబ్ పంత్(వికెట్‌ కీపర్‌), శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, అర్ష్‌దీప్ సింగ్

వెస్టిండీస్

షమర్ బ్రూక్స్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, నికోలస్ పూరన్(కెప్టెన్‌ అండ్‌ వికెట్‌ కీపర్‌), కైల్ మేయర్స్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, ఓడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్, కీమో పాల్

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..